View

నేడే విడుదల మూవీ రివ్య్వూ

Friday,March10th,2023, 01:38 PM

అసిఫ్ ఖాన్, మౌర్యాని జంటగా ఐకా ఫిల్మ్ ఫాక్టరీ పతాకంపై తెరకెక్కిన చిత్రం 'నేడే విడుదల'. ఈ చిత్రం ద్వారా రామ్ రెడ్డి పన్నాల దర్శకుడిగా పరిచయం అయ్యారు. నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు (మార్చ్ 10) థియేటర్స్ క వచ్చింది. ఈ సినిమా ట్రైలర్స్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది... ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.


కథ 
సినిమాలను ప్రమోషన్ చేసే ఓ కంపెనీలో వర్క్ చేస్తున్నసిద్ధూ(అసిఫ్ ఖాన్) హారిక (మౌర్యాని)ని ప్రేమిస్తూ ఉంటాడు. నిర్మాత సత్యానంద్ (డైరెక్టర్ కాశీ విశ్వనాథ్) ఓ భారీ బడ్జెట్ మూవీని నిర్మించి... దానిని ప్రమోట్ చేసే అవకాశాన్ని సిద్ధూ కి ఇస్తాడు.  సినిమాని భారీగా ప్రమోట్ చేసి, మంచి ఒపెనింగ్స్ రాబట్టి సినిమాని ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ప్రమోట్ చేస్తాడు సిద్ధూ. అయితే పైరసీ బారిన పడిన సినిమా వసూళ్ల పరంగా డౌన్ ఫాల్ కావడంతో నిర్మాత సత్యానంద్ చనిపోతారు. అంత పెద్ద నిర్మాత మరణించడం సిద్ధూ జీర్ణించుకోలేకపోతాడు. అసలు నిర్మాత చనిపోవడానికి కారణాలు ఏంటి? అంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమా ఉన్నట్టుండి కలెక్షన్లు పడిపోయి డౌన్ ఫాల్ అవ్వడానికి కారణం ఎవరు? ఈ విషయాలన్ని తెలుసుకున్న సిద్ధూ ఏం చేసాడు వంటి అంశాలతో ఈ సినిమా రూపొందింది.


నటీనటుల పెర్ ఫామెన్స్
ఓ బాధ్యత గల యువకుడు సిద్ధు పాత్రలో చక్కగా ఒదిగిపోయి నటించాడు హీరో అసిఫ్ ఖాన్. తన పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. హీరోగా ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఎక్కడా తడబడకుండా నటించడంతో తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు. యాక్షన్, రొమాంటిక్ సీన్స్ లో అసిఫ్ ఖాన్ వావ్ అనిపించేలా నటించి అలరించాడు. హీరోయిన్ గా నటించిన మౌర్యాని గ్లామర్ పరంగా ఆకట్టుకోవడమే కాకుండా, చక్కటి నటన కనబర్చి సూపర్ అనిపించుకుంది. నిర్మాత పాత్రలో నటించిన కాశీ విశ్వనాథ్ తనదైన శైలిలో నటించి మెప్పించారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు. ముఖ్యంగా అప్పాజీ అంబరీష్, మాధవి, టి.ఎస్.ఆర్, అదుర్స్ ఆనంద్, పీలా గంగాధర్, జబర్దస్ నవీన్, అశోక వర్ధన్, రసజ్ఞ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. 


సాంకేతిక వర్గం
చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న బర్నింగ్ పాయింట్ ని తీసుకుని, చక్కటి స్ర్కీన్ ప్లే తో ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ రామ్ రెడ్డి పన్నాల. సినిమాటోగ్రఫీ, సంగీతం ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే, సినిమా ఇంకా క్రిస్పీగా ఉండేది. కథకు సరిపడా బడ్జెట్ ని సమకూర్చడంలో నిర్మాతలు సక్సెస్ అయ్యారు, నిర్మాణపు విలువలు బాగున్నాయి. 


విశ్లేషణ
మంచి మెసేజ్ తో రూపొందే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలకు ఆడియన్స్ ఎప్పుడూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమా పాయింట్ కొత్తగా ఉండటం, దానికి స్ర్కీన్ ప్లే చక్కగా కుదరడం ప్లస్ పాయింట్. ఇంట్రస్టింగ్ స్ర్కీన్ ప్లే సమకూర్చుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. 'నేడే విడుదల' సినిమాకి స్టోరీ, స్ర్కీన్ ప్లే పెద్ద ప్లస్ పాయింట్. ఫస్టాప్ అంతా సరదాగా సాగిపోతుంది. డైలాగ్స్ బాగున్నాయి. ఎంతో కష్టపడి, ఎంతోమంది శ్రమించి నిర్మించిన ఓ సినిమా పైరసీ బారినపడితే, ఆ చిత్ర నిర్మాతకు జరిగే నష్టం కళ్లకు కట్టినట్టు ఈ సినిమాలో చక్కగా ఆవిష్కరించారు. చిన్న చిన్న లోపాలున్న... ఓవరాల్ గా  ఈ సినిమా ఎంటర్ టైన్ చేయడంతో పాటు అందరికీ కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు, సో... డోంట్ మిస్ ది మూవీ. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.


ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !