View

ది ఐస్ మూవీ రివ్య్వూ

Sunday,October04th,2015, 01:31 PM

చిత్రం - ది ఐస్
బ్యానర్ - డి.వి.సినీ క్రియేషన్స్
నటీనటులు - మీరాజాస్మిన్, బద్రి, శంకర్, సూరజ్ వెంజరాముడు, నందు తదితరులు
రీ-రికార్డింగ్ - కనిష్క
మాటలు - వెన్నెలకంటి
నిర్మాత - డి.వి.వెంకటేష్
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - షాజియం
సెన్సార్ సర్టిఫికేట్ - 'యు'
విడుదల తేదీ - అక్టోబర్ 9, 2015


పందెంకోడి, గుడుంబా శంకర్, అమ్మాయి బాగుంది, మోక్ష తదితర చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన మీరా జాస్మిన్ ప్రధాన పాత్రలో షాజియం దర్శకత్వంలో రూపొందిన మలయాళ చిత్రం 'మిస్ లేఖ థరూర్ కానున్నదు'. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వి.వెంకటేష్ ' ది ఐస్' టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. హారర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని, మీరాజాస్మిన్ నటన ఈ చిత్రానికి హైలెట్ గా ఉంటుందని ఈ చిత్ర నిర్మాత మీడియా సమావేశాల్లో చెబుతూ వచ్చారు. హారర్ చిత్రాలకు రీ-రికార్డింగ్ ప్రాణం కాబట్టి... తెలుగు వెర్షన్ రీ-రికార్డింగ్ ని సంగీత దర్శకుడు కనిష్కతో మళ్లీ చేయించారు నిర్మాత. ఈ సినిమా తనకు చాలా మంచి పేరు తెచ్చి పెడుతుందనే కాన్ఫిడెంట్ తో ఉన్న నిర్మాత నమ్మకం వమ్మవ్వకుండా ఉంటుందా... హారర్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి, ఈ సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంటుందాని తెలుసుకుందాం. అక్టోబర్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


à°•à°¥
అంధురాలు అయిన లేఖ (మీరా జాస్మిన్) పాపులర్ టివి చానెల్లో ఓ షో ని హోస్ట్ చేస్తుంటుంది. కంటిదానం చేసిన ఓ వ్యక్తి వల్ల లేఖకి కంటిచూపు వస్తుంది. కానీ కంటిచూపు వచ్చిన లేఖ భయంకరమైన సంఘటనలను చూస్తుంటుంది. విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. లేఖ పరిస్థితికి కారణం సెల్యూలర్ మెమొరీ లాస్ అనే జబ్బు అని తెలుస్తుంది. లేఖ ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడుతుంది అనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
మీరాజాస్మిన్ అద్భుతమైన నటి అని పలు చిత్రాలు నిరూపించాయి. ఆమె తక్కువ సినిమాలు చేసినప్పటికీ, హిట్ సినిమాలే ఆమె ఖాతాలో ఎక్కువున్నాయి. అంధురాలిగా ఈ చిత్రంలో అద్భుతంగా నటించింది మీరాజాస్మిన్. భయపడే సన్నివేశాల్లో ఆమె జీవించింది. సహజమైన నటనతో లేఖ పాత్రలో మీరా ఒదిగిపోయిన తీరును అభినందించాల్సిందే. సినిమాని తన భుజాలపై మోసింది.

బ్రది, శంకర్ జోష్, సూరన్, సూరజ్ వెంజరాముడు, నందు, గీతావిజయన్, ఆషా, అరుణ్ తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.


సాంకేతిక వర్గం
హారర్, సప్పెన్స్ థ్రిల్లర్స్ కి రీ-రికార్డింగ్ చాలా ఇంపార్టెంట్. సీన్లు ఎలివేట్ అవ్వాలన్నా, ప్రేక్షకులు సీన్ లో ఇన్ వాల్వ్ అవ్వాలన్నా రీ-రికార్డింగ్ బాగుండాలి. అందుకే సంగీత దర్శకుడు కనిష్కతో నిర్మాత వెంకటేష్ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి చేయించారు. ఆ ఎఫర్ట్ కనిపించింది. రీ-రికార్డింగ్ ఈ చిత్రానికి మెయిన్ హైలెట్. సినిమాటోగ్రఫీ చాలా ప్లస్. షార్ప్ ఎడిటింగ్ తో సినిమా చాలా ఫాస్ట్ గా ఉంది. ఎక్కడా ల్యాగ్ అనిపించదు. డైలాగ్స్ బాగున్నాయి. కథకు సరిపడా బడ్జెట్ సమకూర్చారు నిర్మాత. క్వాలిటీ డబ్బింగ్, రీ-రికార్డింగ్ ని చేయించి సినిమాపై తనకున్న పాషన్ ని చాటుకున్నారు తెలుగు వెర్షన్ నిర్మాత వెంకటేష్.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఆసక్తికరమైన స్టోరీ లైన్. ఎంత మంచి స్టోరీ అయినా స్ర్కీన్ ప్లే పర్ ఫెక్ట్ గా కుదిరితేనే ఆ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాకి అది కరెక్ట్ గా కుదిరింది. డైరెక్టర్ చేసిన స్ర్కీన్ ప్లే ఈ చిత్రానికి మెయిన్ ప్లస్ పాయింట్. ఆ కథను తెరపై ఆవిష్కరించాలంటే సరైన నటులు కుదరాలి. లేఖ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. లేఖ పాత్ర కోసం మీరాజాస్మిన్ ని తీసుకున్నప్పుడే ఈ సినిమా సగం విజయం సాధించేసింది. కథ, స్ర్కీన్ ప్లే, టేకింగ్, సరైన నటీనటులను ఎంపిక చేయడంలో డైరెక్టర్ కరెక్ట్ గా హెంవర్క్ చేస్తే, ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడం చాలా ఈజీ. ఈ హారర్ థ్రిల్లర్ ని సస్పెన్స్ ఎలిమెంట్స్ తో నడిపించడం, సెంటిమెంట్ టచ్ ఇవ్వడం ఆడియన్స్ ని సీటుకు అతుక్కుపోయేలా చేస్తుంది. థ్రిల్లర్ సినిమాలను అన్ని వర్గాల ప్రేక్షకులూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి జానర్ సినిమాలు చాలా సేఫ్. ఇక సినిమా బాగుంటే మంచి వసూళ్లు కూడా కురిపిస్తుంది. 'ది ఐస్' మంచి సినిమా అనే పేరుతో పాటు కలెక్షన్ల పరంగా కూడా నిర్మాతను శాటిస్ ఫై చేస్తుంది.


ఫైనల్ గా చెప్పాలంటే...
ఈ పర్ ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ ని మిస్ అవ్వకండి.. ఎంజాయ్ ది మూవీ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !