View

సుప్రీం మూవీ రివ్య్వూ

Thursday,May05th,2016, 08:31 AM

చిత్రం - సుప్రీమ్
బ్యానర్ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్
నటీనటులు - సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా, మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, పోసాని కృష్ణమురళి, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్ రెడ్డి, కబీర్ దూహన్ సింగ్, రవి కిషన్, సత్యం రాజేష్, పృథ్వీ తదితరులు
సంగీతం - సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ - సాయి శ్రీరామ్
ఎడిటింగ్ - ఎం.ఆర్.వర్మ
రచనా సహకారం - ఎస్.కృష్ణ
నిర్మాత - శిరీష్
సమర్పణ - దిల్ రాజు
కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - అనిల్ రావిపూడి
విడుదల తేదీ - 5.5.2016


పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ విజయాలతో సక్సెస్ ట్రాక్ లో ఉన్న సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'సుప్రీమ్'. 'పటాస్' వంటి విజయంతో దర్శకుడిగా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ఆరంభించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. విడివిడిగా సక్సెస్ ట్రాక్ లో ఉన్న దర్శకుడు - హీరో కాంబినేషన్ లో శిరీష్ నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు ఉండటం సహజం. తొలిసారిగా 'దిల్' రాజు సమర్పించిన చిత్రం ఇది. మరి.. 'సుప్రీమ్' ఎలా ఉందో తెలుసుకుందాం.


కథ
అనంతపురం లోని జాగృతి ట్రస్ట్ 15 వేల మంది ప్రజలకు చేయూతనిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తుంటుంది. ఈ ట్రస్ట్ భూములు తమవని చెప్పి ఆక్రమించుకోవడానికి విక్రమ్ సర్కార్ (కబీర్ దూహన్ సింగ్) ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ ట్రస్ట్ ని నిర్వహిస్తున్న నారాయణరావు (సాయికుమార్) కోర్టు ద్వారా ట్రస్ట్ ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ట్రస్ట్ భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ నారాయణరావు దగ్గర లేకపోవడం, విక్రమ్ దగ్గర ఆధారాలు ఉండటంతో భూములను స్వాధీనం చేస్తామని కోర్టు చెబుతుంది. అయితే ఆ ట్రస్ట్ కి భూములను స్వాధీనం చేసిన రాజవంశీకులు రఘుపతిగారి వారసుడు దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని, అవి తెప్పించి కోర్టుకు చూపిస్తామని నారాయణరావు చెప్పి అందుకు గడువు అడుగుతాడు. సరిగ్గా నెల రోజులు టైమ్ ఇచ్చి డాక్యుమెంట్స్ చూపించలేకపోతే విక్రమ్ కి భూములను స్వాధీనం చేయడం జరుగుతుందని కోర్టు తీర్పు ఇస్తుంది. దాంతో ఆ వారసుడుని పట్టుకోవడానికి విక్రమ్, నారాయణరావు ప్రయత్నాలు మొదలుపెడతారు. కట్ చేస్తే...


హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా లైఫ్ ని లీడ్ చేస్తుంటాడు బాలు (సాయిధరమ్ తేజ్). తన గతాన్ని మర్చిపోవడానికి తాగుబోతుగా మారిపోతాడు బాలు తండ్రి రాజేంద్రప్రసాద్. తన తండ్రి తనకు హీరో అని భావించే బాలు చాలా జాగ్రత్తగా తనను చూసుకుంటుంటాడు. ఓ సందర్భంలో యస్.ఐ బెల్లం శ్రీదేవి (రాశిఖన్నా) చూసిన బాలు మనసు పారేసుకుంటాడు. మరో సందర్భంలోఓ కుర్రాడు రాజన్ ని కలుస్తాడు బాలు. రాజన్ తల్లిదండ్రులు చనిపోయారని, తను ఒక అనాధ అని తెలుసుకుని ఆ కుర్రాడిని చేరదీసి తన ఇంటికి తీసుకువస్తాడు బాలు. కట్ చేస్తే...


హైదరాబాద్ లో వారసుడు ఉన్నాడని తెలుసుకున్న నారాయణరావు, విక్రమ్ ఎవరి దారుల్లో వారు వెతుకుతుంటారు. ఒకరోజు బాలుకి ఓ లెటర్ రాసి ఇల్లు వదిలి వెళ్లిపోతున్నానని చెప్పి రాజన్ వెళ్లిపోతాడు. రాజన్ ని ఇంటికి తీసుకురావడానికి బయలుదేరతాడు బాలు. ఆ ప్రయత్నంలో రాజన్ వెనుక విక్రమ్ గ్యాంగ్ పడటం, ఆ పిల్లాడిని తీసుకెళ్లిపోవడం చూస్తాడు బాలు. నారాయణరావుగారి ద్వారా ఆ పిల్లాడే ట్రస్ట్ భూములకు సంబంధించిన వారసుడని, ఆ పిల్లాడి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయిని తెలుసుకుంటాడు బాలు. విక్రమ్ ఆల్ రెడీ విదేశాల్లో ఉన్న రాజన్ తల్లిదండ్రులను చంపేసాడని, పిల్లాడి దగ్గర డాక్యుమెంట్ ని తీసుకుంటాడని తెలియడంతో రాజన్ ని కాపాడటానికి బాలు బయలుదేరతాడు. రాజన్ ని ఒడిసా తీసుకెళ్లిపోయారని తెలియడంతో ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజన్ ని తీసుకుని గడువులోపు అనంతపురం చేరుకుంటానని నారాయణరావుగారికి, తన తండ్రికి మాట ఇచ్చి ఒడిసా బయలుదేరతాడు బాలు.


మరి రాజన్ ని రౌడీ గ్యాంగ్ నుంచి కాపాడి గడుపులోపు బాలు అనంతపురం చేరుకుంటాడా.. ట్రస్ట్ భూములకు చెందిన డాక్యుమెంట్స్ ని కోర్టుకు సబ్మిట్ చేస్తారా అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
బాలు పాత్రను సాయిధరమ్ తేజ్ చాలా ఈజ్ గా చేసాడు. క్యాబ్ డ్రైవర్ గా మాస్ లుక్ లో అలరించాడు. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేసాడు. సినిమా, సినిమాకి తనని తాను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతున్నాడు సాయిధరమ్ తేజ్ అని చెప్పక తప్పదు. బెల్లం శ్రీదేవి పాత్రలో రాశిఖన్నా బాగుంది. కాస్త బరువు కూడా తగ్గి బాగుంది. స్టైలిష్ విలన్ గా కబీర్ దూహన్ సింగ్, మాస్ విలన్ గా రవికిషన్ ఆకట్టుకున్నారు. తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్, ట్రస్ట్ నిర్వాహకుడి పాత్రలో సాయికుమార్ అలరించారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. స్టోరికి కీలకమైన పాత్రను చేసిన బాబు క్యూట్ గా ఉన్నాడు.


సాంకేతిక వర్గం
సింఫుల్ స్టోరీ లైన్ ని తీసుకుని ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లేతో సినిమాని మలచడానికి ప్రయత్నం చేసాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఫస్టాప్ లో సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా ల మధ్య సాగే లవ్ ట్రాక్ ఎంటర్ టైన్ మెంట్ వేలో ఉంది. కాకపోతే ఈ లవ్ ట్రాక్ లో హీరో, హీరోయిన్ మధ్య ఇంకా బలమైన లవ్ సీన్స్ ఉంటే బాగుండేది. సెకండాఫ్ బాగుంది. ముఖ్యంగా సినిమా లెంగ్త్ విషయంలో డైరెక్టర్ కేర్ తీసుకోవడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. సాయికార్తీక్ ఈ చిత్రానికి పాటలందించారు. పాటలకంటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. 'అందం హిందోళం...' సాంగ్ రీమిక్స్ చేయడం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయి. కథకు సరిపడా బడ్జెట్ ని సమకూర్చి నిర్మాణపరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు నిర్మాత శిరీష్.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఓ చక్కటి స్టోరీ లైన్ ని తీసుకుని, కమర్షియల్ హంగులతో సినిమాని తీర్చిదిద్దడంలో డైరెక్టర్ సక్సెస్ అయినట్టే. కాకపోతే 'పటాస్' సినిమాని చూసిన ప్రేక్షకులు ఇంకా ఈ డైరెక్టర్ నుంచి ఎక్కువగా ఆశిస్తారు. ఆ పరంగా మాత్రం కొంచెం నిరాశకలగమానదు. సాయిధరమ్ తేజ్ తన గత చిత్రాల్లోలానే మేనమామలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ని తన మ్యానరిజమ్స్ ద్వారా గుర్తుకు తెచ్చాడు. 'అందం హిందోళం..' పాటలో చిరు, పవన్ కళ్యాణ్ గుర్రమెక్కిన షాట్స్ వేసి మెగాభిమానుల్లో ఉత్సాహాన్ని నింపడం బాగుంది. సినిమా నిడివి విషయంలో జాగ్రత్త పడటంతో సినిమా బోర్ కొట్టలేదు. ముఖ్యంగా సెకండాఫ్ చాలా త్వరగా పూర్తయిపోయినట్టు అనిపిస్తుంది. అది ఈ సినిమాకి ప్లస్. 'నా రాజ్యంలో ప్రజలు కష్టపడుతుంటే నేను చూడలేను' అని రాజన్ పాత్ర చేసిన బాబు ముద్దుగా చెప్పడం బాగుంది. అదే డైలాగ్ తో క్లయిమ్యాక్స్ లో ఆ బాబుకు హీరో పాత్ర స్ఫూర్తి నింపడం బాగుంది. ఓవరాల్ గా సింఫుల్ స్టోరీతో కమర్షియల్ ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ఆడియన్స్ ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉంది కాబట్టి వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా దూసుకెళ్లే అవకాశముంది.


ఫైనల్ గా చెప్పాలంటే... డిఫరెంట్ సినిమాలను కోరుకునే వారికి ఈ సినిమా అంతగా కనెక్ట్ అవ్వదు. కానీ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ని ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Read More !