View

Dr.Salim Movie review

Friday,March13th,2015, 08:27 AM

చిత్రం - డా.సలీమ్
బ్యానర్స్ - ఎస్.కె.పిక్చర్స్, ఓబులేశ్వర ప్రొడక్షన్స్
నటీనటులు - విజయ్ ఆంటోని, అక్ష తదితరులు
సంగీతం - విజయ్ ఆంటోని
ఎడిటింగ్ - యం.వి.రాజేష్ కుమార్
సినిమాటోగ్రఫీ - గణేష్ చంద్ర
సమర్పణ - నాగప్రసాద సన్నితి
సహ నిర్మాత - ఎం.అర్జున్ గౌడ్
నిర్మాతలు - తమటం కుమార్ రెడ్డి, సురేష్ కొండేటి
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - ఎన్.వి.నిర్మల్ కుమార్

'ప్రేమిస్తే'లాంటి విజయవంతమైన చిత్రం ద్వారా నిర్మాతగా మారి, ఇప్పటివరకు పది చిత్రాలను అందించారు సురేష్ కొండేటి. ఎస్.కె. పిక్చర్స్ ద్వారా ఆయన విడుదల చేసే చిత్రాలన్నీ ఉత్తమాభిరుచి గలవే. ఆ విధంగా ఆ బేనర్ కి ఓ మంచి ఇమేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆ బ్యానర్ నుంచి వచ్చిన చిత్రం 'డా.సలీమ్' ఈ బ్యానర్ నుంచి వచ్చిన గత చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా తమ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉంటుందని సురేష్ చెబుతూ వచ్చారు. ఇందులో సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా నటించారు. అక్ష కథానాయికగా నటించింది. తమిళంలో పెద్ద హిట్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల మనసులను గెల్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు ఏ మేరకు నిజం అవుతాయి? 'డా.సలీమ్' అందరి మన్ననలు అందుకునే విధంగా ఉందా అనే విషయాన్ని తెలుసుకుందాం.

à°•à°¥
ప్రాణాపాయంలో ఉన్న ఓ అమ్మాయి (నర్మద) చెట్ల పొదల్లో పడి ఉన్న సన్నివేశంతో ఈ సినిమా ఆరంభమవుతుంది. ఆ అమ్మాయి ఎవరు? ఏంటి అనే విషయం తదుపరి కథలో వస్తుంది. డా. సలీమ్ (విజయ్ ఆంటోని) ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాడు. సహనం, నీతీ నిజాయతీలకు చిరునామా అన్న విధంగా ఉంటాడు సలీమ్. తను అనాథ. ఒంటరిగా జీవిస్తున్న సలీమ్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. అక్ష (నిషా)తో అతనికి పెళ్లి కుదురుతుంది. నిశ్చితార్థం కూడా జరుగుతుంది. వైద్య వృత్తికి న్యాయం చేసే దిశలో తన కాబోయే భార్యకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతాడు సలీమ్. దాంతో అతన్ని అసహ్యించుకుంటుంది నిషా. ఆ విధంగా ఈ ఇద్దరూ విడిపోతారు. తన కళ్ల ముందు ఎలాంటి అన్యాయం జరిగినా ఎదిరించే సలీమ్ బడాబాబుల చేతిలో మోసపోయిన నర్మదను కాపాడి, వైద్యం చేసి, ఆ అమ్మాయి అసలు కథ తెలుసుకుంటాడు. ఉచితంగా ఆ అమ్మాయికి వైద్యం చేస్తుంటాడు. కానీ, సలీమ్ కి తెలియకుండా నర్మదను ఆస్ప్రతి వర్గాలు పంపించేస్తారు. పేదవాళ్లకు ఉచితంగా చికిత్స చేసి, ఆస్ప్రతికి నష్టం తెస్తున్నాడని అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. పెళ్లి ఆగిపోయింది.. ఉన్న ఉద్యోగం ఆగిపోయింది. నర్మద ఏమైందో తెలియదు. నిజాయతీగా ఉన్నందుకు ఇదేనా ప్రతిఫలం అని భావించిన సలీమ్ మనసు కఠినంగా మారుతుంది. అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్లను అంతం చేయడానికి సలీమ్ ఏం చేశాడు? ఉద్యోగం పోయి, ప్రేమలో విఫలమైన సలీమ్ జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనేదే ఈ చిత్ర కథ.


నటీనటుల పెర్ ఫామెన్స్
డా. సలీమ్ పాత్రను విజయ్ ఆంటోని అద్భుతంగా చేసాడు. ఫస్టాప్ లో సాఫ్ట్ గా, అహింస భావాలతో అద్భుతంగా నటించిన విజయ్ సెకండాఫ్ లో తనలోని రఫ్ సైడ్ ని పర్ ఫెక్ట్ గా చూపించగలిగాడు. సినిమాని తన భూజాలపైన వేసుకుని నడిపించాడు. డాక్టర్ గా విజయ్ ఆంటోని బాడీ లాంగ్వేజ్ బాగుంది. అక్ష తన పాత్ర పరిధిమేరకు బాగా నటించింది. మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక వర్గం
గణేష్ చంద్ర సినిమాటోగ్రఫీ ఓ విజువల్ ఫీస్ట్. హీరోగా నటించిన విజయ్ ఆంటోని సంగీతం కూడా సమకూర్చారు. ఇది సీరియస్ సబ్జెక్ట్. ఇలాంటి సినిమాలకు పాటలు స్పీడ్ బ్రేకర్స్ లా అనిపిస్తాయి. ఆ విషయంలో కేర్ తీసుకుని సంగీత దర్శకుడు అయినప్పటికీ, సంగీతం డామినేట్ చేయాలనే పట్టుదలకు పోకుండా సిట్యువేషన్ కి సరిపడా సాంగ్స్ ని సమకూర్చారు విజయ్. రీ-రికార్డింగ్ బాగుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్భయ ఘటన రోజుకొకటి వెలుగు చూస్తోంది. ఇలాంటి సమయంలో అలాంటి పాయింట్ ని తీసుకుని కథ సమకూర్చుకోవడంతో పాటు, దానికి చక్కటి స్ర్కీన్ ప్లే ని ఇచ్చిన డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ కుమార్ ని మెచ్చుకోవాల్సిందే. ఈ చిత్రంలో నటించడం, సంగీతం సమకూర్చడంతో పాటు విజయ్ ఆంటోనీయే నిర్మాతగా వ్యవహరించారు. కథకు ఎంత మేరకు ఖర్చు పెట్టాలో అంత మేరకు పెట్టారు.

ఫిల్మీబజ్ విశ్లేషణ
సొసైటీలో నిర్భయలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. చట్టంలో లొసుగులు ఉండటం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. సమాజంలో ప్రతి పౌరుడూ ఓ సలీమ్ అయితే... ఘోరాలు తగ్గే అవకాశం ఎక్కువ. ఈ సినిమాలో చెప్పింది అదే. చక్కని సందేశం ఇచ్చే చిత్రం. అలాగని ఉపన్యాసాలు ఇవ్వలేదు. చిన్న చిన్న సంభాషణలతో సినిమా చక్కగా సాగుతుంది.. ఎక్కడా బోర్ అనిపించకుండా, ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా సాగుతుంది. భారీ డైలాగులు, బాంబు పేలుళ్లు, శృంగార సన్నివేశాలు.. నేటి సినిమా అంటే ఇదే.. పరమ రొటీన్ అని ప్రేక్షకులు ఫిక్స్ అవుతున్న తరుణంలో 'సలీమ్'లాంటి సినిమాలు ఓ రిలీఫ్. పైగా.. ఇది అనువాద చిత్రమైనా తమిళ వాసన ఎక్కడా కనిపించదు. ఏ భాషలో అయినా ఈ కథ బాగుంటుంది.. నిజాయతీగా చేసిన ఓ మంచి ప్రయత్నం 'సలీమ్'. అభినందిస్తే తప్పు లేదు. ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని వస్తాయి. ఎస్.కె. పిక్చర్స్ ద్వారా సురేష్ కొండేటి అందజేసిన మరో మంచి చిత్రం ఇది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !