చిత్రం - ప్రేమ పిపాసి
నటీనటులు - జీపీయస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ, జ్యోతి రాజ్ పుత్, మమత శ్రీ చౌదరి, సుమన్ తదితరులు
సినిమాటోగ్రఫీ - తిరుమల రోడ్రిగ్జ్
సంగీతం - ఆర్స్
ఎడిటింగ్ - ఎస్. శివకిరణ్
నిర్మాత - పి.యస్.రామకృష్ణ
రచన - దర్శకత్వం - మురళి రామస్వామి
వెండితెరపై లవ్ స్టోరీలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఎన్ని లవ్ స్టోరీలు తెరకెక్కినా వాటిని ఆదరించే సినీప్రియులకు కొదవే లేదు. ఈ వారం విడుదలైన సినిమాల్లో లవ్ జానర్ లో తెరకెక్కిన సినిమా 'ప్రేమ పిపాసి'. సరికొత్త ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది... ఆడియన్స్ ని ఏ మేర ఆకట్టుకునే విధంగా ఉందో రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
కనిపించిన ప్రతి అమ్మాయిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, ఆ తర్వాత అసలు పని కానిచ్చే మనస్తత్వం కలవాడు బావ (కపిలాక్షి మల్హోత్రా). అలాంటి వాడు బాలా (సోనాక్షి) ని ప్రేమిస్తాడు. ఛీ కొట్టినా, పట్టించుకోకపోయినా బాలా చుట్టూ తిరుగుతుంటాడు బావ. అమ్మాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసే బావ, అసలు బాలాను మాత్రం ప్రేమించడానికి కారణం ఏంటీ... ఈ ఇద్దరి మధ్య ఉన్న గతం ఏంటీ... అమ్మాయిలను బావ ఎందుకు ప్రేమ పేరుతో వంచిస్తాడు లాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
కపిలాక్షి మల్హోత్రా ఈ సినిమా ద్వారా తెరకు పరిచయం అయ్యాడు. ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఫైట్స్, డ్యాన్స్, నటన పరంగా సూపర్బ్ అనిపించుకుంటాడు. బాలా పాత్ర చేసిన సోనాక్షి కి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. దాంతో సెకండాఫ్ లో ఆమె స్ర్కీన్ ప్రెజెన్స్ అందరికీ నచ్చుతుంది. సుమన్, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఫన్ బకెట్ భార్గవ్ పండించిన కామెడీ అలరిస్తుంది.
సాంకేతికవర్గం
ఈ సినిమాకి స్టోరీ లైన్ చాలా ప్లస్. యూత్ ను టార్గెట్ చేస్తూ రాసుకున్న కథ. డైలాగ్స్ బాగున్నాయి. మాస్ బీట్స్ తో సంగీత దర్శకుడు చక్కటి పాటలిచ్చాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్ గా సినిమాలో పెద్దగా లోపాలు కనిపించవు. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంటే, సినిమా ఇంకా స్పీడ్ గా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. కథకు సరిపడా ఖర్చుతో నిర్మాణపు విలువలు ఉండటం సినిమాకి ప్లస్. కథకు తగ్గ టైటిల్ కుదరడం కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ సినిమా స్టోరీ లైన్ ట్రెండీగా ఉంటుంది. అమ్మాయిలు, అబ్బాయిలు ఎందుకు ప్రేమలో పడుతున్నారు, వారికి కావాల్సిందేంటీ? అనే అంశాలతో అల్లిన కథ కావడంతో యూత్ ని ఈ సినిమా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఓపినింగ్ సీన్ తోనే ఆడియన్స్ ని సినిమాలో లీనమయ్యేనలా చేసాడు డైరెక్టర్. ప్రేమలో ఓడిపోవడంతో సూసైడ్ చేసుకోవడానికి హీరో సిద్ధపడే సీన్ తో సినిమా ఆరంభమవుతుంది. ఫ్లాష్ బ్యాక్, అమ్మాయిలను ట్రాప్ చేసే ట్రిక్స్ , ప్రస్తుతం అమ్మాయిలు ఎలా ఉన్నారు కళ్లకు కట్టినట్టు చూపించడంతో సినిమా ఆసక్తిగా సాగుతుంది. జబర్ధస్త్ ఆర్టిస్ట్ ల కామెడీ ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. ఫ్రీ క్లయిమ్యాక్స్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఫస్టాప్ అంతా బావ అమ్మాయిలను ట్రాప్ చేయడం, ట్రాప్ చేయడానికి అతను ఫాలో అయ్యే ట్రిక్స్ తో సాగుతుంది. సెకండాఫ్ టోటల్ గా ఆడియన్స్ ని సినిమాలో లీనమయ్యేలా చేయడంతో సినిమా అన్ని వర్గాల వారిని మెప్పిస్తుంది.
ఫైనల్ గా చెప్పాలంటే... టైటిల్ కి తగ్గ స్టోరీ లైన్ తో ఈ 'ప్రేమ పిపాసి' యూత్ ని కట్టిపడేస్తుంది.
ఫిల్మీబజ్ డాట్ కామ్ రేటింగ్ - 3/5