View

నాన్నకు ప్రేమతో మూవీ రివ్య్వూ

Wednesday,January13th,2016, 07:42 AM

చిత్రం - నాన్నకు ప్రేమతో
బ్యానర్ - రిలయన్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పి
నటీనటులు - ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, మధుబాల తదితరులు
సంగీతం - దేవిశ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ - విజయ్ చక్రవర్తి
ఎడిటింగ్ - నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సుధీర్
నిర్మాత - బి.వి.యస్.యన్.ప్రసాద్
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - సుకుమార్


నాన్నకు ప్రేమతో అంటూ ఎన్టీఆర్ ఎంతో ప్రేమగా చేసిన సినిమా 'నాన్నకు ప్రేమతో'. ఈ చిత్రంలో తండ్రి పట్ల ఓ కొడుకుకి ఎంత ప్రేమ ఉందనేది ప్రధానాంశం. రియల్ లైఫ్ లో కూడా మా నాన్న అంటే నాకెంతో ప్రేమ.. అందుకే ఈ చిత్రాన్ని ఎంతో ఇష్టపడి చేశానని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. మంచి కాన్సెప్ట్ తో సినిమాలు తీసే దర్శకుడు సుకుమార్ ఈ చిత్రంలో ఎన్టీఆర్ ని వినూత్నంగా ఆవిష్కరించాడు. భారీ నిర్మాణ వ్యయంతో బి.వి.యస్.యన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి... సంక్రాంతి పండగ మొదటి రోజున తెరకొచ్చిన ఈ 'నాన్నకు ప్రేమతో' రేసులో ఏ స్థానం దక్కించుకుంటుంది? అనేది మిగతా మూడు చిత్రాల విడుదల తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం...


à°•à°¥
అభి (ఎన్టీఆర్) లండన్ లో కెయంసి (లూజర్స్ కంపెనీ) ఆరంభిస్తాడు. ఈ కంపెనీలో చేరినవారు ఓ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తుంటారు. అభి తండ్రి సుబ్రమణ్యం (రాజేంద్రప్రసాద్) కి క్యాన్సర్ అటాక్ అవుతుంది. ఫైనల్ స్టేజ్ లో ఉన్న క్యాన్సర్ తో చివరి రోజులు గడుపుతుంటారు ఆయన. చివరి రోజుల్లో తండ్రి ఆనందంగా ఉండాలని పెద్ద కొడుకు రాజీవ్ కనకాల తన ఇంటికి తీసుకువస్తాడు. అయితే తమ తండ్రి ఆనందంగా లేడని, ఆయనకు ఓ చివరి కోరిక ఉందని ముగ్గురు కొడుకులకి తెలుస్తుంది. ఆ కోరిక తనను బిజినెస్ లో మోసం చేసిన కృష్ణమూర్తి (జగపతిబాబు) నాశనం చూడటం. కృష్ణమూర్తి వల్ల మిలీయనీర్ అయిన రమేష్ చంద్రప్రసాద్ ఐడెంటీ మార్చుకుని సుబ్రమణ్యంగా బ్రతకాల్సి వస్తుంది. ఈ విషయాన్ని తన ముగ్గురు కొడుకులకి చెప్పి, కృష్ణమూర్తి అంతం చూడమని చెబుతాడు.


కృష్ణమూర్తి మామూలు వ్యక్తి కాదు. కె.కె గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్ పర్సన్. దాంతో లాయర్ అయిన పెద్ద కొడుకు రాజీవ్ కనకాల ఇది జరిగే పనికాదని డిసైడ్ అవుతాడు. తండ్రి దగ్గర మాత్రం కృష్ణమూర్తిని కోర్టు కీడ్చి అతనిని సర్వనాశం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పి తండ్రిని సంతోషపెట్టడానికి ట్రై చేస్తుంటాడు. రెండో కొడుకు కూడా తండ్రి కోరికను తీర్చడం కష్టమని ఫిక్స్ అవుతాడు. మూడో కొడుకు అయిన అభి (ఎన్టీఆర్) మాత్రం తన తండ్రి చివరి కోరిక తీర్చాలనే సంకల్పంతో కృషి చేయడం మొదలుపెడతాడు. తొలి ప్రయత్రంగా కృష్ణమూర్తి కూతురు దివ్యాంక (రకుల్ ప్రీత్ సింగ్) ని ప్రేమలోకి దింపడానికి ప్రయత్నాలు చేస్తాడు. అయితే ఆమెను నిజంగానే ప్రేమించడం మొదలుపెడతాడు అభి. దివ్యాంక ద్వారా ఓ సందర్భంలో కృష్ణమూర్తిని అభి కలుస్తాడు. కృష్ణమూర్తికి తను మోసం చేసిన రమేష్ చంద్రప్రసాద్ కొడుకు అభి అని తెలుస్తుంది. తన కోట్ల ఆస్తిని కొల్లగొట్టడానికే అభి ప్లాన్ ప్రకారం తమ జీవితంలోకి వచ్చాడని దివ్యాంకకు ప్రూవ్ చేస్తాడు కృష్ణమూర్తి. దాంతో అభిని ద్వేషించడం మొదలుపెడుతుంది దివ్యాంక. కట్ చేస్తే...


తండ్రిని నాశనం చేయడానికి వచ్చిన అభి ఎత్తులను చిత్తు చేస్తుంటుంది దివ్యాంక. ఓ వైపు కృష్ణమూర్తి, అభి మధ్య మైండ్ గేమ్ జరుగుతుంటుంది. నెల రోజుల్లో రోడ్డు మీదకి తీసుకువస్తానని కృష్ణమూర్తితో చాలెంజ్ చేస్తాడు అభి. మరోవైపు రమేష్ చంద్రప్రసాద్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తూ ఉంటుంది. ఫైనల్ గా కృష్ణమూర్తిని నాశనం చేయడానికి అభి ఏం చేశాడు? తన తండ్రిలానే కృష్ణమూర్తి ఐడెంటిటీ మార్చుకుని బతికేలా చేయడానికి ఎలాంటి ప్లాన్ వేశాడు? అభికి దివ్యాంక దగ్గరవుతుందా అనేదే మిగతా కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్
లండన్ లో నివసించే కుర్రాడు అభిరామ్ గా ఎన్టీఆర్ బాగా మౌల్డ్ అయ్యాడు. వెరైటీ హెయిర్ స్టయిల్, గత చిత్రాలకు భిన్నమైన కాస్ట్యూమ్స్.. ఇలా పూర్తిగా కొత్తగా కనిపించాడు. నటన విషయంలో ఎన్టీఆర్ కి పేరు పెట్టడానికి ఏముంటుంది? అభిరామ్ పాత్రను బాగా చేశాడు. సినిమా చివర్లో ఆస్పత్రి ఎపిసోడ్ లో ఉద్వేగానికి గురయ్యే సీన్ ప్రేక్షకులను టచ్ చేస్తుంది. ఎన్టీఆర్ మార్క్ మాస్ స్టెప్స్ కి పెద్దగా స్కోప్ లేదు కాబట్టి, డ్యాన్సులు గురించీ, ఆల్ మోస్ట్ మైండ్ గేమ్ తోనే కథ సాగుతుంది కాబట్టి, రెచ్చిపోయి ఫైట్స్ చేయడానికి పెద్దంతగా స్కోప్ లేదు. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామరస్ గా ఉంది. విదేశాల్లో ఉండే అమ్మాయి కాబట్టి, తెలుగింగ్లీష్ కలిపి మాట్లాడుతుంది. అందుకని తను చెప్పిన డబ్బింగ్ సూట్ అయ్యింది. జగపతిబాబు సుపర్బ్. యాంటీ షేడ్స్ ఉన్న కోటీశ్వరుడి పాత్రలో చాలా స్టయిలిష్ గా, హుందాగా ఉన్నారు. తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్ నటన చాలా బాగుంది. చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తో ఆయన నటన టచింగ్ గా ఉంది. మధుబాల కొన్ని నిమిషాలే కనిపించినా గుర్తుండిపోతుంది. ఎన్టీఆర్ అన్న పాత్రల్లో రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ బాగా సూట్ అయ్యారు. ముఖ్యంగా ఓ ఎమోషనల్ సీన్ లో రాజీవ్ నటన బాగుంది. ఇంకా ఆశిష్ విద్యార్థి, ఓ నలుగురైదుగురు తెలుగు నటీనటులతో పాటు చిన్న చిన్న పాత్రల్లో విదేశీయులు కనిపిస్తారు.


సాంకేతిక వర్గం
తండ్రి పగను తీర్చుకునే తనయుడి కథ ఇది. చాలా సింపుల్. ఇలాంటి కథాంశాలు కొత్త కాదు. అందుకే స్ర్కీన్ ప్లే వైజ్ గా డిఫరెంట్ రూట్ లో వెళ్లాలని సుకుమార్ లెక్కలేసుకుని కథ రెడీ చేసుకున్నాడు. ప్రధానంగా మైండ్ గేమ్ తో ఈ కథ సాగుతుంది. దర్శకుడు కాక ముందు సుకుమార్ లెక్కల మాస్టారు కాబట్టి, ఫైట్స్ లో కూడా హీరోతో లెక్కలేయించేశాడు. హీరో, విలన్ గెలుపు ఓటములు కూడా లెక్కల మీదే ఆధారపడుతుంది. ఎన్టీఆర్ మార్క్ పంచ్ డైలాగ్స్ వినిపించవు. ఆల్ మోస్ట్ క్లాస్ డైలాగ్సే. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటల్లో 'ఐ వాన్న ఫాలో ఫాలో యు..' పాట వెంటాడుతుంది. మిగతా పాటలు ఓకే అనే విధంగా ఉన్నాయి. విజయ్ చక్రవర్తి కెమెరా వండర్ అనాలి. లొకేషన్స్ అన్నీ కనువిందుగా ఉన్నాయి. ప్రతి సీన్ రిచ్ గా ఉంటుంది. దాన్నిబట్టి నిర్మాత ఖర్చుకు వెనకాడలేదని అర్థమైపోతుంది.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ సినిమాలో హీరో అతి తెలివితేటలున్నవాడు. సుకుమార్ అంతే. సినిమా చూసిన తర్వాత అలానే అనుకోవాలి. ఎందుకంటే, ప్రతిదానికీ ఓ లెక్క చెబుతాడు. ఎక్కడో ఏదో జరగడానికి మరెక్కడో ఏదో మొదలవుతుందన్నది కన్వే చేస్తుంటాడు. ఉదాహరణకు.. కాఫీ షాప్ లో ఎన్టీఆర్ ని రకుల్ యాక్సిడెంటల్ గా ముద్దు పెట్టే సీన్. ఎవరో బాల్ ఆడుకుంటుందే.. ఆ బాల్ వచ్చి వెయిట్రస్ కాఫీ ట్రే మీద పడితే, ఆ వెయిట్రస్ రకుల్ మీద పడితే.. రకుల్ పెదాలు సరిగ్గా ఎన్టీఆర్ పెదాలకు టచ్ అయిపోతాయ్. అంటే.. మనకు సంబంధం లేని వ్యక్తుల వల్ల మనకు ఏదేదో జరిగే అవకాశం ఉందని చూపిస్తుంటాడు. ఇలాంటి లాజిక్కులు నాలుగైదు ఉన్నాయి. ఒకానొక దశలో ఎందుకు బాబూ ఈ లాజిక్కులు అనేంత తెలివితేటలు ప్రదర్శించాడు సుకుమార్. ఎన్టీఆర్ అంటే అభిమానులకు ఎలా కనిపించాలి? మంచి జోష్ గా, సింగిల్ హ్యాండ్ తో పది మందిని చెడుగుడు ఆడేసినట్లుగా, వీర లెవల్లో డైలాగ్స్ చెప్పినట్లుగా... మాస్ గా ఇరగదీసే స్టెప్పులేసే విధంగా ఉండాలి. కానీ, ఈ సినిమాలో కనిపించిన ఎన్టీఆర్ లో అవేవీ కనిపించవు. దాంతో అభిమానులు నిరాశపడిపోతారు. లెక్కలు ఎక్కువ కావడంవల్ల అర్థం కాక నీరసపడే ప్రేక్షకులు సంఖ్య కొంత ఉంటుంది. సినిమా మొత్తం పరాయి దేశంలో జరుగుతుంది కాబట్టి, పరాయి సినిమా చూస్తున్నట్లే ఉంటుంది. చివరి 45 నిముషాల్లో ప్రేక్షకులు ఎమోషనల్ అయిపోతారని చిత్రబృందం చెప్పుకుంటూ వచ్చారు. కానీ, అంత సీన్ లేదు. క్లయిమాక్స్ లో ఆస్పత్రిలో ఎన్టీఆర్ గుండె కొట్టుకుంటూ చప్పట్లు కొట్టే సీన్ కదిలిస్తుంది. అది మినహా ఎమోషనల్ అయిపోవడానికి ఏమీ లేదు. బి, సి ఏరియాల వారికి సినిమా రీచ్ అవ్వడం కష్టం. ఏదేమైనా స్ర్కీన్ ప్లే బాగుంది. మెచ్చుకోదగ్గ ప్రయత్నమే. సుకుమార్ డిఫరెంట్ మూవీ తీశాడు. కానీ, ఏ మూవీ అయినా 'మాస్'కి కనెక్ట్ అయితేనే బాక్సాఫీస్ లెక్కలు బాగుంటాయి. కానీ, ఇది పూర్తిగా మాస్ ఆడియన్స్ కి దూరమయ్యే సినిమానే.


ఫైనల్ గా చెప్పాలంటే... ఇది ఇంటలిజెంట్ మూవీ. అందుకని బాగోలేదని అంటే.. మనం తెలివితక్కువాళ్లం అనుకుంటారేమోననే సందేహంతో 'సినిమా బాగుంది' అని కొంతమంది తమ తెలివితేటలను ప్రదర్శిస్తారు. పాయింట్ ఏంటంటే.. బాగుందని అన్నా కూడా తెలివితక్కువ వాళ్లు అనుకునే అవకాశమూ ఉంది. సుకుమార్ ఎంతో బుర్ర ఉపయోగించి తీసిన ఈ సినిమాని, డబ్బులిచ్చి మరీ బుర్రకు పదను పెట్టాలంటే ఆడియన్స్ కి కొంచెం కఫ్టంగానే ఉంటుంది. ఎన్టీఆర్ ను ఇష్టపడేవాళ్లు నిరాశపడే సినిమా. ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడం ఓ మైనస్. 'నాన్నకు ప్రేమతో' అని టైటిల్ చెప్పేటప్పుడు కలిగే ఉద్వేగం సినిమాలో లేదు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !