చిత్రం - ఉత్తరనటీనటులు - శ్రీరామ్ నిమ్మల, కర్రోన్య కటరీన్, అజయ్ ఘోష్
సంగీతం - సురేష్ బొబ్బిలిఛాయాగ్రహణం - చరణ్ బాబు
కూర్పు - బొంతల నాగేశ్వర్ రెడ్డి
నిర్మాణ సంస్థ - లివ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్
నిర్మాతలు - తిరుపతి ఎస్ ఆర్, శ్రీపతి గంగాదాస్
రచన, దర్శకత్వం - తిరుపతి ఎస్ ఆర్
కథ...
అశోక్ ఓ అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకుని ఆమెను పోషించేంత స్థోమత కలిగిన కుర్రాడు కాదు. దాంతో తాను ప్రేమించిన స్వాతిని పెళ్లి చేసుకోవాలంటే ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే టార్గెట్ తో ఉంటాడు. అలాంటి సమయంలో 'ఉత్తర' అనే నిధి గురించి తెలుసుకుని, ఆ నిధిని చేజిక్కించుకోవడం కోసం ఊరి పెద్ద అయిన రుద్రయ్యతో చేతులు కలుపుతాడు. మరి ఫైనల్ గా ఆ నిధిని చేజిక్కించుకుని, ఉత్తరను అశోక్ పెళ్లి చేసుకున్నాడా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్...
అశోక్ పాత్రను చేసిన శ్రీరామ్ నిమ్మల చాలా బాగా నటించాడు. నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావడం, కథ ప్రకారం సినిమా మొత్తం అశోక్ పాత్ర చుట్టూ తిరగడంతో శ్రీరామ్ కు స్ర్కీన్ స్పేస్ ఎక్కువ దొరికింది. దాంతో శ్రీరామ్ కూడా అశోక్ పాత్రలో ఒదిగిపోయే నటించడానికి అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించి చాలా బాగా నటించాడు శ్రీరామ్. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
టెక్నికల్ గా...
డైరెక్టర్ తిరుపతి ఎస్ ఆర్ రాసుకున్న కథ ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉంది. కామెడీ, లవ్, సప్పెన్స్ లాంటి అంశాలతో ఆడియన్స్ ని సినిమాలో లీనమయ్యేలా చేయడంతో డైరెక్టర్ కి ప్లస్ మార్కులు పడతాయి. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు ఆడియన్స్ ని మెప్పిస్తాయి. కథకు సరిపడా ఖర్చుతో కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని తెరకెక్కించడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్.
ఫిల్మీబజ్ విశ్లేషణ...
ఫస్టాప్ కామెడీ, లవ్ ట్రాక్ తో చాలా పాస్ట్ గా పూర్తయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెకండాఫ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఇంటర్వెల్ తో సినిమా మంచి మలుపు తీసుకుంటుంది. క్లయిమ్యాక్స్ హ్యాండిల్ చేసిన విధానం సూపర్బ్. జైలు సన్నివేశాలు ఆడియన్స్ ని అలరిస్తాయి. టోటల్ గా నిధి కోసం హీరో అతని ఫ్రెండ్స్ పడే తపన నచ్చుతుంది.
ఫైనల్ గా చెప్పాలంటే... లవ్, కామెడీ, సస్పెన్స్ లాంటి అంశాలతో తెరకెక్కిన 'ఉత్తర' అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. సో... డోంట్ మిస్ ఇట్...!
ఫిల్మీబజ్ రేటింగ్ - 3/5