విభిన్నసినిమాలకు, వైవిధ్యమైన కథలకు ఇప్పుడు తెలుగు సినిమా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇప్పుడు ఆ జాబితాలోనే రాబోతున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘పతంగ్’. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్ జంటగా నటిస్తున్నారు. పతంగుల పోటీ నేపథ్యంలో రాబోతున్నస్పోర్ట్స్ డ్రామా ఇది. తొలిసారి పతంగుల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. క్సాపీ స్టూడియోస్ అండ్ రిషాన్ సినిమాస్ పతాకంపై నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి నాని బండ్రెడ్డి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. విజయ్ శేఖర్ అన్నే, సురేష్ కొత్తింటి, హరికా సంపత్ నిర్మాతలు. ప్రణీత్ పత్తిపాటి దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - విభిన్నమైన నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ కామెడీ డ్రామా ఇది. సికింద్రబాద్ బస్తీ బ్యాక్ డ్రాప్‌లో వుండే నేటివిటి చూపిస్తున్నాం. ఈ నేపథ్యంలో కామెడీ కూడా అందరిని అలరించే విధంగా వుంటుంది. ఇన్‌స్టా ఫేం ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పుజీత్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో చాలా మంది నూతన నటీనటులను పరిచయం చేస్తున్నాం. సరోజ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్‌పీ చరణ్ ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. ఆయన పాత్ర సినిమాకు హైలైట్‌గా వుంటుంది. త్వరలోనే చివరి షెడ్యూల్‌ను ప్రారంభిస్తాం అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: జోసి జిమ్మి, ఎడిటర్: చాణక్య, సినిమాటోగ్రాఫర్: శక్తి అరవింద్, ప్రొడక్షన్ కంట్రోలర్: వెంకట శాతవాహన , క్రియేటివ్ ప్రొడ్యూసర్: నాని బండ్రెడ్డి, స్టైలిష్: మెఘన శేషవపురి