View

వైశాఖం మూవీ రివ్య్వూ

Friday,July21st,2017, 08:12 AM

చిత్రం - వైశాఖం
బ్యానర్ - ఆర్.జె.సినిమాస్
నటీనటులు - హరీష్, అవంతిక, రమాప్రభ, సాయికుమార్, ఈశ్వరీరావు, పృథ్వీ, కాశీ విశ్వనాధ్, గుండు సుదర్శన్, అప్పారావు, శేషు, ఫణి, మాధవి తదితరులు
సినిమాటోగ్రఫీ - వాలిశెట్టి వెంకటసుబ్బారావు
సంగీతం - డి.జె.వసంత్
నిర్మాత - బి.ఎ.రాజు
కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, ఎడిటింగ్, దర్శకత్వం - జయ.బి


చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్ లీ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన లేడీ డైరెక్టర్ జయ.బి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వైశాఖం'. హవీష్, అవంతిక జంటగా అపార్ట్ మెంట్స్ బ్యాక్ డ్రాప్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్.జె.సినిమాస్ బ్యానర్ పై బి.ఎ.రాజు నిర్మించారు. సినిమా ఆరంభమైన రోజు నుంచే చక్కటి పబ్లిసిటీతో పబ్లిక్ లో ఆసక్తిని రేకెత్తించారు నిర్మాత రాజు. టీజర్స్, ట్రైలర్స్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ రోజు (21.7.207) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలు అందుకునే విధంగా ఉందా... తెలుసుకుందాం...


కథ
ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి వేణు (హవీష్) తను ఉంటున్న అపార్ట్ మెంట్ లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటాడు. అతనిని ఈ అపార్డ్ మెంట్ నుంచి బయటికి పంపించడానికి అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్ తో పాటు ఆ అపార్డ్ మెంట్ లో నివసిస్తున్నవారు దారులు వెతుకుతుంటారు. కానీ వేణు తన తెలివితేటలతో వారిని కార్నర్ చేస్తూ నోళ్లు మూయిస్తుంటాడు. సరిగ్గా అలాంటి సమయంలో ఆ ఆపార్ట్ మెంట్ లోకి వేణు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుని భానుమతి (అవంతిక) ఎంట్రీ ఇస్తుంది. బ్యూటీ పార్లర్ పెడుతుంది. వేణు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడంతో భానుమతికి ఫ్లాట్ ఇస్తారు. కట్ చేస్తే...


తన పేరును వాడుకుని అపార్ట్ మెంట్ లో బ్యూటీ పార్లర్ నడుపుతున్న భానుమతిని ఖాళీ చేయించడానికి ప్లాన్ చేస్తాడు వేణు. అయితే ఫెరాలిసిస్ అటాక్ తో వేణుకి దూరంగా ఉంటున్న వేణు అమ్మను తీసుకునివచ్చి తన ఫ్లాట్ లో ఉంచుకుని ఆమెకు సపర్యలు చేస్తుంటుంది భానుమతి. టిట్ ఫర్ టాట్ గా భానుమతి తండ్రిని తీసుకొచ్చి తన ఫ్లాట్ లో పెట్టుకుని ఆయనతో అడ్డమైన చాకరీ చేయిస్తుంటాడు.


అసలు భానుమతి, వేణుకి ఉన్న లింకేంటీ.. అపార్ట్ మెంట్ లో ఎందుకు వేణు న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటాడు... వేణు తల్లి వేణు దగ్గర ఎందుకు ఉండదు.. వేణు ఫ్లాష్ బ్యాక్ ఏంటీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


నటీనటుల పెర్ ఫామెన్స్
అపార్ట్ మెంట్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసే కుర్రాడిగా రెక్ లెస్ బాడీ లాంగ్వేజ్, తల్లిదండ్రుల మీద ప్రేమ, రెస్పాన్స్ బులిటీ ఉన్న కుర్రాడిగా హరీష్ నటన బాగుంది. డ్యాన్సులు బాగా చేసాడు. అవంతిక గ్లామర్ గా ఉంది. భానుమతి పాత్రలో ఒదిగిపోయింది. సాయికుమార్ కీలక పాత్ర చేసారు. ఈ పాత్ర ఆడియన్స్ మనసుల్లో నిలిచిపోతుంది. రమాప్రభ, ఈశ్వరీరావు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. ఫృధ్వీ, గుండు సుదర్శన్, అప్పారావు సీన్స్ నవ్విస్తాయి. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.


సాంకేతిక వర్గం
సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్. విజువల్స్ బాగున్నాయి. సంగీత దర్శకుడు వసంత్ అందించిన పాటలు బాగున్నాయి. కజికిస్తాన్ లో చిత్రీకరించిన సాంగ్స్ విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ స్కోర్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సూపర్బ్. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. కథకు సరిపడా బడ్జెట్ ని సమకూర్చారు నిర్మాత బి.ఎ.రాజు. ఇక కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, ఎడిటింగ్, దర్శకత్వ బాధ్యతలను చేపట్టిన జయ.బి గురించి చెప్పుకోవాలంటే... అపార్ట్ మెంట్ నేపధ్యంలో, హార్ట్ టచింగ్ పాయింట్ తీసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. మంచి మెసేజ్, సిట్యువేషనల్ డైలాగ్స్ తో లవ్, ఎమోషన్స్.. ఇలా అన్ని రకాల మసాలాలు దట్టింటి పర్ ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించడంలో జయ సక్సెస్ అయ్యారు.


ఫిల్మీబజ్ విశ్లేషణ
ఉమ్మడి కుటుంబాలు, ఇండిపెండెంట్ హౌస్ లు అనేవి సిటీలో అసలు కనిపించడంలేదు. అపార్ట్ మెంట్ కల్చర్ పెరిగిపోయింది. అయితే అపార్ట్ మెంట్ప్ లో పక్కపక్కన ఫ్లాట్స్ లో ఎన్నో యేళ్లు కలిసి, మెలిసి ఉంటున్నవారు ఒక్కో సిట్యువేషన్ లో హ్యుమన్ రిలేషన్స్ మర్చిపోయి మరీ సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తున్న సంఘటనలను చాలానే చూస్తున్నాము. సరిగ్గా ఇలాంటి ఓ సిట్యువేషన్ ని మెయిన్ పాయింట్ గా తీసుకుని తెరకెక్కించిన సినిమా. మనిషి చనిపోతే, వినాయకుడి ఉత్సవాలు జరుగుతున్నసందర్భం కాబట్టి, శవాన్ని అపార్ట్ మెంట్ లోకి తీసుకెళ్లడానికి వీలులేదని చెప్పేటంతటి సెల్ఫీష్ నెస్ కి అలవాటుపడుతున్న దౌర్భాగ్యం, పక్కింట్లో ఏం జరిగితే మనకేంటిలే అనుకునే మనస్తత్వాలను అలవాటు చేసుకుని హ్యుమన్ రిలేషన్స్ ని మర్చిపోతున్న వైనాన్ని తెరకెక్కించిన వైనం సూపర్బ్, ఇలాంటి సిట్యువేషన్స్ స్వయంగా మనకి ఎదురైతేగానీ, రియలైజ్ అవ్వడం రియల్ లైఫ్ లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. ఈ మెసేజ్ ని చెబుతూనే, ఎంటర్ టైన్ మెంట్ మిస్ అవ్వకుండా కమర్షియల్ గా సినిమాని తెరకెక్కించిన విధానం బాగుంది. లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి.


ఫైనల్ గా చెప్పాలంటే... పెరుగుతున్న అపార్ట్ మెంట్ కల్చర్ లో, మనుషులు మర్చిపోతున్న విలువలను తట్టిలేపే సంఘటనతో తెరకెక్కిన ఈ సినిమాని కుటుంబంతో కలిసి చూసి అస్వాదించవచ్చు. డోంట్ మిస్ ఇట్...!


ఫిల్మీబజ్ రేటింగ్ - 3.25/5



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !