View

12న థియేటర్స్ కి వస్తున్న 'ఉస్తాద్' - గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్

Friday,August11th,2023, 02:51 PM

టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి  క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘ఉస్తాద్’.  కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరోయిన్‌. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యార్స్‌పై ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆగ‌స్ట్ 12న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా గురువారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో కార్తీక్‌, సాయికిర‌ణ్‌, ర‌వి శివ‌తేజ‌, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ ప్రియాంక వీర‌బోయిన‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ అర‌వింద్ నూలే, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అకీవా తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, నేచుర‌ల్ స్టార్ నాని విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా...


సాయికిర‌ణ్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ఫణిదీప్ అండ్ టీమ్‌కి థాంక్స్‌. మా టీమ్‌ని స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చిన రాజ‌మౌళి, నానిల‌కు ధ‌న్య‌వాదాలు’’ అన్నారు. 
ర‌వి శివ‌తేజ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ఫణిదీప్ గారికి అద్భుతమైన క్లారిటీ ఉంది. ఈ సినిమాలో నేను సింహ స్నేహితుడిగా నటించాను. సింహ మూడు షేడ్స్‌లో అద్భుతంగా న‌టించారు. ఆగ‌స్ట్ 12న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది’’ అన్నారు. 


మ్యూజిక్ డైరెక్ట‌ర్ అకీవా. బి మాట్లాడుతూ ‘‘మ్యూజిక్ డైరెక్టర్‌గా అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ ఫ‌ణిదీప్‌, నిర్మాత‌ల‌కు థాంక్స్‌’’ అన్నారు. 


న‌టుడు ర‌వీంద్ర విజ‌య్ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ఫణిదీప్ ఈ సినిమా కోసం ఎంత పోరాడాడో నాకు తెలుసు. షూటింగ్ టైమ్‌లో త‌న‌ని చూస్తే ద‌ర్శ‌కుడిగా త‌న‌కేం కావాలో క్లియ‌ర్ అర్థ‌మైయ్యేది. డెబ్యూ డైరెక్ట‌ర్ అయినా కూడా త‌నేంతో క్లారిటీతో ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. నిర్మాత‌లు రాకేష్‌, హిమాన్షుగారికి థాంక్స్‌. యంగ్ టీమ్ సినిమాను రూపొందించింది’’ అన్నారు. 


చిత్ర నిర్మాత‌ హిమాంక్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మా  సినిమాను స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చిన రాజ‌మౌళి, నానిగారికి థాంక్స్. తెలియ‌ని టెన్ష‌న్ ఉంది. మా ఫ్యామిలీలో ఎవ‌రికీ సినిమా ఇండ‌స్ట్రీతో అనుబంధం లేక‌పోయినా నేను ఎలాగో ఈ ఫీల్డ్‌లోకి అడుగు పెట్టేశాను. నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం. అందుక‌నే ఈ సినిమాను చేయ‌టానికి ఆస‌క్తి చూపించాన‌ని అనిపిస్తోంది. ప్ర‌తీ ఒక్క‌రికీ జీవితంలో ఇష్ట‌మైన వ‌స్తువు ఒక‌టి ఉంటుంది. ఈ సినిమాలో హీరోలా నాకు కూడా బైక్ అంటే ఇష్టం. సింహ‌, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌ల‌త ప‌ని చేయ‌టాన్ని ఎంజాయ్ చేశాం. సాయి కొర్ర‌పాటిగారి నుంచి నేను చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాను. ఆగ‌స్ట్ 12న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది’’ అన్నారు. 


చిత్ర నిర్మాత  రాకేష్ రెడ్డి గ‌డ్డం మాట్లాడుతూ ‘‘ఫణిదీప్ ఈ స్క్రిప్ట్‌తో సింహాను క‌లుసుకుని త‌ర్వాత న‌న్ను క‌లిశాడు. మా దాకా వ‌చ్చినందుకు త‌న‌కు, సింహాకు థాంక్స్‌. మూడేళ్లు మాతోనే వాళ్లు జ‌ర్నీ చేశారు. సాయి కొర్ర‌పాటిగారు నీడ‌లా నా వెనుకే ఉండి స‌పోర్ట్ చేశారు. అలాగే నా స్నేహితుడు హిమాంక్‌కి కూడా థాంక్స్‌. సినిమా చాలా బాగా వ‌చ్చింది. కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. రెండు రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఈ జ‌ర్నీ నా లైఫ్‌లో ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. ఈ టీమ్‌ను ఎప్ప‌టికీ మ‌రచిపోలేను. అంద‌రూ ఎంతో బాగా స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 


కాల భైర‌వ మాట్లాడుతూ ‘‘‘ఉస్తాద్’ మూవీ చాలా బాగా వచ్చింది. ఎంటైర్ టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఆగ‌స్ట్ 12న మూవీ రిలీజ్ అవుతుంది. అంద‌రూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. 


హీరోయిన్ కావ్యా క‌ళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘మా ‘ఉస్తాద్’ టీమ్‌ను ఆశీర్వ‌దించ‌టానికి వ‌చ్చిన రాజ‌మౌళి, నాని, శైలేష్ కొల‌నుగారికి థాంక్స్‌. మాకెంతో స్పెష‌ల్ మూవీ ఇది. ఆగ‌స్ట్ 12న మూవీ రిలీజైన త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రి గురించి ప్రేక్ష‌కులు మాట్లాడుతారు. చాలా న‌మ్మ‌కంగా ఉన్నాం’’ అన్నారు. 


డైరెక్ట‌ర్ ఫ‌ణిదీప్ మాట్లాడుతూ ‘‘నిన్నా మొన్న‌టి వ‌ర‌కు చాలా బిజీగా ఉన్నాం. ఇప్పుడు ఎంటైర్ టీమ్ సినిమా రిలీజ్ రిజ‌ల్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఉస్తాద్ అనేది పెట్టే పేరు కాదు.. సంపాదించే పేరు. మ‌న చుట్టూ కూడా చాలా మంది ఉస్తాద్‌లుంటారు.  అనేది క‌ల‌ల‌ను నిజం చేసుకునే ఓ యువ‌కుడి క‌థే ఇది. సింహాను కోవిడ్ స‌మ‌యంలో క‌లిశాను. నెరేష‌న్ విన‌గానే త‌ను చెప్పిన మాట‌ల‌ను నేను మ‌ర‌చిపోలేదు. అప్ప‌టి నుంచి సినిమా కోసం త‌ను నిల‌బ‌డ్డాడు. ఈ సినిమాకు సంబంధించిన త‌నే ఉస్తాద్. కావ్యా క‌ళ్యాణ్ రామ్ కూడా సూప‌ర్బ్‌గా న‌టించింది. ర‌వీంద్ర విజ‌య్‌గారు, గౌత‌మ్ వాసుదేవ్ గారు ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించారు. మా నిర్మాత‌లు రాకేష్‌, హిమాంక్‌లు కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను రూపొందించారు. సాయి కొర్రపాటిగారి స్పీడు అందుకోవ‌టానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. అంద‌రూ సినిమాను ఓన్ చేసుకుని క‌ష్ట‌ప‌డ్డారు. ఆగ‌స్ట్ 12న ఉస్తాద్ మీ ముందుకు వ‌స్తుంది ’’ అన్నారు. 


హీరో శ్రీసింహా కోడూరి మాట్లాడుతూ ‘‘ఉస్తాద్ సినిమా చాలా చాలా బాగా వ‌చ్చింది. జ‌డ్చ‌ర్లలోనే షూట్ చేశాం. ఒక్కోసారి డ‌బుల్ కాల్ షీట్స్ వ‌ర్క్ చేసిన సంద‌ర్భాలున్నాయి. ఎంటైర్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డింది. నాని, శైలేష్‌గారికి థాంక్స్‌’’ అన్నారు. 


శైలేష్ కొల‌ను మాట్లాడుతూ ‘‘ఉస్తాద్ మూవీ ట్రైల‌ర్‌ను చూడ‌గానే న‌చ్చేసింది. త‌ను తీసుకున్న పాయింటే అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌. సినిమాను అంద‌రూ థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. 


ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి మాట్లాడుతూ ‘‘అబ్బాయిలు వాళ్ల ఫ‌స్ట్ ల‌వ్‌నైనా మ‌ర‌చిపోతారు కానీ.. ఫ‌స్ట్ బైక్‌ను మ‌ర‌చిపోరు. బైక్‌ను చూడ‌గానే రెక్క‌లు వ‌చ్చిన ఫీలింగ్ వ‌స్తుంది. అందుకే యూత్‌కు బైక్ న‌చ్చుతుంది. ఫ‌ణిదీప్ రాసుకున్న తీరు చ‌క్క‌గా ఉంది. అకీవా మ్యూజిక్ బావుంది. సాంగ్స్ నేను రోజూ వింటున్నాను. రూ. 30-35 కోట్లు సినిమాలాగా అనిపిస్తుంది. న‌టీన‌టుల‌తో పాటు టెక్నీషియ‌న్స్ చాలా బాగా చేశారు. కావ్యా క‌ళ్యాణ్ రామ్ మ‌న ప‌క్కింటి అమ్మాయిలాగా ఉంది. సింహా క‌ష్ట‌మైన రూట్‌ను ఎంచుకున్నాడు. త‌ను ఈజీ రూట్‌ను ఎంచుకోవాల‌నుకోలేదు. త‌న‌ని నేను ద‌గ్గ‌ర నుంచి చూస్తున్నాను. సింహా మూడు షేడ్స్‌లో అద్భుతంగా న‌టించాడ‌ని అంద‌రూ అంటున్నారు. పెద్ద చెట్లు నెమ్మ‌దిగా ఎదుగుతాయి. అలాగే సింహా కూడా త‌న ల‌క్ష్యాన్ని సాధిస్తాడ‌ని అనుకుంటున్నాను. ఉస్తాద్ టీమ్‌కి అభినంద‌న‌లు’’ అన్నారు. 
నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ ‘‘రాజ‌మౌళి అండ్ టీమ్ కొత్త పాత అని సంబంధం లేకుండా అంద‌రినీ ఎంక‌రేజ్ చేస్తుంటారు. నా సినిమాల విష‌యంలో వారెలా స్పందిస్తారోన‌ని ఆలోచిస్తుంటాను. వాళ్లు చెప్పే దాన్ని బ‌ట్టి డిసైడ్ అవుతుంటాను. సింహా విష‌యానికి వ‌స్తే త‌ను గ్రౌండ్ లెవ‌ల్లోనే ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే వాళ్ల ఫ్యామిలీనే అలా ఉంటుంది. రాజ‌మౌళి ఫ్యామిలీలో అంద‌రూ టెక్నీషియ‌న్సే యాక్ట‌ర్స్ లేర‌ని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు సింహా రూపంలో యాక్ట‌ర్ కూడా వ‌చ్చేస్తున్నాడు. త‌ను కూడా టాప్ పోజిష‌న్‌లో నిలుస్తాడు. కావ్యా క‌ళ్యాణ్ రామ్ మంచి కంటెంట్‌ను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వ‌స్తుంది. మ‌న అని అనుకునే హీరోయిన్స్‌లో త‌ను కూడా నిలుస్తుంది. ఉస్తాద్ అనే పేరులోనే ప‌వ‌ర్ ఉంది. ట్రైల‌ర్‌లో ఎన‌ర్జీ ఉంది. ఉస్తాద్ పాజిటివ్ వైబ్స్‌తో ఆగ‌స్ట్ 12న రిలీజ్ అవుతుంది. శ్రీసింహా కెరీర్‌లో ఉస్తాద్ మెమొర‌బుల్ మూవీ అవుతుందని న‌మ్ముతున్నాను’’ అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !