చిత్రం - సంజీవని
నటీనటులు - అనురాగ్, తనూజ, మనోజ్, మోహన్ తదితరులు
బ్యానర్ - నివాస్ క్రియేషన్స్
మ్యూజిక్ - కె.కె.శ్రవణ్
ఫోటోగ్రఫీ - సుజిత్ పాలడగు
నిర్మాత - జి.నివాస్
కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - రవి వీడే
గాల్లో ఎగిరే బల్లులు, తెలివైన కోతులు, పది అడుగుల సాలె పురుగులు ఇవన్నీ వెండితెరపై కనిపించి మనల్ని వాటి నటనతో, యాక్షన్ తో అబ్బురపరిచాయంటే అది తప్పకుండా హాలీవుడ్ చిత్రమే అయి ఉంటుందని అనుకుంటారు. కాని ఓ తెలుగు సినిమాలో వీటన్నిటినీ చూడబోతున్నాం. జి.నివాస్ ప్రొడ్యూసర్ గా, రవి వీడే దర్శకుడి గా మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, శ్వేత ప్రధాన పాత్రల్లో అనేకమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ దాదాపు రెండు సంవత్సరాల పాటు పని చేసి మొట్టమొదటిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని సమర్థవంతంగా వాడి దాదాపు 1000 కి పైగావి.ఎఫ్.ఎక్స్ షాట్స్ తో అత్యంత భారీగా నివాస్ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన చిత్రం సంజీవని. ఇంత కష్టపడి చేసిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉందా తెలుసుకుందాం.
కథ
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన టీంకు ఓ బంపర్ ఆఫర్ తగులుతుంది. సంజీవని పర్వతం వెనక దాగి ఉన్న రహస్యాల్ని ఛేదించడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈ పర్వతాన్ని చేరుకోవడమే కష్టమవుతుంది. ఒకవేళ చేరుకున్న అక్కడి నుంచి ఎవ్వరూ తిరిగి రాలేకపోతారు. ఆ పర్వతం ఎక్కి అక్కడి రహస్యాల్ని ఛేదిస్తే, 5 కోట్లు పారితోషికం ఇస్తామనే ఆఫర్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన టీంకు తగులుతుంది. దాంతో ఈ పర్వతారోహకులు సంజీవని పర్వతం ఎక్కి అక్కడి రహస్యాలను చేధించాలని ఫిక్స్ అవుతారు. మరి అనుకున్న ప్రకారం వీరు ఆ టాస్క్ ని పూర్తి చేయగలుగుతారా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ముందుగా ఈ సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుకోవాలి. భారీ బడ్జెట్ సినిమా కాదు. చిన్న బడ్జెట్ తోనే క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని తెరకెక్కించడం పట్ల చిత్రం యూనిట్ ని అభినందించాల్సిందే. క్వాలిటీ గ్రాఫిక్స్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తాయి. మఖ్యంగా పర్వతాలను నిజంగానే ఎక్కారా... గ్రాఫిక్స్ లో మేనేజ్ చేసారా అనే సందేహం సినిమా చూస్తున్న ఆడియన్స్ కి కలుగుతుంది. అంత పక్కాగా గ్రాఫిక్స్ కుదిరాయి. రెండేళ్ల పాటు డైరెక్టర్ అండ్ టీం ఈ సినిమా గురించి కష్టపడ్డారు. ఆ కష్టం తెరపై కనిపిస్తుంది. పెద్ద సాలె పురుగులు, క్లయిమ్యాక్స్ లో గద్ద ఆకారంలో ఉన్న పక్షులను డిజైన్ చేసిన విధానం సూపర్బ్.
సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ కి ఇంపార్టెన్స్ ఉంది. వారి పాత్రల పరిధిమేరకు నటీనటులు కూడా బాగా నటించారు. ట్విస్ట్ లు ఆడియన్స్ లో ఉత్కంఠత రేపుతుంది. ప్రతి సీన్ లాజికల్ గా ఉండటం ఈ సినిమాకి ప్రధాన హైలైట్. ఫస్ట్ సీన్ తోనే ఆసక్తిని రేకెత్తించిన డైరెక్టర్ ఆ గ్రాఫ్ పడిపోకుండా స్ర్కీన్ ప్లే సమకూర్చడంలో ఫుల్ సక్సెస్ అయ్యారు. తనకు ఇచ్చిన బడ్జెట్ తో ఇలాంటి అడ్వంచర్స్ సినిమా చేయడం మామూలు విషయం కాదు.
సాలె పురుగుల అటాక్, లవ్ ట్రాక్స్, ఫ్రెండ్ మధ్య మనస్ఫర్ధలు లాంటి సన్నివేశాలు ఆడియన్స్ ని సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి. పర్వతాలను, అడవులను చాలా చక్కగా చూపించారు కెమెరామ్యాన్. మ్యూజిక్, రీ-రికార్డింగ్ బాగుంది. డైలాగ్స్ కూడా బాగా రాసుకుని తను అనుకున్న కథను చాలా చక్కగా తెరపై చూపించారు డైరెక్టర్ రవి అండ్ టీం. ఆశ, అత్యాశల మధ్య మనుషులు ఎలా మారిపోతారు అనే అంశంతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది.
ఫైనల్ గా చెప్పాలంటే...
అడ్వెంచరస్ సినిమా చేయడం రిస్క్ తో కూడుకున్నది. అయినా సరే ఇష్టంగా ఈ సినిమాని చేసిన విధానం తెరపై కనిపిస్తోంది. క్లయిమ్యాక్స్ లో వచ్చే గ్రాఫిక్స్ హనుమంతుడు, డైరెక్టర్ జస్టిఫికేషన్ బాగున్నాయి. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉండే ఈ సినిమా ఆడియన్స్ కి థ్రిల్ కలిగిస్తుంది. గ్రాఫిక్స్, ట్విస్ట్ లు ఆడియన్స్ ని అబ్బురపరుస్తాయి. సో... ఈ వీకెండ్ ని ఈ సినిమాతో ఎంజాయ్ చెయ్యొచ్చు. సో.. డోంట్ మిస్ ఇట్... గో అండ్ వాచ్ ఇట్...!
ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5