View

ప్రేమలో ఎబిసి మూవీ రివ్వ్యూ

Friday,July25th,2014, 03:52 PM

చిత్రం - ప్రేమలో ఎబిసి

నటీనటులు - అజయ్, రిషి, క్రాంతి, శ్రీ ఐరా, రూబి పరిహార్, ధనరాజ్, సుమన్ శెట్టి, శ్రీనివాస రెడ్డి, కీ.శే. ఏవీయస్, తదితరులు

సంగీతం - ఎలెండర్

నిర్మాత - జె.వి.రెడ్డి

దర్శకత్వం - నాగరాజు

విడుదల తేదీ - 25.7.2014

విలన్ గా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న అజయ్ 'ఆ ఒక్కడు', 'సారాయి వీర్రాజు' తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు. తాజాగా అజయ్ ఓ హీరోగా నటించిన 'ప్రేమలో ఏబిసి' చిత్రం ఈ రోజు (25.7.2014) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు నాగరాజు దర్శకత్వం వహించారు. జేవి రెడ్డి నిర్మాత. చిన్న బడ్జెట్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందే విధంగా ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం.

à°•à°¥

అజయ్, బాలు, చందు ముగ్గురూ మంచి ఫ్రెండ్స్. అనుకోకుండా సిరి (శ్రీ ఐరా)ని చూసిన అజయ్ ఆమె ప్రేమలో పడతాడు. కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత సిరి కూడా అజయ్ ని ప్రేమిస్తుంది. కానీ అది ప్రేమకాదని చందుతో కలిసి సిరి తనని మోసం చేసిందని తెలుసుకుంటాడు అజయ్. తన దగ్గర ఉన్న డబ్బు కొట్టేయడానికే చందు, సిరి ఈ విధంగా ప్లాన్ చేసారని కూడా అజయ్ తెలుసుకుంటాడు. ఆ సమయంలో ఓ రోజు రాత్రి సిరి, చందు వేరే వాళ్ళ చేతిలో చంపబడతారు. అప్పుడీ కేసుని డీల్ చెయ్యడానికి ఏసిపి రణధీర్(అజయ్) రంగంలోకి దిగుతాడు. అసలు సిరి, చందులను చంపింది ఎవరు?సిరి, చందులు కలిసి అజయ్ ని మోసం చేయడానికి గల కారణం ఏమిటి? ఈ మర్డర్స్ వెనకున్న వారిని ఏసిపి రణధీర్ పట్టుకోగలిగాడా? తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పెర్ ఫామెన్స్

పవర్ ఫుల్ ఎసిపి పాత్ర చేసాడు అజయ్. ఈ క్యారెక్టర్ లో చక్కగా ఒదిగిపోయాడు. అజయ్ మంచి హైట్ కావడంతో ఈ పాత్రకు బాగా సూట్ అయ్యాడు. ఎసిపి గా సీరియస్ యాక్షన్ చక్కగా చేసాడు అజయ్. యాక్షన్ సీక్వెన్స్ లో కూడా పవర్ ఫుల్ గా కనిపించాడు. రిషి ఈ సినిమాలో నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసాడు. ఈ పాత్రకు రిషి బాగానే ఉన్నాడు. శ్రీనివాస్ రెడ్డి, ధన్ రాజ్ కాంబినేషన్ సీన్స్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తాయి. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతిక వర్గం

కొత్తదనం లేని కథని కొత్తగా చెప్పడానికి ట్రై చేసారు డైరెక్టర్ నాగరాజు. ప్లాష్ బ్యాక్ సీన్స్ ఎక్కువవ్వడంతో ఆడియన్స్ కన్ ఫ్యూజన్ కి గురవుతారు. ఫస్టాప్ సీన్స్ కంటే సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఫస్టాప్ సినిమా ల్యాగ్ గా ఉండటం వల్ల ఆడియన్స్ బోర్ ఫీలవుతారు. అసలు సెకండాఫ్ ఆరంభమవ్వగానే డైరెక్టర్ కథ చెప్పడం మొదలుపెట్టారు. దాంతో ఫస్టాప్ అంతా బోర్ కలిగిస్తుంది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చాలా మైనస్. మరీ ముఖ్యంగా కొన్ని సీన్స్ విజువల్ గా పెద్ద బాగోలేదు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్.

ఫిల్మీబజ్ విశ్లేషణ

కథ పాతది అయినప్పటికీ ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లే అయితే సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. కానీ ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే చాలా మైనస్. ప్లాష్ బ్యాక్ లు ఎక్కువ ఉన్నప్పటికీ అవి ఆసక్తికరంగా లేవు. ప్రేక్షకులు ఆ ప్లాష్ బ్యాక్ లను ఊహించేస్తారు. సెకండాఫ్ లోని కొన్ని సీన్స్ మినహా ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. అవి ఈ సినిమాకి కాస్త రిలీఫ్ ఇస్తాయి. ఓవరాల్ గా మాత్రం ఈ సినిమా ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష.

Premalo ABC Movie Review



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !