View

Dochay Movie Review

Friday,April24th,2015, 07:48 AM

చిత్రం - దోచేయ్
బ్యానర్ - శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్
నటీనటులు - నాగచైతన్య, కృతిసనన్, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, రవిబాబు, సన, సప్తగిరి, బ్రహ్మానందం, రఘు, భరత్ తదితరులు
సంగీతం - సన్నీ.యం.ఆర్
సినిమాటోగ్రఫీ - రిచర్డ్ ప్రసాద్
ఎడిటింగ్ - కార్తీక శ్రీనివాస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సుధీర్ ఈదర
కో - ప్రొడ్యూసర్ - భోగవల్లి బాపినీడు
నిర్మాత - బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - సుధీర్ వర్మ
విడుదల తేదీ - 24.4.2015

స్వామి రారా' చిత్రంతో దర్శకునిగా భేష్ అనిపించుకుని, ఒక్కసారిగా టాలీవుడ్ పెద్దల దృష్టిని ఆకర్షించాడు సుధీర్ వర్మ. ప్రతిభను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుండే అక్కినేని కుటుంబం చిన్న చిత్రంతో కెరీర్ ప్రారంభించిన సుధీర్ వర్మను నమ్మి 'దోచేయ్'కి అవకాశం ఇచ్చింది. ఇలా అప్ కమింగ్ డైరెక్టర్ తో సినిమా చేయడం అనేది మెచ్చుకోదగ్గ విషయమే. సుధీర్ వర్మ ప్రతిభను నమ్మి, నాగచైతన్య 'దోచేయ్' సినిమా చేశాడు. మరి.. చైతూ నమ్మకం నిలబడుతుందా? దర్శకునిగా సుధీర్ వర్మ చేసిన ఈ మలి ప్రయత్నం అతని కెరీర్ ని మరో మెట్టు పైకి ఎక్కిస్తుందా?... చూద్దాం.

à°•à°¥
చందు (అక్కినేని నాగచైతన్య) తన ఫ్రెండ్స్ తో కలిసి డబ్బులు దోచేస్తుంటాడు. దోచేసిన డబ్బుని పంచుకుంటారు. అలాగే పోలీసులకు లంచం ఇచ్చి ఎక్కడా దొరికిపోకుండా మెనేజ్ చేస్తుంటారు. చందు తండ్రి సీతారాం (రావు రమేష్) ఖైదీగా జైల్లో ఉంటాడు. తన తండ్రి కోరికను తీర్చడం కోసం దోచేసిన డబ్బుతో తన చెల్లెల్ని మెడిసిన్ చదివిస్తుంటాడు చందు. తన చెల్లెలు కాలేజ్ లోనే మెడిసిన్ చదువుతున్న మీరా (కృతిసనాన్)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు చందు.

మరోవైపు సిటీలో తన మనుషుల ద్వారా బ్యాంక్ రాబరీలు, దోపిడీలు చేయిస్తుంటాడు మాణిక్యం. అలా ఓ బ్యాంక్ రాబరీ చేసిన మాణిక్యం మనుషులు ఆ డబ్బు మొత్తం మాణిక్యానికి ఇవ్వకుండా తామే పంచుకోవాలని అనుకుంటారు. అత్యాశతో ఘర్షణపడి ఒకరినొకరు చంపేసుకుంటారు. కాకాతీళయంగా ఆ ఫ్లాట్ కి వెళ్లిన చందు ఆ డబ్బును కొట్టేసి హోం మినిష్టర్ పి.ఏ కి ఇచ్చి తన తండ్రిని జైలు నుంచి విడిపించే ప్రయత్నం చేస్తాడు. ఎప్పటిలా తనకు లంచం ఇవ్వలేదని ఓ పోలీస్ చందుపై పగ పడతాడు. ఆ డబ్బు కొట్టేసింది చందునే అన్న విషయం తెలుసుకున్న మాణిక్యం షాకక్ అవుతాడు? అసలు చందు తండ్రి జైల్లో ఎందుకున్నాడు? మాణిక్యంతో చందుకున్న లింకేంటి? మాణిక్యంలాంటి వ్యక్తికి తనదైన శైలిలో చందు ఎలా బుద్ది చెప్పాడు? పగ బట్టిన పోలీస్ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అనేదే ఈ చిత్రం సెకండాఫ్.

