View

రా రండోయ్ వేడుక చూద్దాం మూవీ రివ్య్వూ

Friday,May26th,2017, 06:02 AM

చిత్రం - రా రండోయ్ వేడుక చూద్దాం
బ్యానర్ - అన్నపూర్ణ స్టూడియోస్
నటీనటులు - అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, సంపత్ రాజ్, కౌసల్య, చలపతిరావు, సప్తగిరి, అన్నపూర్ఱ, తాగుబోతు రమేష్, పృద్వీ, రఘుబాబు, సురేఖావాణి, అనితాచౌదరి, ప్రియ తదితరులు
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రపీ - యస్.వి.విశ్వేశ్వర్
ఎడిటింగ్ - గౌతంరాజు
స్ర్కీన్ ప్లే - సత్యానంద్
నిర్మాత - అక్కినేని నాగార్జున
దర్శకత్వం - కళ్యాణ్ కృష్ణ కురసాల
రిలీజ్ డేట్ - 26.5.2017


అక్కినేని హీరో, కింగ్ నాగార్జున 'సోగ్గాడే చిని నాయనా' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు కళ్యాణ్ కృష్ణ కురసాల. ఆ వెంటనే యువసామ్రాట్ నాగచైతన్య చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు నాగార్జున. 'రా రండోయ్ వేడుక చూద్దాం' టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించాడు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. ఈ సినిమా ట్రైలర్స్, పోస్టర్, ఆడియో ప్రేక్షకాదరణ పొందిన నేపధ్యంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను చేరుకునే విధంగా ఈ సినిమా ఉందా తెలుసుకుందాం.


à°•à°¥
ఆది (సంపత్ రాజ్), కౌసల్య ముద్లు కూతురు భ్రమరాంబ (రకుల్ ప్రీత్ సింగ్). భ్రమరాంబ అంటే ఆది తల్లి, తమ్ముళ్లు, చెల్లెళ్లకు చాలా ఇష్టం. చాలా గారాబంగా పెంచుతారు. ఆ పల్లెటూరుకు కజిన్ పెళ్లి కోసం వచ్చిన శివ (నాగచైతన్య) మొదటి చూపులోనే భ్రమరాంబను ప్రేమించడం మొదలుపెడతాడు. కట్ చేస్తే...


భ్రమరాంబ హయ్యర్ స్టడీస్ కోసం వైజాగ్ వెళుతుంది. అక్కడ తనకు ఏ సహాయం కావాలన్నా శివకు ఫోన్ చేసి అడుగుతుంది. శివ తనకు మంచి ఫ్రెండ్ అనుకుంటుంది. ఓ సందర్భంలో ఇద్దరి మధ్య జరిగిన ఓ చర్చ మిస్ అండర్ స్టాండింగ్ కి దారితీసి ఇద్దరి మధ్య బ్రేకప్ అవుతుంది. అయితే శివ మీద తనకు ఉన్నది ప్రేమ అని గ్రహించలేకపోయిన భ్రమరాంబ తల్లిదండ్రులు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుంది. కానీ పెళ్లి దగ్గర పడుతున్నప్పట్నుంచి తను శివను ప్రేమిస్తున్నానే విషయం గ్రహించి తండ్రి దగ్గర చెప్పేస్తుంది. శివ తండ్రి తన ఫ్రెండ్ కృష్ణ (జగపతిబాబు) అని తెలుసుకున్న ఆది ఆ పెళ్లికి నో చెప్పేస్తాడు. మరోవైపు కొడుకు ప్రేమ గురించి తెలుసుకున్న కృష్ణ తన ప్రెండ్ ఆదికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అతని కూతురిని పెళ్లి చేసుకుని రావాల్సిందిగా కోరతాడు. అసలు ఫ్రెండ్స్ అయిన ఆది, కృష్ణ మధ్య ఉన్న వైరం ఏంటీ.. శివ ఈ ఇద్దరి మధ్య ఉన్న శత్రుత్వాన్ని తొలిగించి తన ప్రేమను గెలుచుకుంటాడా అనేదే ఈ చిత్ర స్టోరీ లైన్.


నటీనటుల పెర్ ఫామెన్స్
శివగా నాగచైతన్య అద్భుతంగా నటించాడు. లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న నాగచైతన్య, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో కూడా ఒదిగిపోగలుగుతాడని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు. ప్రేమికుడిగా... తండ్రితో అనుబంధం, బాధ్యత కలిగిన కొడుకుగా నాగచైతన్య చక్కటి నటన కనబర్చాడు.
మొండితనం, మంచితనం, అమాయకత్వం కలగలిసిన అమ్మాయి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ చక్కగా నటించింది. అందంగా ఉంది.
హీరో తండ్రిగా జగపతిబాబు, హీరోయిన్ గా తండ్రిగా సంపత్ రాజ్ చక్కగా ఉన్నారు. ఈ ఇద్దరి బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది.
మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ చాలా కలర్ ఫుల్లుగా ఉంది, ప్రతి ఫ్రేము నిండుగా, అందంగా, ఆహ్లాదకరంగా ఉండటంతో విజువల్ గా సినిమా సూపర్బ్ అనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్, గౌతంరాజు ఎడిటింగ్ బాగుంది, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణపు విలువలు ఈ సినిమా స్థాయిని పెంచేసింది. రెగ్యులర్ స్టోరీ లైన్ అయినప్పటికీ, సత్యానంద్ స్ర్కీన్ ప్లే ఈ సినిమాకి మెయిన్ హైలైట్. కళ్యాణ్ కృఫ్ణ టేకింగ్ తో ప్రతి సీన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ఉండటంతో ఈ సినిమాకి యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చేస్తుంది.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఫస్టాప్ లో ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ ఎక్కువ ఉండటంతో సరదాగా సినిమా సాగుతుంది, ఎక్కడ విసుగు అనిపించదు. త్వరగా ఫస్టాప్ పూర్తయ్యిందన్న ఫీలింగ్ కలుగుతుంది, సెకండాఫ్ సీన్స్ సెంటిమెంట్, ఎమోషన్, లవ్, ట్విస్ట్ లతో మిక్స్ అయ్యుండటంతో ఆడియన్స్ సినిమాలో ఇన్ వాల్వ్ అయిపోతారు. నాగచైతన్య, రకుల్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. యూత్ ఈ ఇద్దరి సీన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్ల గారాబంతో పెరిగిన ఓ అమ్మాయి ప్రేమ, పెళ్లి విషయంలో ఎలాంటి కన్ ఫ్యూజన్ ఎదుర్కొంటుందనే విషయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించడం బాగుంది. ఈ క్యారెక్టరైజేషన్ అందరికీ నచ్చుతుంది. తండ్రి, ప్రేమికురాలు ఎవరి స్పేస్ వారికుంటుందనే మెచ్చుర్టీ లెవెల్ ఉన్న కుర్రాడు, తను ప్రేమంచిన అమ్మాయిని దక్కించుకుని, తండ్రి మీద పడ్డ అపవాదును తొలింగే కుర్రాడిగా హీరో క్యారెక్టరైజేషన్ ని తీర్చిదిద్దిన విధానం కూడా చాలా బాగుంది. మన ఇంట్లోని అమ్మాయి, అబ్బాయిలను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. స్టోరీ లైన్ 'నిన్నే పెళ్లాడుతా' ని గుర్తు చేసినప్పటికీ, స్ర్కీన్ ప్లే తో మ్యాజిక్ చేసారు. సింఫుల్ క్లయిమ్యాక్స్ తో సినిమా పూర్తయిపోతుంది. రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అన్నీ కలగలిసిన ఓ కూల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ సినిమా.


ఫైనల్ గా చెప్పాలంటే... నాగచైతన్య వేడుక హిట్.. హాట్ సమ్మర్ లో కూల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.


ఫిల్మీబజ్ డాట్ కామ్ రేటింగ్ - 3.25/5Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !