View

Yevade Subramanyam movie review

Saturday,March21st,2015, 10:08 AM

చిత్రం - ఎవడే సుబ్రమణ్యం
బ్యానర్ - స్వప్న సినిమాస్
నటీనటులు - నాని, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, షావుకారు జానకి, రీతూవర్మ, కృష్ణంరాజు, నాజర్ తదితరులు
సంగీతం - రదన్
సినిమాటోగ్రఫీ - రాకేశ్, నవీన్
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత - ప్రియాంక దత్
రచన, దర్శకత్వం - నాగ అశ్విన్

'అష్టా చమ్మా' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన నాని, గిరి గీసుకుని ఓ చట్రంలో ఇరుక్కోకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అలా మొదలయ్యింది, ఈగ, సెగ, పైసా, ఆహా కళ్యాణం... ఇలా ఒకదానికొకటి సంబంధంలేకుండా డిఫరెంట్ జానర్ లో సినిమాలు చేసి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా 'ఎవడే సుబ్రమణ్యం' అంటూ ఓ డిఫరెంట్ సినిమా చేసాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. శేఖర్ కమ్ముల దగ్గర దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన నాగ అశ్విన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్స్ ని అందించే శేఖర్ కమ్ముల అసిస్టెంట్ గా నాగ అశ్విన్ కూడా ఇలాంటి ఫార్మూలాతోనే ఈ సినిమా చేసాడు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తనయ ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వైవిధ్యభరితమైన సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే తపన ఉన్న టీమ్ ఈ సినిమాకి కుదిరింది. మరి... వారందరూ కలిసి చేసిన ఈ ప్రయోగం ప్రేక్షకాదరణ పొందే విధంగా ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం.

à°•à°¥
సుబ్రమణ్యం (నాని) చాలా తెలివైనవాడు. జీవితంలో చాలా త్వరగా పైకి ఎదగాలనే మనస్తత్వం కలవాడు. ఉన్నదానితో సరిపెట్టుకోకుండా,ఇంకా ఇంకా ఏదో కావాలని కోరుకుంటాడు. ఇవన్నీ దక్కించుకునే ప్రయత్నంలో చాలా ప్రాక్టికల్ గా, స్వార్థంగా లైఫ్ ని లీడ్ చేస్తుంటాడు. పశుపతి (నాజర్) కంపెనీకి జనరల్ మేనేజర్ సుబ్రమణ్యం. పశుపతి కోరిక మేరకు నీతి, నిజాయితీగా వ్యాపారం చేస్తున్న రామయ్య (కృష్ణంరాజు) కంపెనీ షేర్స్ ని కైవసం చేసుకుని, ఆ కంపెనీని పశుపతి గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ లో కలిపేయడానికి ప్రయత్నాలు చేస్తాడు సుబ్రమణ్యం. ఈ డీల్ కనుక సెట్ అయితే, తన కూతురు రియా (రీతూవర్మ) ను సుబ్రమణ్యంకి ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరిస్తాడు పశుపతి. తండ్రిలానే చాలా ప్రాక్టికల్ గా ఉండే రియా కూడా డీల్ ఓకే అయితే.. సుబ్రమణ్యంని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది. సుబ్రమణ్యం కూడా చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తాడు కాబట్టి ఈ డీల్ ని సెట్ చేసి, రియాను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.
సుబ్రమణ్యంకి రిషి (విజయ్ దేవరకొండ) అనే ఫ్రెండ్ ఉంటాడు. చిన్నప్పట్నుంచి సుబ్రమణ్యంకి క్లోజ్ ఫ్రెండ్. తను ఎలా జీవించాలనుకుంటే అలా జీవితాన్ని గడిపే కుర్రాడు రిషి. పక్కన మనిషి ఎలాపోతే నాకేంటి అనుకునే మనస్తత్వం రిషిది కాదు. చిన్నప్పట్నుంచి తన ఫ్రెండ్ సుబ్రమణ్యంతో కలిసి దూద్ కాశి వెళ్లాలనుకుంటాడు. పెద్దయిన తర్వాత కూడా సుబ్రమణ్యంతో కలిసి దూద్ కాశి వెళ్లాలనే టార్గెట్ తో ఉంటాడు. ఈ ఇద్దరికి ఆనంది (మాళవిక నాయర్) తారసపడుతుంది. ఆనంది దగ్గర ఉన్న షేర్స్ ని కొంటే రామయ్య కంపెనీని పశుపతి గ్రూప్ ఆఫ్ కంపెనీలో చేర్చవచ్చని తెలుసుకున్న సుబ్రమణ్యం అందుకోసం ట్రై చేస్తుంటాడు. ఆ సమయంలో రిషి ఓ యాక్సిటెండ్ లో చనిపోతాడు. దూద్ కాశిలో రిషి అస్తకిలు కలపాలని, అందుకోసం తనతో పాటు వస్తే, షేర్స్ ని తనకు ఇస్తానని సుబ్రమణ్యం దగ్గర చెబుతుంది ఆనంది. తన టార్గెట్ ని చేరుకోవడానికి ఆనందితో దూద్ కాశి బయలుదేరతాడు సుబ్రమణ్యం. ఈ జర్నీలో సుబ్రమణ్యం ఏం తెలుసుకున్నాడు? ప్రాక్టికల్ గా ఉండే అతను ఎలా మారిపోయాడు? దూద్ కాశి నుంచి వచ్చిన తర్వాత రియాని పెళ్లి చేసుకున్నాడా? తనతో పాటు దూద్ కాశి వరకూ జర్నీ చేసిన ఆనందిని ప్రేమించడం మొదలుపెడతాడా? అనేదే ఈ చిత్రం సెకండాఫ్.

నటీనటుల పర్ఫార్మెన్స్
బాగా డబ్బు సంపాదించడం, జీవితంలో పైకి రావడం.. ఇదే లక్ష్యంతో అడుగులు వేసి, ఆ తర్వాత జీవితం అంటే ఇది కాదు.. వేరే ఉందని తెలుసుకునే రెండు కోణాలున్న సుబ్రమణ్యం పాత్రను నాని బాగా చేశాడు. హై క్లాస్ కంపెనీ జనరల్ మేనేజర్ గా హుందాగా కనిపించాడు. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలను అంగీకరించాలంటే హీరోకి గట్స్ ఉండాలి. ఆ రకంగా ఈ సినిమాని అంగీకరించి చేసినందుకు నానిని తప్పకుండా అభినందించాల్సిందే. ఆనంది పాత్రను మాళవికా నాయర్ బాగా చేసింది. హై క్లాస్ సొసైటీ అమ్మాయి పాత్రలో రీతూ వర్మ ఒదిగిపోయింది. సరదా కుర్రాడు రిషి పాత్రను విజయ్ దేవరకొండ బాగా చేశాడు. ఇక.. రామయ్య పాత్రను కృష్ణంరాజుతో చేయించడం బాగుంది. ఆ పాత్రను ఆయన చేయడంతో ఓ నిండుదనం వచ్చింది. ఇతర పాత్రల్లో నాజర్, పవిత్రా లొకేష్ తదితరులు ఒదిగిపోయారు.

