View

శివమ్ మూవీ రివ్య్వూ

Friday,October02nd,2015, 08:09 AM

చిత్రం - శివమ్
బ్యానర్ - స్రవంతి మూవీస్
నటీనటులు - రామ్, రాశిఖన్నా, అభిమన్యుసింగ్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, జె.పి, సప్తగిరి, నరేష్, మనో, సురేఖావాణి, ఫిష్ వెంకట్ తదితరులు
సినిమాటోగ్రఫీ - రసూల్ ఎల్లోర్
స్టంట్స్ - పీటర్ హెయిన్స్
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
సమర్పణ - కృష్ణచైతన్య
నిర్మాత - స్రవంతి రవికిషోర్
మాటలు: కిశోర్ తిరుమల
కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - శ్రీనివాసరెడ్డి

 

'పండగ చేస్కో' వంటి కమర్షియల్ హిట్ తర్వాత రామ్ నటించిన చిత్రం 'శివమ్'. ఒక విజయవంతమైన చిత్రం తర్వాత చేసిన చిత్రం కావడంతో 'శివమ్'ఫై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'స్రవంతి' మూవీస్ పతాకంపై పలు హిట్ చిత్రాలు నిర్మించిన 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నూతన దర్శకుడు శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. దర్శకుడి మీద నమ్మకంతో రవికిశోర్ ఆయనకు అవకాశం ఇచ్చారు. కథ, పెదనాన్న రవికిశోర్ మీద నమ్మకంతో రామ్ ఈ చిత్రం చేశారు. మరి.. 'శివమ్' ఎలా ఉందో చూద్దాం...

 

à°•à°¥
ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటే వాళ్లు ఎలాంటి ఇబ్బందులైనా దాటుకుని పెళ్లి చేసుకుని ఒకరి కోసం ఒకరు బ్రతకాలి అనే పిలాసఫీతో బ్రతుకుతుంటాడు శివ (రామ్). అంతే కాదు... ప్రేమను బ్రతికించడానికి తనకు సంబంధంలేని అమ్మాయి, అబ్బాయిని కలపడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. అలాగే తనకు ఏ అమ్మాయి అయినా కనెక్ట్ అయితే చచ్చేంతవరకూ ఆమె కోసం ఏమైనా చేయాలనే ఆలోచనతో ఉంటాడు శివ. ఓ ప్రేమ జంటకు పెళ్లి చేసి, వారి పెద్దల నుంచి కాపాడే ప్రయత్నంలో ఉన్నప్పుడు జడ్చర్లలో పెద్ద రౌడీ అయిన భోజిరెడ్డి (వినీత్ కుమార్) కొడుకును కొడతాడు. అదే సమయంలో 'ఐ లవ్ యూ' అని ట్రైన్ కు చెబుతూ తను కాలేజ్ లో నటించబోయే స్కిట్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న తను అనే తనూజ (రాశిఖన్నా)ని చూసిన శివ ఆమెతో కనెక్ట్ అయిపోతాడు. ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. ఒక అమ్మాయికి కనెక్ట్ అయితే ఆమె కోసం ఏమైనా చేయాలనే భావన కలవాడు కావడంతో తనూ వెనకాలే పడి ఆమె ప్రేమను గెలుచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు శివ.


తన కొడుకును కొట్టిన వాడిని వదలకూడదని భోజిరెడ్డి తన మనుషులతో శివ ని వెతికిస్తుంటాడు. మరోవైపు రెండుసార్లు తనూజ తనకు ఎదురుపడటం, ఆమె ఎదరుపడటం వల్లే తనకు మంచి జరిగిందని, తను లక్కీ గర్ల్ అని భావించి ఆమెను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు అభి (అభిమన్యుసింగ్) అనే రౌడీ షీటర్. మరి శివ ప్రేమను తనూజ అంగీకరిస్తుందా? తన వెనుక పడుతున్న భోజిరెడ్డి నుంచి శివ ఎలా బయటపడ్డాడు? తన లక్కీ గర్ల్ అని భావిస్తున్న తనూజని శివ కోసం అభి ఎలా వదిలేస్తాడు? అసలు తనకు సంబంధంలేని ప్రేమికులను కూడా ఒకటి చేయడానికి శివ రిస్క్ తీసుకోవడం వెనక ఉన్న బలమైన ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అనేదే ఈ చిత్ర కథ.

 

నటీనటుల పర్ఫార్మెన్స్
ఎలాంటి పాత్రను అయినా సునాయాసంగా చేస్తాడు రామ్. శివ పాత్రను చాలా ఎనర్జిటిక్ గా చేశాడు. ఫైట్స్, డ్యాన్ప్, రొమాన్స్... ఇలా నటనపరంగా వంక పెట్టడానికి లేదు. రామ్ కాస్ట్యూమ్ప్ బాగున్నాయి. ఓవరాల్ గా ఈ సినిమా మొత్తాన్ని తన భుజం మీద నడిపించాడు. రాశీ ఖన్నా చూడచక్కగా ఉంది. నటన పరంగా పెద్దంతగా విజృంభించే స్కోప్ లేని పాత్ర తనది. అక్కడక్కడా చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ మినహా తన పాత్ర దాదాపు పాటలకు పరిమితమైంది. నెగటివ్ షేడ్ క్యారెక్టర్స్ చేసిన వినీత్ కుమార్, అభిమన్యుసింగ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. బ్రహ్మానందం, శ్రీనివాస రెడ్డి, సప్తగిరి, ఫిష్ వెంకట్ తదితరులు నవ్వించగలిగారు. సీరియస్ గా అనిపించే కామెడీ క్యారెక్టర్స్ లో పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్ రెడ్డి, కృష్ణ భగవాన్ తదితరులు కూడా పాత్రల పరిధి మేరకు నటించారు. ఇంకా సీనియర్ నరేశ్, మనో, చంద్రమౌళి, సురేఖా వాణి, సంధ్యా జనక్, ప్రభాస్ శ్రీను.. ఇలా బోల్డంత మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ మంచి ఆర్టిస్టులే కాబట్టి, ఇచ్చిన పాత్రల్లో ఒదిగిపోయారు.

 

సాంకేతిక వర్గం
నూతన దర్శకుడు శ్రీనివాస రెడ్డి అనుకున్న కథ ఇటు కొత్తగా అటు పాతగా ఉండదు. ప్రేమికులను కలపడమే లక్ష్యంగా దూసుకెళ్లే శివ అనే కుర్రాడి కథ ఇది. ఈ చిన్న పాయింట్ చుట్టూ పెద్ద కథ అల్లడం కోసం కామెడీ ట్రాక్స్, సీరియస్ ట్రాక్స్... అంటూ బోల్డన్ని ట్రాక్స్ రాసుకున్నాడు. వెరసి చిరిగి చేట అయినట్లుగా పెద్ద కథ అయి కూచుంది. ట్విస్ట్ ల మీద ట్విస్టులతో కథ నడిపించాడు. అయితే, ఆ ట్విస్టులు ఎగ్జయిటింగ్ గా ఉండవు. ట్విస్టుల మీద కన్నా కథ మీద ఇంకా కసరత్తులు చేసి ఉంటే దర్శకుడిగా భేష్ అనిపించుకుని ఉండేవాడేమో. కిశోర్ తిరుమల రాసిన డైలాగ్స్ బాగున్నాయి. కొన్ని పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ లో ఓ రెండు, మూడు బాగా పేలినా ఇతర స్టార్ హీరోల డైలాగ్స్ ని తలపించాయి. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటల్లో 'అందమైన లోకం..', 'గుండె ఆగిపోతాందే..' పాటలు బాగున్నాయి. రసూల్ ఎల్లోర్ కెమరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ పరంగా చెప్పాలంటే సినిమా లెంగ్త్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, ఎడిటర్ ఫ్రీ హ్యాండ్ తీసుకుని కథకు లింక్ లేని సీన్స్ ని ఎడిట్ చేసి ఉంటే సినిమా నిడివి తగ్గి ఆడియన్స్ అసహనానికి గురవ్వకుండా ఉండే అవకాశముండేది. ఇక, నిర్మాణ విలువలు గురించి చెప్పాలంటే.. 'స్రవంతి' రవికిశోర్ బాగా ఖర్చు పెట్టారు. ఆ పరంగా అన్ కాంప్రమైజ్డ్ ప్రొడ్యూసర్ అని మరోసారి అనిపించుకున్నారు.

 

ఫిల్మీబజ్ విశ్లేషణ
డ్యాన్స్, ఫైట్స్, సీన్స్ లో తన శక్తి వంచన లేకుండా రామ్ చాలా కష్టపడి చేశాడు. కానీ, కథ ఎంపికలో తప్పు జరగడంవల్ల ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆశించినంతగా ఉండకపోవచ్చు. ఒక పాట, ఒక ఫైట్, రెండు, మూడు సీన్లు అన్న చందంగా సినిమా సాగుతుంది. హీరో ఒకటి పాటలు పాడతాడు.. లేకపోతే ఫైట్స్ చేస్తాడు అన్నట్లుగా సినిమా ఉంది. దానివల్ల టాకీ సీన్స్ తక్కువేమో అనే ఫీలింగ్ కలిగితే అది ప్రేక్షకుల తప్పు కాదు. రామ్ బాగా నటించగలుగుతాడు కాబట్టి, తనని ఎంతైనా దర్శకుడు వాడుకోవచ్చు. శ్రీనివాస రెడ్డి వాడుకున్నాడు కూడా. కానీ, ప్రతి పావుగంట, ఇరవై నిముషాలకో ఫైట్, పాట అంటే ఎంత కమర్షియల్ సినిమాలకు అలవాటుపడిన వాళ్లకైనా కొంత విసుగు రావడం ఖాయం. ఫస్టాఫ్ అంతా క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కి సరిపోతుంది. సెకండాఫ్ లో ఆ క్యారెక్టర్స్ ని హీరో ఆడుకునే ట్రాక్స్ తో సాగుతుంది. ఒకటి, రెండు ట్రాక్స్ తగ్గించి, సినిమా నిడివి తగ్గించినా డీసెంట్ టాక్ తెచ్చుకుని ఉండేదేమో. ఓ మంచి ఫ్లాష్ బ్యాక్ ఉన్నప్పటికీ, దానికి సరిపడా బలమైన సన్నివేశాలు కథలో లేకపోవడం ఓ మైనస్.


ఫైనల్ గా చెప్పాలంటే..

కొన్ని చిత్రాలు నిరాశపరిచిన నేపథ్యంలో 'పండగ చేస్కో'తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన రామ్ ని మళ్లీ ట్రాక్ తప్పించే చిత్రం 'శివమ్'. కథలు ఎంపిక చేసుకునే విషయంలో రామ్ జాగ్రత్త వహిస్తే.. తన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !