చిత్రం - ఉల్లాల ఉల్లాల
నటీనటులు - రాజ్ తరుణ్, షాలినీ పాండే, నాజర్, రోహిణి తదితరులు
బ్యానర్ - సుఖీభవ మూవీస్
సినిమాటోగ్రఫీ - జే.జీ.కృష్ణ దీపక్
ఎడిటింగ్ - ఉద్దవ్
సంగీతం - జాయ్ రాయరాల
నిర్మాత - ఏ.గురురాజ్
దర్శకత్వం - సత్యప్రకాశ్
నటుడు సత్యప్రకాశ్ ఎన్నో చిత్రాల ద్వారా తన నటనతో సినీప్రియులను మెప్పించాడు. ఇప్పుడు మెగాఫోన్ పట్టుకుని 'ఉల్లాల ఉల్లాల' సినిమాతో దర్శకుడిగా ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా తనయుడు నటరాజ్ ని హీరోగా తెరకు పరిచయం చేసారు. మరి దర్శకుడిగా సత్యప్రకాశ్ కీ, హీరోగా నటరాజ్ కి 'ఉల్లాల ఉల్లాల' సినిమా ఎంతవరకూ ఉపయోగపడుతుందనే విషయం రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
నటరాజ్ (నటరాజ్) కి దర్శకుడిగా ఎదగాలనే కోరికతో పాటు డబ్బు సంపాదించాలనే వ్యామోహం ఉంటుంది. ఇతనిని నూరిన్ (నూరీన్ షెరీఫ్) ప్రేమిస్తుంటుంది. కానీ ఆమెను నటరాజ్ పట్టించుకోడు. అలాంటి సమయంలో నటరాజ్ జీవితంలోకి త్రిష (అంకితా మహారాణా) వస్తుంది. నూరిన్ ఇంట్లో అతిలోకసుందరి /కాలకేయ ప్రభాకర్) ఉంటుంటాడు. నటరాజ్ పండు అనే పాత్రలో తనను తాను ఊహించుకుంటాడు. అసలు త్రిష, పండు అనే పాత్రకు ఉన్న సంబంధం ఏంటీ? వీరంతా ఎందుకు మాయమవుతుంటారు.. వీళ్లందరూ ఆత్మలా... ఆత్మ రూపంలో ఉన్న మనుషులా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
సత్యప్రకాశ్ తనయుడు నటరాజ్ హీరోగా పరిచయం అయిన సినిమా ఇది. దాంతో నటరాజ్ ని సత్యప్రకాశ్ తో పోల్చి చూస్తారు ఆడియన్స్. ఆయనలా ఫైట్ చేస్తాడని అందరూ ఊహించుకుంటారు. ఆ విషయంలో నటరాజ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఫైట్స్, డ్యాన్స్ బాగా చేసాడు. నూరీన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. గ్లామర్ తో ఆకట్టుకుని ఆడియన్స్ ని పడేసింది త్రిష పాత్ర చేసిన అంకితా. అతిలోకసుందరిగా కాలకేయ కొత్తగా కనిపించాడు. కాలకేయ ప్రభాకర్ కి మేకప్ చాలా ప్లస్ అయ్యింది. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
టెక్నికల్ గా...
నటుడిగా సత్యప్రకాశ్ సక్సెస్ అయ్యాడు. మరి డైరెక్టర్ గా సత్యప్రకాశ్ ఆడియన్స్ ని మెప్పించగలిగాడా అంటే... యస్ అనే చెప్పాలి. ప్రతి పాత్రను ఎమోషనల్ గా తీర్చిదిద్దడంతో పాటు, నటీనటుల దగ్గర చక్కటి నటనను రాబట్టడంలో సత్యప్రకాశ్ సక్సెస్ అయ్యాడు. సంగీతం, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. సినిమా ఫ్లో బాగుంది. ఆ రకంగా ఎడిటింగ్ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కాంప్రమైజ్ అవ్వకుండా, కథకు సరిపడా ఖర్చు పెట్టారు నిర్మాత.
విశ్లేషణ
రొమాన్స్, ఫైట్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. నూరీన్ ని రౌడీలు ఏడ్పించడం, నటరాజ్ వచ్చి ఆమెను కాపాడటంలాంటి సన్నివేశాలు ఆసక్తిగా ఉంటాయి. త్రిష పాత్ర ఎంట్రీ ఇచ్చిన తర్వాత రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సీన్స్ యూత్ ని కట్టపడేస్తాయి.
ఫైనల్ గా చెప్పాలంటే... యూత్ ని ఆకట్టుకునే సినిమా 'ఉల్లాల ఉల్లాల'.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5