నటీనటుల పర్ఫార్మెన్స్
ఈ చిత్రం మొత్తం చందు కారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. ఎత్తులకు పై ఎత్తులు వేసి, ఎదుటి వ్యక్తిని చిత్తు చేసే చందు పాత్రను నాగచైతన్య చాలా బాగా చేశాడు. ఈ పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ లో నిర్లక్ష్య ధోరణి, చూపుల్లో అలక్ష్యం, చేతల్లో వేగం, బుద్ధిబలం... ఇవన్నీ నాగచైతన్య బాగా ప్రదర్శించగలిగాడు. కృతి సనన్ బాగుంది. పెద్దగా అభినయించడానికి స్కోప్ లేదు. సినిమాలో ఉన్న ఇతర పాత్రల్లో మాణిక్యంగా పోసాని తనదైన శైలిలో విలనిజం పండించడంతో పాటు నవ్వించాడు. టీ అమ్ముకునే కుర్రాడిగా, కోర్టులో లాయర్ లా చెలరేగిపోయే పాత్రను సప్తగిరి బాగా చేసాడు. చలపతిరావు, సన, బ్రహ్మానందం, రవిబాబు, రావు రమేష్, జీవా తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఐటమ్ సాంగ్ లో మధురిమ మెరిసింది.

సాంకేతిక వర్గం
'స్వామి రారా' వంటి లైటర్ వీన్ కామెడీ మూవీతో దర్శకునిగా పరిచయం అయిన సుధీర్ వర్మ... ఈ చిత్రాన్నికూడా అదే పంథాలో తీశాడు. సీన్స్ స్టయిలిష్ గా ఉన్నాయి. కారు ఛేజ్ బాగుంది. చేయని నేరానికి తండ్రిని జైలుపాలు చేసిన వారిపై పగ తీర్చుకోవాలనీ, చెలెల్ల్ని చదివించాలనేది హీరో లక్ష్యాలైనా.. దీన్ని సాధించే విధానాన్నిదర్శకుడు లైటర్ వీన్ గా చూపించాడు. సినిమా మొత్తం తేలికగా సాగిపోతుంది. సంభాషణలు ఫర్వాలేదనిపించే విధంగా ఉన్నాయి. పాటలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. రీ-రికార్డింగ్ కూడా ఫర్వాలేదనిపించుకుంది. రిచర్డ్ ప్రసాద్ కెమెరా వర్క్ కలర్ ఫుల్ గా ఉంది. కథ డిమాండ్ మేరకు నిర్మాతలు ఖర్చుపెట్టారు.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ సినిమా ఫస్టాఫ్ ఓహో అనే విధంగా ఉండదు. కాకపోతే బోర్ అనిపించదు. నాగార్జున ట్విట్టర్లో పెట్టినట్లుగా చివరి 30 నిమిషాల సినిమా బాగుంది. ముఖ్యంగా మాణిక్యం పాత్రతో చందు ప్లాన్ చేసే నకిలీ పోలీస్ స్టేషన్, నకిలీ కోర్టు క్రియేట్ చేసిన సీన్ ఫుల్ గా నవ్విస్తుంది. అలాగే, అక్కడక్కడా వచ్చే సప్తగిరి పాత్ర కూడా ఎంటర్ టైన్ చేస్తుంది. ముఖ్యంగా కోర్టులో లాయర్ లా సప్తగిరి చేలరేగిపోయిన విధానం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. సినిమా హీరో పాత్రలో బ్రహ్మానందం కూడా నవ్వించాడు. ఓవరాల్ గా సినిమా ఎంటర్ టైనింగ్ వేలో సాగుతుంది కాబట్టి, ఎంజాయ్ చేయొచ్చు. ఇతరులను దోచేయడానికి హీరో వేసే ఎత్తులు ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఈ కథను నాగచైతన్య అంగీకరించడం గొప్ప విషయం. ఎందుకంటే, ఏ హీరో అయినా ఫుల్ మాస్ యాక్షన్ మూవీ చేయాలనుకుంటారు. అందుకు పూర్తి భిన్నంగా లైటర్ వీన్ గా ఈ చిత్రం సాగుతుంది. దీన్నిబట్టి డిఫరెంట్ మూవీస్ చేయడానికి నాగచైతన్య ఆసక్తి కనబరుస్తున్న విషయం అర్థమవుతుంది. సినిమాలో 'స్వామి రారా' షేడ్స్ కనిపించినప్పటికీ, ఎంటర్ టైన్ మెంట్ ఉంది కాబట్టి, చూసేస్తారు.

ఫైనల్ గా చెప్పాలంటే.. సంభాషణల్లో కానీ సన్నివేశాల్లో కానీ టార్చ్ లైట్ పెట్టి వెతికినా బూతు కనిపించదు. సో.. ఈ నీట్ ఎంటర్ టైనర్ ని పిల్లలు, పెద్దలూ హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. నాగచైతన్య ఇటు యూత్ కీ నచ్చుతాడు.. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తమ పక్కింటి అబ్బాయిలా భావిస్తారు కాబట్టి, ఈ ఎంటర్ టైనర్లో చైతూ వాళ్లకి నచ్చుతాడు. ఇక... దోచేయడానికి వేసే ఎత్తులు పిల్లలను ఆకట్టుకుంటాయి. టోటల్ గా ఇది 'ఫ్యామిలీ ప్యాకేజ్ మూవీ'.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !