శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై గాలి ప్రత్యూష సమర్పణలో సాయి శివాజీ దర్శకత్వంలో జి.వి.వి.గిరి నిర్మించిన చిత్రం 'పరారీ'. లవ్ అండ్ క్రైం కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో యోగేశ్వర్, అతిధి జంటగా నటించారు. ఈ రోజు (మార్చి 30) విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది... ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
యోగి (యోగీశ్వర్), అతిథి (అతిథి) ఇద్దరూ కాలేజ్ మేట్స్. ఒకరికొకరు ఇష్టపడి ప్రేమించుకుంటారు. యోగేశ్వర్ ఫ్రెండ్స్ (జబర్దస్త్ రఘు కారుమంచి, భూపాల్). భూపాల్ ప్రేమికురాలు శివాని. ఈ ఐదురుగు అనుకోకుండా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. దాని నుంచి తప్పించుకోవడానికి తంటాలు పడుతుంటారు. ఇదే సమయంలో బిజినెస్ మ్యాన్ అయిన యోగీ తండ్రి పాండే (మకరంద్ దేశముఖ్ పాండే) కిడ్నాప్ కి గురవుతాడు. మర్డరీ కేస్ లో ఇరుక్కున్న యోగి దాని నుంచి ఎలా బయటపడతాడు... కిడ్నాప్ కి గురైన తండ్రిని ఎలా కాపాడుకుంటాడు... తన ప్రేమను ఎలా సక్సెస్ చేసుకుంటాడు... అనే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.
నటీనటుల పెర్ ఫామెన్స్
యోగీశ్వర్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఫస్ట్ సినిమా అయినప్పటికీ... డ్యాన్స్, ఫైట్స్, చక్కటి డైలాగ్ డెలివరీ తో వావ్ అనిపించేలా నటించి మెప్పించాడు. హీరోయిన్ అతిథి తన పాత్ర పరిధి మేరకు నటించింది. రఘు కారుమంచి కామెడీ టైమింగ్ ఆడియన్స్ కి మంచి రిలీఫ్. శివాని సైని పాత్ర గ్లామర్ తో కూడుకున్నది. అలీ, షయాజీ షిండే, సుమన్ పాత్రలు ఆకట్టుకుంటాయి. కామెడీ విలన్ పాత్రలో మకరంద్ దేశ్ ముఖ్ పాండే మెప్పించారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం
కామెడీ క్రైమ్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని మలిచారు డైరెక్టర్ శివాజీ. కామెడీ సీన్స్ ని చక్కగా తెరకెక్కించారు. గరుడ వేగా అంజి అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. సాంగ్స్, ఫైట్స్ చిత్రీకరణ రిచ్ గా ఉంది. చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ అందించిన సంగీతం సినిమాకి హైలైట్. పాటలన్నీ బాగున్నాయి. ఒకస్టార్ హీరో సాంగ్స్ ఎలా ఉంటాయో ఖర్చుకు వెనుకాడకుండా అలా తీశారు. రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, మహిత్ నారాయణ్ రాసిన లిరిక్స్ మాసీగా ఉన్నాయి. దివంగత సీనియర్ ఎడిటర్ గౌతం రాజు ఎడిటింగ్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా సినిమాని నిర్మించారు నిర్మాత జి.వి.వి.గారి.
విశ్లేషణ
లవ్, కామెడీ, క్రైం ఎంటర్ టైనర్స్ అన్ని వర్గాల ఆడియన్స్ కి నచ్చుతాయి. సరిగ్గా ఇలాంటి జానర్ నే టచ్ చేసారు డైరెక్టర్. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. ఫస్ట్ ఎపిసోడ్ ఆడియన్స్ ని కథలో లీనమయ్యేలా చేస్తుంది. ఫస్టాప్ కాలేజ్ లైఫ్, అడల్డ్ కామెడీ తో సాగుతుంది. సెకండాష్ హీరో అండ్ ఫ్రెండ్స్ మర్డర్ కేసు నుంచి బయటపడటానికి పెట్టే పరుగులు ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లయిమ్యాక్స్ ఎపిసోడ్ బాగుంటాయి.
ఓవరాల్ గా 'పరారీ' సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. సో... డోంట్ మిస్ ది మూవీ. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5