సాంకేతిక వర్గం
ఈ కథ వినూత్నంగా ఉంది. టేకింగ్ కూడా బాగుంది. స్నేహితుడి కోరికని తీర్చడం కోసం దూద్ కాశీ వెళ్లాలనే పాయింట్ చుట్టూ కథ అల్లి, దర్శకుడు నాగ అశ్విన్ ఈ సినిమా తీశాడు.. పాయింట్ చిన్నదే అయినా చక్కని స్ర్కీన్ ప్లే తో నడిపించాడు. రాధన్ స్వరపరచిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా చల్లగాలి పాట చాలా కూల్ గా ఉంది. ఇతర పాటలకు సంబంధించిన ట్యూన్స్ కూడా క్యాచీగా ఉన్నాయి. హిమాలయాల అందాలను రాకేష్ నవీన్ అద్భుతంగా తన కెమెరాలో బంధించాడు. సినిమా కనువిందుగా ఉంది. ఇలాంటి కథతో సినిమా అంటే వ్యయ ప్రయాసలు సహజం. నిర్మాణం రిస్క్, బాక్సాఫీస్ ఫలితం కూడా రిస్కే. కానీ, ఓ ఫీల్ గుడ్ మూవీ తీయాలనే లక్ష్యంతో ప్రియాంకా దత్ ఈ చిత్రం తీసింది. పైగా, వైజయంతి మూవీస్ పతాకంపై ఆమె తండ్రి భారీ కమర్షియల్ హిట్ చిత్రాలు తీశారు. ఈ సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. కరెక్ట్ గా చెప్పాలంటే మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ అభిరుచికి అనుగుణంగా ఉంది. ఏదేమైనా ప్రియాంక దత్ చేసింది మంచి ప్రయత్నమే. లెన్స్ పెట్టి వెతికినా బూతులు కనిపించవు. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి.

ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ చిత్రం ఫస్టాఫ్ లో సుబ్రమణ్యం పాత్ర చాలా ప్రాక్టికల్ గా వ్యవహరిస్తుంది. అందుకని, ప్రేక్షకులు మనసు వరకూ వెళ్లదు. ఫస్టాఫ్ మొత్తం చాలా ప్రాక్టికల్ గా చూసేస్తారు. ఫస్టాఫ్ స్లోగా సాగడం ఓ చిన్న మైనస్. సెకండాఫ్ లో సీన్ మారుతుంది. సుబ్రమణ్యం పాత్ర మనసు మారినట్లే.. ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా మారుతుంది. దాంతో కథకి కనెక్ట్ అయిపోతారు. సెకండాఫ్ లో అక్కడక్కడా వచ్చే హార్ట్ టచింగ్ సీన్స్ నిజంగానే టచింగ్ గా ఉన్నాయి. వెరసి థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు 'ఎవడే సుబ్రమణ్యం'కి తమ మనసులో కొంచెం చోటిస్తారు.

ఫైనల్ గా చెప్పాలంటే... హిమాలయాల ప్రయాణం బాగుంది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూడ్డానికి థియేటర్ కి ప్రయాణం కావచ్చు. అయితే.. బి, సి సెంటర్స్ వారి ప్రయాణం ఎలా ఉంటుంది? అనేది వేచి చూడాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నిన్న విడుదలైన 'తుంగభద్ర' మంచి మాస్ మూవీ. సో.. మాస్ ఆ సినిమాకీ, క్లాస్ ఈ సినిమాకీ వెళ్లే అవకాశం ఉంది. ఆ విధంగా వీకెండ్ లో ఈ రెండు చిత్రాల వసూళ్లు బాగుంటాయని ఊహించవచ్చు. లేదా క్లాస్, మాస్ అనే తేడా లేకుండా సినిమాలను ఎంజాయ్ చేసే సినీ ప్రియులు డిఫరెంట్ జానర్ లో రూపొందిన ఈ రెండు సినిమాలను ఆస్వాదించవచ్చు. మరో విశేషమేంటంటే నాని హీరోగా రూపొందిన 'జెండా పై కపిరాజు' కూడా ఈ రోజే విడుదలయ్యింది. సరైన పబ్లిసిటీ లేక ఈ సినిమా విడుదలైన విషయం పెద్దగా ప్రేక్షకుల వరకూ రీచ్ అవ్వలేదు. నాని నుంచి వచ్చిన 'ఎవడే సుబ్రమణ్యం' క్లాస్ అయితే, 'జెండా పై కపిరాజు' మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండూ సినిమాలు ఆయా వర్గాలకు కరెక్ట్ గా కనెక్ట్ అయితే, కొంతకాలంగా హిట్స్ లేక సతమతమవుతున్న నాని సక్సెస్ ట్రాక్ ఎక్కినట్టే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !