View

అహింస అన్ని ఎమోషన్స్ ఉన్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ - వెంకటేష్

Tuesday,May30th,2023, 04:19 PM

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. హీరో విక్టరీ వెంకటేష్ ఈ ప్రెస్ మీట్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.


ప్రెస్ మీట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ... యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తో దర్శకుడు తేజ చాలా గొప్ప విజయాలు అందుకున్నారు. అహింస కూడా అన్ని ఎమోషన్స్ వున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. కొత్త నటీనటులు నుంచి పవర్ ఫుల్ ఎమోషన్స్ క్యాప్చర్ చేశారు తేజ. ఎవరూ చూడని అద్భుతమైన లోకేషన్స్ లో తీసిన సినిమా ఇది. ఆర్పీ పట్నాయక్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాతగా కిరణ్ చిత్రానికి కావాల్సింది సమకూర్చారు. అభిరాం, గీతిక సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ప్రతి సినిమాకి కష్టపడుతూ, నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'' తెలిపారు.


దర్శకుడు  తేజ మాట్లాడుతూ.. వెంకటేష్ గారు రావడం వలన సినిమాకి వాల్యూ పెరిగింది. నన్ను భరించి సినిమాని పూర్తి చేసినందుకు హీరో, హీరోయిన్, నిర్మాత.. అందరికీ థాంక్ యు. కొన్ని వందల మందికి అవకాశాలు ఇచ్చిన రామానాయడు గారి కోరిక మీద ఈ సినిమా తీశాను. అభి తో సినిమా చేయడానికి ఆయనే ప్రధాన కారణం. ఈ సినిమా తీయడానికి, బాగా రావడానికి కారణం ఆయనే. రామానాయడు గారి ఆశీర్వాదంతో ఈ సినిమా బాగా ఆడుతుందని నమ్ముతున్నాను'' అన్నారు.


అభిరామ్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చి మముల్ని బ్లెస్ చేసిన బాబాయ్ కి థాంక్స్. ఇంత మంచి సినిమా ఇచ్చిన తేజ గారికి థాంక్స్. తేజ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆర్పీ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కిరణ్ మామకి కృతజ్ఞతలు. ఈ సినిమా నాకు మంచి హిట్ అవుతుందని నమ్ముతున్నాను. జూన్ 2 సినిమా విడుదలవుతుంది. అందరూ థియేటర్స్ లో చూడాలి' అని కోరారు.


నిర్మాత పి కిరణ్ మాట్లాడుతూ.. తేజ గారి తో 20 ఏళ్ల క్రితమే సినిమా తీశాం. ఆయనతో ఎలా పని చేయాలో తెలుసు కాబట్టి ఆ విధంగా పని చేసుకుంటూ వెళ్లాం. సినిమా మేకింగ్ లో కష్టాలు, ఆనందం ..అన్నీ వుంటాయి. సినిమా హిట్ ఐతే ఇంకా ఆనందం వుంటుంది. అహింస లో యాక్షన్ ఎంటర్ టైన్మెంట్ లవ్ ..అన్నీ వున్నాయి. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది'' అన్నారు.


గీతికా మాట్లాడుతూ.. అహింస టీం అందరికీ బిగ్ థాంక్స్. ఈ సినిమా అవకాశం ఇచ్చిన తేజ గారికి కిరణ్ గారికి కృతజ్ఞతలు. జూన్ 2 న తప్పకుండా సినిమా చూడండి'' ని కోరారు.


ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. చాలా విరామం తర్వాత మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ చేశాను. అహింస టీంతో రావడం ఆనందంగా వుంది. అహింస ఖచ్చితంగా మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. అభి చాలా కష్టపడ్డాడు. తన కష్టం చూస్తే జాలి కలిగింది. తను పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుందని నమ్ముతున్నాను. కొత్త కథ, ఒరిజినల్ లోకేషన్స్, కొత్త నటీనటులతో వస్తున్న ఈ సినిమా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను'' అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !