View

ఊపిరి మూవీ రివ్య్వూ

Friday,March25th,2016, 07:57 AM

చిత్రం - ఊపిరి
బ్యానర్ - పివిపి బ్యానర్
నటీనటులు - నాగార్జున, కార్తీ, తమన్నా, జయసుధ, ప్రకాష్ రాజ్, భరత్, కల్పన, అనుష్క (గెస్ట్ అఫియరెన్స్), అడవి శేష్ (గెస్ట్ అఫియరెన్స్) తదితరులు
సంగీతం - గోపీ సుందర్
ఫోటోగ్రఫీ - పి.ఎస్.వినోద్
మాటలు - అబ్బూరి రవి
ఎడిటింగ్ - శ్రీకర్ ప్రసాద్
నిర్మాత - ప్రసాద్.వి.పొట్లూరి
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - వంశీ పైడిపల్లి


హృదయానికి హత్తుకునే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అందుకే ఆ తరహా చిత్రాలు ఎప్పటికీ మనసులో నిలిచిపోతాయ్. హాలీవుడ్ చిత్రం 'ఇన్ టచ్ బుల్స్' అలాంటి చిత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకున్న టాప్ 25 హాలీవుడ్ చిత్రాల్లో ఇదొకటి. ఈ చిత్రానికి రీమేక్ గా వచ్చిన చిత్రమే 'ఊపిరి'. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్ లో పరమ్‌ వి. పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మించారు. ఎంతో ప్యాషన్ ఉంటేనే ఏ నిర్మాతలైనా ఇలాంటి చిత్రాలు నిర్మిస్తారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఈ రోజు తెరకొచ్చింది. ఈ చిత్రం ఫొటోలు చూసినప్పుడు ఖచ్చితంగా ఓ ఎమోషనల్ జర్నీ చేయబోతున్నామనే ఫీల్ చూసేవాళ్లకి కలగడం ఖాయం... మరి.. ఈ జర్నీ ఎలా ఉందో తెలుసుకుందాం...


కథ
విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి చైర్ పర్సన్ విక్రమాదిత్య (నాగార్జున). ఓ యాక్సిడెంట్ లో స్పైనల్ కార్డ్ దెబ్బ తినడంతో వీల్ ఛైర్ కే పరిమితమవ్వాల్సి వస్తుంది. విక్రమాదిత్య కి సెకట్రరీ గా వర్క్ చేస్తుంటుంది కీర్తి (తమన్నా). జైలు కెళ్లి, అమ్మ ఇంట్లోంచి గెంటేయడంతో ఆవారాగా తిరుగుతున్న శ్రీను (కార్తీ), విక్రమాదిత్యకు కేర్ టేకర్ గా జాయిన్ అవుతాడు. విక్రమాదిత్య సెక్రటరీ కీర్తి మంచి ఫిగర్ కాబట్టి, ఆమెను పడగొట్టాలనే టార్గెట్ తో కేర్ టేకర్ గా జాయిన్ అవుతాడు కార్తీ. ఇంటర్య్వూ చేసినప్పుడే ఇలాంటి కుర్రాడే ఇప్పుడు తనకు అవసరమని ఫిక్స్ అయ్యి శ్రీనుని జాయిన్ చేసుకుంటాడు విక్రమాదిత్య, అయితే విక్రమాదిత్య లాయర్ ప్రసాద్ (ప్రకాష్ రాజ్) మాత్రం శ్రీను ఏ మాత్రం కేర్ టేకర్ గా కరెక్ట్ కాదనే భావనతో ఉంటాడు.


విక్రమాదిత్యకు కేర్ టేకర్ గా జాయిన్ అయిన శ్రీను విక్రమాదిత్య లైఫ్ లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు... ఆవారాగా తిరుగుతున్న శ్రీను ఎంతో బాధ్యత కల కేర్ టేకర్ జాబ్ ని ఎలా డీల్ చేసాడు... తన అమ్మకు దగ్గరవ్వాల్న శ్రీను కోరిక తీరుతుందా.. కీర్తితో శ్రీను ప్రేమ ఫలిస్తుందా.. వీల్ చైర్ లో కూర్చుని స్ట్రెస్ తో నలిగిపోతున్న విక్రమాదిత్య లైఫ్ శ్రీను ఎంట్రీతో ఎలాంటి టర్న్ తీసుకుందనేది ఈ చిత్ర కథ.


నటీనటుల పర్ఫార్మెన్స్
మాస్ పాత్ర, క్లాస్ పాత్ర, భక్తుని పాత్ర, భగవంతుని పాత్ర... ఏ పాత్రని అయినా సునాయాసంగా చేయగల మంచి నటుడు నాగార్జున. ఈ చిత్రంలో వీల్ ఛైర్ కే పరిమితమయ్యే వ్యక్తి పాత్రను బ్రహ్మాండంగా చేశాడాయన. అక్కడక్కడ మనసులను తాకే ఎక్స్ ప్రెషన్స్, బ్యాలెన్స్ యాక్టింగ్ తో నాగార్జున మాత్రమే ఈ పాత్రకు వంద శాతం న్యాయం చేయగలరు అని ప్రేకకులకు అనిపించడం ఖాయం. ఇక.. కార్తీ గురించి చెప్పక్కర్లేదు. మంచి నటుడు. స్లమ్ ఏరియాకి చెందిన యువకుడిగా ఒదిగిపోయాడు. నవ్వించడంతో పాటు మనసును తాకే సన్నివేశాల్లో కార్తీ నటన సూపర్బ్. ఓవరాల్ గా ఇన్నోసెంట్ కుర్రాడిగా కార్తీ నటన ప్రేకకుల మనసుల్లో నిలిచిపోతుంది. ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ సెక్రటరీగా తమన్నా బాడీ లాంగ్వేజ్, లుక్ తో హుందాగా నటించింది. తమన్నా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం ఓ ప్లస్. ప్రకాష్ రాజ్ చేసిన స్నేహితుడు పాత్ర ఈ మధ్య కాలంలో ఆయన చేసిన అన్ని పాత్రలకన్నా మనసులో నిలిచిపోయే విధంగా ఉంది. జయసుధ, కల్పన, తనికెళ్ల భరణి, అలీ ఎవరి పాత్రల పరిధి మేరకు వారు నటించారు. గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చిన అనుష్క, శ్రియ, అడవి శేష్ భేష్ అనిపించుకున్నారు.


సాంకేతిక వర్గం
హాలీవుడ్ మూవీ 'ఇన్ టచబుల్స్' చిత్రం రీమేక్ రైట్స్ తీసుకుని చేసిన చిత్రం ఇది. ఈ సినిమా రీమేక్ చేసి ఆడియన్స్ ని మెప్పించాలంటే కొంచెం గట్స్ ఉండాలి. సినిమా మొత్తం ఓ ఫీల్ ని క్యారీ చేయాలి. అలా చేయాలంటే సీన్స్ టచబుల్ గా ఉండాలి. ఆ పరంగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేసారు. గోపీ సుందర్ సమకూర్చిన పాటలు అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా 'నువ్వేం ఇచ్చావో... నేనేం పొందానో...' సాంగ్ హాంట్ చేస్తుంది. సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా రీ-రికార్డింగ్ ఉండటం ఈ సినిమాకి ఓ హైలైట్. పారిన్ లొకేషన్స్ ని తన కెమెరా లో అద్భుతంగా బంధించారు సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్. సీన్ డెప్త్ ని బట్టి సీన్ ని ఎడిట్ చేయడం ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ప్రతిభను మరోసారి బయటపెట్టింది. నిర్మాణ విలువలు సూపర్బ్. నిజం చెప్పాలంటే ఇలాంటి కథలను తీసుకుని, డబ్బు పెట్టి సినిమా చేయాలంటే ఏ నిర్మాతకైనా గట్స్ ఉండాలి. దాంతో పాటు సినిమా మీద ఇష్టం ఉండాలి. ఈ రెండు ఉన్న నిర్మాత పివిపి అధినేత పొట్లూరి వరప్రసాద్. అందుకే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సినిమా చాలా రిచ్ గా ఉంది.


ఫిల్మీబజ్ విశ్లేషణ
రొటీన్ చిత్రాలకు పాథ్ బ్రేకింగ్ లా అనిపించే ఈ సినిమా చేయాలనుకోవడం సాహసమే. చేసి మెప్పించడం అంత సులువు కాదు. హాలీవుడ్ మూవీ లుక్ లో కనిపించే ఈ చిత్రం ఇండియన్ ఆడియన్స్ ఎమోషన్స్ కి తగ్గట్టుగా ఉండటం ప్లస్ పాయింట్. ఒక మంచి సినిమా చూసాం అని చెప్పడంకన్నా, ఒక ఎమోషనల్ జర్నీ చేసిన ఫీల్ ఈ సినిమా చూసిన తర్వాత కలుగుతుంది. నాగార్జున లాంటి రొమాంటిక్ హీరోని వీల్ ఛైర్ లో కూర్చోబెడితే అభిమానులు హర్ట్ అవుతారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మన హీరో జీవితాంతం గుర్తుండిపోయే పాత్ర చేసాడని అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు. కార్తీ క్యారెక్టరైజేషన్ ని మలిచిన విధానం బాగుంది. తన స్టార్ ఇమేజ్ ని పక్కన పెట్టి మరీ ఈ పాత్రను చేసాడు. నవ్వించినప్పుడు నవ్వించి, ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టించేలా తన నటన ఉంది. దర్శకుడు వంశీ పైడిపల్లి ఎన్ని సినిమాలు చేసినా 'ఊపిరి' మాత్రం అతని కెరియర్ లో ఎప్పటికీ చెప్పుకునే చిత్రంగా నిలిచిపోతుంది. ఫీల్ గుడ్ చిత్రాలను అందించాలనే తాపత్రయంతో నిర్మాత పివిపి ఈ సినిమా తీసారు. ప్రేకకులు కూడా ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ని ఆదిరిస్తే ముందు ముందు ఇలాంటి మంచి చిత్రాలు తీయడానికి ఇంకొంతమంది నిర్మాతలు ముందుకొస్తారు. అది జరుగుతుంది. ఎందుకంటే 'ఊపిరి' క్లాస్ మాస్ తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. ఫస్టాప్ చాలా బాగుంది. సెకండాఫ్ ఆరంభమైన కాసేపటికి కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ, తర్వాత వచ్చే సీన్స్ ఆ ఫీల్ ని పోగొడుతుంది.


ఒక్క మాటలో చెప్పాలంటే... వయసుకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. సో.. డోంట్ మిస్ 'ఊపిరి'.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !