రాహు మూవీ రివ్య్వూ
చిత్రం - రాహు
నటీనటులు - అభిరామ్ వర్మ, కృతి గార్గ్, కాలకేయ ప్రభాకర్, స్వప్నిక తదితరులు
సంగీతం - ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ - ఈశ్వర్ యల్లు మహంతి, సురేష్ రగుతు
ఎడిటింగ్ - అమర్ రెడ్డి
నిర్మాతలు - ఏ.వి.ఆర్ స్వామి, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల
దర్శకత్వం - సుబ్బు వేదుల
అభిరామ్ వర్మ, కృతి గార్గ్, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రలుగా సుబ్బు వేదుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రాహు'. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ రోజు (28.2.2020) ఈ సినిమా థియేటర్స్ కి వచ్చింది. టెక్నికల్ గా హై సాండర్డ్స్ లో థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉందా.. రివ్య్వూ మీ కోసం...
కథ
చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన భాను (కృతి గార్గ్) కి కన్వర్షన్ డిజార్డర్ వస్తుంది. ఈ డిజార్డర్ వల్ల భానుకి రక్తం చూస్తే కళ్లు కనిపించవు. ఈ డిజార్డర్ ఉన్నప్పటికీ, పోలీస్ కమీషనర్ అయిన ఆమె తండ్రి (సుబ్బు వేదుల) ఇచ్చిన ధైర్యంతో భాను ముందుకు సాగుతుంటుంది. ఈ క్రమంలో క్రిమినల్ నాగరాజును అరెస్ట్ చేస్తాడు కమీషనర్. ఆ సమయంలో కమీషన్ కూతురు భానుని చంపుతానని శపధం చేస్తాడు. భాను పెరిగి పెద్దదవుతుంది. శేష్ (అభిరామ్ వర్మ) ప్రేమలో పడుతుంది. భాను, శేష్ ప్రేమను అంగీకరించిన కమీషనర్ పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే వీరి పెళ్లికి ఓ సమస్య వస్తుంది. భాను కూడా కిడ్నాప్ కి గురవుతుంది. అలాంటి సమయంలో భానుకు నాగరాజు ఎలాంటి సహాయం చేస్తాడు... నాగరాజు కాకుండా భానును చంపడానికి ప్రయత్నం చేసేది ఎవరు... తనకు జరిగిన అన్యాయాన్ని భాను ఎలా ఎదుర్కొంది... భాను పెళ్లికి వచ్చిన సమస్య ఏంటీ... ఈ ట్విస్ట్ లన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
భాను పాత్ర చేసిన కృతి గార్గ్ చాలా టాలెంటెడ్. ఈ పాత్రను అద్భుతంగా చేసింది. ఎమోషనల్ సీన్స్ ని బాగా పండించింది. సినిమా సెకండాఫ్ లో కృతి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. పోలీస్ ఆఫీసర్ శేష్ పాత్రలో అభిరామ్ వర్మ చక్కటి నటన కనబర్చాడు. కీలక పాత్రలు చేసిన కాలకేయ ప్రభాకర్, సత్యం రాజేష్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
టెక్నికల్ గా ...
డైరెక్టర్ సుబ్బు ఈ సినిమాని ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని వర్కవుట్ చేసిన విధానం ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ పాడిన 'ఏమో ఏమో సాంగ్..' చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగా కుదిరాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా ఉంది. కథకు తగ్గ ఖర్చుతో నిర్మాతలు కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించారు.
విశ్లేషణ
డిఫరెంట్ కాన్సెఫ్ట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. సీన్స్ సహజంగా ఉంటే, ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యుండేది. సహజత్వం లోపించడం, నాటకీయంగా సన్నివేశాలు ఉండటం ఈ సినిమాకి కొంత మైనస్. ఓవరాల్ గా ఈ సినిమాని ఒకసారి చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5