View

''షికార్ కొచ్చిన షేర్ ని బే..." అంటున్న భోళా శంకర్

Saturday,June24th,2023, 02:38 PM

మెగాస్టార్ చిరంజీవి తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్‌ లో కనిపించడం ఎప్పుడూ కన్నుల పండువగా ఉంటుంది. దర్శకుడు మెహర్ రమేష్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ లో మెగాస్టార్ చిరంజీవిని పవర్-ప్యాక్డ్ రోల్‌ లో ప్రజంట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ ను ఈరోజు లాంచ్ చేశారు.


33 మందిని దారుణంగా చంపిన వ్యక్తి కోసం కోల్‌కతా పోలీసులు వెతుకుతున్నారని చెప్పే వాయిస్‌ ఓవర్‌ తో టీజర్ ప్రారంభమవుతుంది. చిరంజీవి ఇంట్రడక్షన్ సీక్వెన్స్‌ లో తన స్వాగ్, స్టయిల్ తో అదరగొట్టారు. డెన్‌లో గూండాలను చితకొట్టి "షికార్ కొచ్చిన షేర్ ని బే..." అని చెప్పిన డైలాగ్ పవర్ ఫుల్ గా పేలింది.
“ఈ స్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్లే... అన్ని ఏరియాలు అప్నా హై... నాకు హద్దుల్లేవ్... సరిహద్దుల్లేవ్... 11 ఆగస్ట్ దేఖ్‌లేంగే...” అంటూ మెగాస్టార్ చెప్పిన చివరి డైలాగ్ ప్రేక్షకులని అలరించింది.


మెహర్ రమేష్ , చిరంజీవిని వింటేజ్ మాస్ అవతార్‌లో చూపించారు. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. టీజర్‌లో కీర్తి సురేష్, తమన్నా భాటియా, సుశాంత్ పాత్రలను కూడా పరిచయం చేశారు.


డడ్లీ తన అద్భుతమైన కెమెరా పనితనంతో ఆకట్టుకున్నారు. మహతి స్వర సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్స్ టార్డినరిగా వుంది . థీమ్ సాంగ్ పాత్రకు పర్ఫెక్ట్ ఎలివేషన్ ఇస్తుంది. ఓవరాల్ గా టీజర్ ఎక్సయిట్మెంట్ ని మరింతగా పెంచింది.


టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ.. మెగాస్టార్ గారిలో మనకు నచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో వుంటాయి. అభిమానులని, ప్రేక్షకులని అందరినీ ఈ సినిమా అలరిస్తుంది. అన్నయ్య సంక్రాంతి కి వాల్తేరు వీరయ్యగా వచ్చారు. ఆగస్ట్ 11న మనం మళ్ళీ మెగా ఫెస్టివల్ చేసుకుంటాం. ఈ సినిమా విడుదలే మనకి పండగ. నిర్మాత అనిల్ సుంకర గారితో పాటు అందరం మెగాస్టార్ గారికి ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వాలని ప్రేమతో కష్టపడ్డాం. బాలీవుడ్ లో అనే సూపర్ హిట్ చిత్రాలు పని చేసిన కెమరామెన్ డడ్లీ గారు ఈ చిత్రానికి అద్భుతమైన వర్క్ ఇచ్చారు. మహతి సాగర్ మెగా సౌండ్ క్రియేట్ చేశారు. ప్రేక్షకులని అభిమానులని అలరించాలని చిరంజీవి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన వేగాన్ని అందుకోవడం మనకి కష్టం. ఆగస్ట్ 11న థియేటర్ లో కలుద్దాం. ఇక నుంచి మెగా సెలబ్రేషన్స్ , భోళా మానియా బిగిన్. అభిమానుల్లో నుంచి వచ్చి దర్శకుడైన నేను మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తానని నమ్మకంతో చెబుతున్నాను’’ అన్నారు


నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. టీజర్ అదిరిపోయింది. సినిమా దీనికి మించి వుంటుంది. ఆగస్ట్ 11న సినిమా వస్తోంది. చిరంజీవి గారి కెరీర్ లో ఈ సినిమా నెంబర్ 1 అవుతుందని బలంగా నమ్ముతున్నాను’’ అన్నారు


మార్తాండ్ కె వెంకటేష్ మాట్లాడుతూ.. చిరంజీవి గారి నుంచి కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. అది వందశాతం చెబుతున్నాం'' అన్నారు


డీవోపీ డడ్లీ మాట్లాడుతూ.. చిరంజీవి గారి సినిమాకి చేయడం ఒక గౌరవం. ఇది నా మొదటి తెలుగు సినిమా. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 11న థియేటర్ లో కలుద్దాం'' అన్నారు


రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.


భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.


తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష, ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షావర్ అలీ & తరుణ్ అరోరా


సాంకేతిక విభాగం :
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ
పీఆర్వో: వంశీ-శేఖర్
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సిఎం
లైన్ ప్రొడక్షన్: మెహెర్ మూవీస్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !