View

Surya Vs Surya Movie Review

Thursday,March05th,2015, 08:17 AM

చిత్రం - సూర్య వెర్సస్ సూర్య
బ్యానర్ - సురక్ష్ ఎంటర్ టైన్ మెంట్ ఇండియా ప్రై.లిమిటెడ్
నటీనటులు - నిఖిల్, త్రిద, తనికెళ్ల భరణి, మధుబాల, రావు రమేష్, షయాజీ షిండే, తాగుబోతు రమేష్, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్య, అల్లరి సుభాషిణి తదితరులు
కెమెరా - కార్తీక్ ఘట్టమనేని
డైలాగ్స్ - చందు మొండేటి
ఎడిటింగ్ - గౌతమ్ నెరసు
నిర్మాత - మల్కాపురం శివకుమార్
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - కార్తీక్ ఘట్టమనేని

స్వామి రారా, కార్తికేయ.. ఇలా వరుస విజయాలతో నిఖిల్ కెరీర్ జోష్ గా ఉంది. ఈ రెండు విజయాలతో విభిన్న కథలు ఎన్నుకుంటున్నాడనే పేరు కూడా తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో అతను చేసిన తాజా చిత్రం 'సూర్య వెర్సస్ సూర్య' ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం అయ్యుంటుందనే ఊహాగానాలు నెలకొనడం ఖాయం. 'కార్తీకేయ' చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా చేసి, మంచి టెక్నీషియన్ అనిపించుకున్న కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమయ్యాడు. మరి.. దర్శకునిగా కూడా కార్తీక్ భేష్ అనిపించుకుంటాడా? ఈ చిత్రవిజయంతో నిఖిల్ హ్యాట్రిక్ సొంతం చేసుకుంటాడా?... తెలుసుకుందాం...

à°•à°¥
సూర్య (నిఖిల్) ఓ వింత వ్యాధితో బాధపడుతుంటాడు. సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్య బయటికి రాలేడు. అతనికి ఎండ పడదు. చందమామ వచ్చిన తర్వాత బయటికి వస్తాడు. సూర్య పుట్టినప్పుడే ఈ విషయాన్ని సూర్య తల్లి (మధుబాల)కి డాక్టర్ చెబుతాడు. పార్ఫీరియా డిసీజ్ కి ఈ లక్షణాలు ఉంటాయని, తండ్రి, తల్లి ఎవరికైనా ఈ వ్యాధి ఉండి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశముందని డాక్టర్ వివరిస్తాడు. సూర్య కిరణాలు తాకితే 10, 15నిముషాల లోపే కాలిపోతాడని డాక్టర్ చెబుతాడు. సూర్య పుట్టినప్పుడే తండ్రి చనిపోవడంతో అన్నీ తానై పెంచుతుంది తల్లి. సాయంత్రం 6.30 తర్వాతే సూర్య బయటికి వెళ్లేలా అలవాటు చేస్తుంది. డబ్బు ఉన్న అబ్బాయి అవ్వడం, తల్లి అంతులేని ప్రేమ వల్ల సూర్య ఈ వ్యాధి ఉన్నప్పటికీ హాయిగాఏ పెరిగి పెద్దవాడైపోతాడు. కాకపోతే ఇలాంటి జీవితం జీవించాల్సి రావడం మాత్రం అతనికి చాలా బాధగా ఉంటుంది. తనని తానే ఆక్సెఫ్ట్ చేసుకోలేని అయోమయంలో ఉంటాడు.
చదువు కోసం నైట్ కాలేజ్ లో చేరతాడు. అక్కడ సూర్యకు ఎర్రిస్తామి (తనికెళ్ల భరణి), అరుణ (సత్య) మంచి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్లకి తనకున్న డిసీజ్ గురించి చెబుతాడు సూర్య. ఓ చానల్లో నైట్ లైవ్ షో ప్రోగ్రామ్స్ చేసే సంజన (త్రిద) ని ఇష్టపడతాడు. ఆ ప్రోగ్రామ్ లో భాగంగా సంజన తో ఫోన్లో మాట్లాడతాడు సూర్య. ఆమె అంటే ఇష్టపడతాడు. ఓ సందర్భంలో సూర్య కు సంజన నేరుగా కనిపించడం, ఇద్దరూ ఫ్రెండ్స్ అవ్వడం జరుగుతుంది. లోలోపల సంజనను ఇష్టపడినా సూర్య ఆ విషయాన్ని ఆమెతో చెప్పడు. తనకున్న డిసీజ్ వల్ల సంజనకు తన ప్రేమను వ్యక్తపరచలేకపోతాడు. అయితే సూర్యను సంజన ప్రేమిస్తుంది. తనే తన ప్రేమను సూర్యకు వ్యక్తపరుస్తుంది. మరి సూర్య తన డిసీజ్ గురించి సంజనకు చెబుతాడా? ఈ వ్యాధి ఉన్న సంగతి సంజనకు తెలిస్తే, ఆమె సూర్యను తన జీవితంలోకి ఆహ్వనిస్తుందా అనేది ఈ సినిమా సెకండాఫ్.

నటీనటుల పర్ఫార్మెన్స్
సినిమా సినిమాకీ నటుడిగా నిఖిల్ ఎదుగుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో 'పార్ఫీరియా' వ్యాధి ఉన్న పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఎండ సోకనివాళ్లు మిగతావాళ్లల్లా కాకుండా కొంచెం డల్ గా కనిపిస్తారు. ఆ డల్ నెస్ ని నిఖిల్ చక్కగా ఆవిష్కరించాడు.ఈ పాత్ర కోసం కొంచెం సన్నబడ్డాడు. అది తనకు ప్లస్ అయ్యింది. ఇక, త్రిదా చౌదరి చాలా బాగుంది. టీవీ యాంకర్ పాత్రను చాలా జోష్ గా చేసింది. మంచి పాత్రల మీద దృష్టి పెడితే, నటిగా మంచి భవిష్యత్తు ఉంటుంది. 'రోజా' ఫేం మధుబాల తల్లి పాత్రలో చక్కగా ఉంది. అయితే, కొన్ని సన్నివేశాల్లో చాలా అందంగా, కొన్ని సన్నివేశాల్లో మరీ సన్నబడిపోయి సాదాసీదాగా ఉంది. స్టూడెంట్ పాత్రలో తనికెళ్ల భరణి నవ్వించారు. సత్య చేసిన కామెడీ బాగుంది. ఇంకా షయాజీ షిండే, రావు రమేష్ తదితరులు పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక వర్గం
ఈ కథ కొత్తగా ఉంది. రొటీన్ కి భిన్నంగా ఉన్న కథను ఎంచుకున్నందుకు దర్శకుణ్ణి అభినందించాల్సిందే. పాయింట్ చాలా చిన్నది. దాని చుట్టూ అల్లిన స్ర్కీన్ ప్లే ఫస్టాఫ్ లో సూపర్. ఒక్క చోట కూడా లాజిక్ మిస్ కాలేదు. దాంతో కార్తీక్ ఘట్టమనేనిలో మంచి ఛాయాగ్రాహకుడు మాత్రమే కాదు.. దర్శకుడు కూడా ఉన్నాడనించడం ఖాయం. ఇక, సెకండాఫ్ కి వచ్చేసరికి ఫస్టాఫ్ అంత గ్రిప్పింగ్ గా చేయలేకపోయాడు. సెకండాఫ్ మామూలుగా సాగుతూ, క్లయిమాక్స్ లో బాగుందనిపిస్తుంది. కెమెరామ్యాన్ గా కార్తీక్ ఈ చిత్రంతో మరోసారి భేష్ అనిపించుకున్నాడు. చందు మొండేటి రాసిన డైలాగ్స్ సినిమాటిక్ గా లేకుండా సహజ ధోరణిలో ఉన్నాయి. సత్య మహావీర్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫిల్మీబజ్ విశ్లేషణ
రొటీన్ ప్రేమకథలు, మాస్ మసాలా స్టోరీసేనా? వేరే కొత్త కథలు లేవా? అనుకునేవాళ్లకి ఈ కథ నచ్చుతుంది. కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎమోషనల్ సన్నివేశాలు ఇంకొంచెం బలంగా ఉండి ఉంటే బాగుండేది. నిఖిల్ ఫిజిక్, నటన ఓ ప్లస్ పాయింట్. సినిమా మొత్తం ఐఫీస్ట్ లా ఉంది. ఫస్టాఫ్ ఏమాత్రం బోర్ కొట్టదు. సెకండాఫ్ లో ప్రేక్షకులు కొంచెం అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ అదేం మైనస్ కాకపోవచ్చు. ఎందుకంటే, కథ కొత్తగా ఉంది కాబట్టి ఆ మాత్రం అసహనాన్ని భరించేసి, చివరి వరకూ సినిమా చూడాలని ఫిక్సవుతారు. రక్తపాతాలు, బూతు పదాలతో రాసిన ఐటమ్ సాంగులు, లిప్ లాక్ లు, కుటుంబ ప్రేక్షకులు ఇబ్బంది పడే సంభాషణలు.. ఇవేవీ లేని క్లీన్ సినిమా ఇది. యూత్, ఫ్యామిలీస్ చూడదగ్గ విధంగా ఉంది. ఇలాంటి చిత్రాలను ఒకసారి చూడటంవల్ల నీట్ సినిమాలు రూపొందించాలనే భావన దర్శకుల్లో పెరుగుతుంది. ఫలితంగా 'డీసెంట్ ఎంటర్ టైనర్స్' వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. 'ఇది చాలా డీసెంట్ మూవీ'. కాకపోతే కమర్షియల్ గా ఈ సినిమా ఎంతవరకూ వర్కవుట్ అవుతుందనేది బి, సి సెంటర్స్ ఆడియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశముంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !