View

సరైనోడు మూవీ రివ్య్వూ

Friday,April22nd,2016, 09:43 AM

చిత్రం - సరైనోడు
బ్యానర్ - గీతా ఆర్ట్స్
నటీనటులు - అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరీన్ దెరిస్సా, అంజలి (ఐటమ్ సాంగ్), శ్రీకాంత్, సుమన్, ఆది పినిశెట్టి, సాయికుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, సురేఖా వాణి, దేవ దర్శని తదితరులు
డైలాగ్స్ - ఎం.రత్నం
సినిమాటోగ్రఫీ - రిషి పంజాబి
సంగీతం - తమన్
కో-ప్రొడ్యూసర్స్ - శానం నాగ అశోక్ కుమార్, బన్ని వాసు
నిర్మాత - అల్లు అరవింద్
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - బోయపాటి శ్రీను


మంచి ఫామ్ లో ఉన్న ఇద్దరు కలిసి సినిమా చేస్తే అంచనాలు భారీగా ఉంటాయి. 'రేసుగుర్రం', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి ఘనవిజయాలతో హీరోగా అల్లు అర్జున్, 'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో దర్శకుడు బోయపాటి శ్రీను సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన 'సరైనోడు'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ లుక్, టీజర్, టైటిల్ అన్నింటికీ మంచి స్పందన లభించింది. మరి... భారీ అంచనాలతో ఈ రోజు (22.4.2016) విడుదలైన 'సరైనోడు' ఎలా ఉన్నాడో చూద్దాం...


కథ
రాష్ట్రానికి సిఎస్ అయిన ఉమాపతి కొడుకు గణ (అల్లు అర్జున్). మిలటరీ లో వర్క్ చేసి, అక్కడ అంతా బాగానే ఉంది.. లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మనషుల్లోనే మార్పు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మిలటరీని వదిలేసి ఇంటికి చేరతాడు. తన ముందు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే మనస్తత్వం గణాది కాదు. ఎంత దూరమైన వెళ్లి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలనుకునే మెంటాల్టీ. తండ్రి కన్నా బాబాయ్ శ్రీపతి (శ్రీకాంత్) దగ్గర గణాకి చనువు ఎక్కువ. బాబాయ్, పిన్ని కూడా గణాని సొంత కొడుకులా పెంచుతారు. ఉమాపతి ఫ్రెండ్ సాయికుమార్ పర్ణశాల ఊరికి చెందిన వ్యక్తి. ఆ ఊరిలోని ప్రజల పొలాలను ముఖ్యమంత్రి కొడుకు వైరం ధనుష్ (ఆది పినిశెట్టి) లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ ప్రజలను ఆదుకోవాలనే ఆలోచనతో తన ఫ్రెండ్, సి.యస్ ఉమాపతిని కలిసి తన ఊరి ప్రజలను ఆదుకోవాల్సిందిగా అడుగుతాడు సాయికుమార్. అయితే సి.యం కొడుకు కాబట్టి కామ్ గా ఊరుకోవడం బెటర్ అని ఉమాపతి చెబుతాడు. ఉమాపతి తన ఫ్రెండ్ సాయికుమార్ కూతురు (రకుల్ ప్రీత్ సింగ్) ని తన కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని భావించి జానుని చూసి రమ్మనమని గణాని పర్ణశాలకు పంపిస్తాడు. కట్ చేస్తే...


పర్ణశాలకు వెళ్లే సమయంలో ఎమ్మెల్యే (క్యాథరీన్) ని చూసి మనసు పారేసుకుంటాడు గణా. ఆమె వెనకపడి మనసు గెల్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఫైనల్ గా ఎలాంటి గొడవలకు వెళ్లకుండా తనతో కాపురం చేయడానికి రెడీ అయితే పెళ్లి చేసుకుంటానని, అలా అని తన కులదేవత మీద ప్రమాణం చేయాలని అడుగుతుంది ఎమ్మెల్యే. ప్రమాణం చేయడానికి సిద్ధపడి కులదేవత దగ్గరకు వెళ్లిన సమయంలో గణాని వెతుక్కుంటూ వస్తుంది జాను. ఆమెను రౌడీలు కొట్టి చంపడానికి వెనుకపడతారు. దాంతో ప్రమాణం సంగతి మర్చిపోయి జానూ తనదేనని చెప్పి రౌడీలను చితక్కొట్టి జానూని కాపాడతాడు. కట్ చేస్తే...


తన తండ్రిని, ఆ ఊరిలోని పెద్దలను వైరా ధనుష్ చంపిన విధానం గణా అతని కుటుంబానికి చెబుతుంది జానూ. ఆల్ రెడీ రెండు, మూడు సిట్యువేషన్ లో వైరా ధనుష్ అరాచకాలను చూసిన గణా అతని అంతం చూడాలని డిసైడ్ అవుతాడు. సి.యం కొడుకైనా సరే, అతని అరచకాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని కంకణం కట్టుకుంటాడు గణ. దాంతో ధనుష్, గణ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ధనుష్ వెనుక బలగం, హోదా అన్ని ఉంటాయి. లా అండ్ ఆర్డర్ ని చేతుల్లో తీసుకుని తన ఇష్టం వచ్చినట్టు ఓ ఉన్మాదిలా రాష్ట్రం మీద పడి దోచుకుతింటున్న ధనుష్ ని గణ ఎలా ఎదుర్కొన్నాడు... గణాకి డిజిపి ఏ రకంగా సాయపడతాడు.. వైరా ధనుష్ ఆట ఎలా కట్టించాడు అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
గణ పాత్రను అల్లు అర్జున్ బాగా చేసాడు. ఫైట్స్, డ్యాన్స్ లతో అలరించాడు. కాకపోతే రెగ్యులర్ గా తన బాడీ లాంగ్వేజ్ లో ఉండే వెటకారం, తనదైన శైలిలో పలికే కామెడీ డైలాగులు లాంటివి లేకపోవడం కాస్త నిరాశపరుస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరీన్ ఇద్దరూ గ్లామర్ గా ఉన్నారు. డిజిపిగా సుమన్, హీరో బాబాయ్ గా శ్రీకాంత్ బాగున్నారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర విలన్ వైరా ధనుష్ ది. ఈ పాత్రను ఆది పినిశెట్టి అద్బుతంగా పోషించాడు. విలన్ గా చక్కటి బాడీ లాంగ్వేజ్, స్టైలిష్ లుక్, ఆకట్టుకునే బేస్ వాయిస్ తో సూపర్ గా ఉన్నాడు. ఓ యంగ్ స్టైలిష్ విలన్ టాలీవుడ్ కి దొరికాడని చెప్పక తప్పదు.


సాంకేతిక వర్గం
విజువల్ గా సినిమా చాలా బాగుంది. ఈ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీకే దక్కుతుంది. ఈ చిత్రానికి తమన్ పాటలందించాడు. బ్లాక్ బస్టర్ సాంగ్ బాగుంది. మిగతా పాటలు విజువల్ గా బాగన్నాయనిపించే విధంగా ఉన్నాయి తప్ప.. పాటలుగా వినడానికి యావరేజ్ గా ఉన్నాయి. రీ-రికార్డింగ్ విషయంలో కూడా తమన్ పెద్దగా కష్టపడలేదు. ఓ రొటీన్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి చేసినట్టే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసాడు తప్ప... స్పెషల్ కేర్ తీసుకున్నట్టు అనిపించలేదు. డైరెక్టర్ తీసిన సీన్స్ ని ల్యాగ్ లేకుండా కట్ చేయడం వరకూ ఎడిటింగ్ వర్క్ బాగానే ఉంది. కాకపోతే వేస్ట్ సీన్ అనుకున్నవి మాత్రం మొహమాటపడకుండా సొంత డెసిషన్ తీసుకుని ఎడిట్ చేసే ప్రయత్నం చేయలేదు. అది చేసి ఉంటే సినిమా ఇంకా బెటర్ గా ఉండేది. కథకు సరిపడా బడ్జెట్ అనేకంటే... సీన్ ని ఎంత రిచ్ గా చూపించగలుగుతామనే ఆలోచనతో బాగా ఖర్చు పెట్టి గ్రాండియర్ గా సినిమాని చూపించడంలోనే నిర్మాత ఎక్కడ కాంప్రమైజక్ అవ్వలేదని తెలిసిపోతోంది.


ఇక డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి చెప్పాలంటే.. యాక్షన్ ఎంటర్ టైనర్ ని కుర్చీలకు అతుక్కుపోయి ప్రేక్షకులు సినిమాని ఆస్వాదించేలా ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లేతో తెరకెక్కించడం బోయపాటికి వెన్నతో పెట్టిన విద్య. ఇది కూడా యాక్షన్ సినిమానే. రొటీన్ స్టోరీ లైన్. కాకపోతే ఇంట్రస్టింగ్ స్ర్కీన్ ప్లేతో బి.సి సెంటర్స్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ సినిమాని మాస్ ఎంటర్ టైనర్ గా మలచడంతో బోయపాటి సక్సెస్ అయ్యారు. అయితే ప్రతి హీరోకి ఒక్కో యాంగిల్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ యాంగిల్ ని టచ్ చేయాలి. ఎందుకంటే ఆడియన్స్ ఆ హీరో దగ్గర్నుంచి అది ఎక్స్ ఫెక్ట్ చేస్తారు. అల్లు అర్జున్ నుంచి అయితే వెటకారపు బాడీ లాంగ్వేజ్, తనదైన శైలిలో పలికే కామెడీ డైలాగులు ను ఎక్స్ ఫెక్ట్ చేస్తారు. ఇది బోయపాటి మిస్ చేసారు. ఎమ్మెల్యే వెనకాల ప్రేమిస్తానని హీరో పడే సీన్స్ బాగున్నాయి. ఎ.యం.రత్నం అందించిన కొన్ని డైలాగులు బాగున్నాయి.


ఫిల్మీబజ్ విశ్లేషణ
కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడతారు. నిర్మాత దగ్గర్నుంచి, సినిమాని పంపిణీ చేసే ప్రతి ఒక్కరూ సేఫ్ అవ్వాలంటే ఇలాంటి కమర్షియల్ ఎంటర్ టైనర్స్ నే తెరకెక్కించాలి. ఈ విషయం బోయపాటి బాగా తెలుసు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించే ఫార్మూలాతో సినిమా చేసాడు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని సెంటిమెంట్ సీన్స్ వర్కవుట్ చేస్తే బాగుండేది. నిజం చెప్పాలంటే అలాంటి సీన్స్ వర్కవుట్ చేయడానికి స్కోప్ ఉంది. కానీ ఎందుకనో ఆ వైపుగా దృష్టి సారించలేదు. అలాగే ఫ్యామిలీ అటాచ్ మెంట్స్ ని చూపించడానికి కూడా స్కోప్ ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్, శ్రీకాంత్ మధ్య సాగే సీన్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా వర్కవుట్ చేస్తే బాగుండేది. కామెడీ సీన్స్ కూడా పెద్దగా లేకపోవడం నిరాశకు గురి చేస్తుంది. యాక్షన్ సీన్స్ లో ఇన్ వాల్వ్ అయి కళ్లప్పగించి చూసే ప్రేక్షకులు, ఆ సీన్స్ అయిపోయిన తర్వాత రొటీన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కి వెళ్లిపోతారు. కొంచెం డిఫరెంట్ గా సీన్స్ వర్కవుట్ చేసి ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయ్యుండేది.


ఫైనల్ గా చెప్పాలంటే... మాస్ ఎంటర్ టైనర్స్ ని ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. డిఫరెంట్ సినిమాలను కోరుకునే ఆడియన్స్ ని మాత్రం ఈ చిత్రం నిరాశపరుస్తుంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !