View

గ్రాండ్ గా బబుల్‌గమ్‌ టీజర్ లాంచ్ 

Tuesday,October10th,2023, 03:17 PM

ప్రముఖ నటుడు రాజీవ్‌ కనకాల, పాపులర్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్‌ కనకాల జెన్జీ లవ్ స్టోరీ ‘బబుల్‌గమ్‌’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలలో ఎక్స్ ట్రార్డినరీ వర్క్ తో ఆకట్టుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మానస చౌదరి కథానాయిక. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఘనంగా జరిగిన వేడుకలో ‘బబుల్‌గమ్‌’ టీజర్ ని లాంచ్ చేశారు హీరో నాని.


ప్రేమను బబుల్‌గమ్‌తో పోలుస్తూ వాయిస్‌ తో ఓవర్‌తో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఎక్సయిటింగ్ గా సాగింది. హైదరాబాద్‌లోని క్లబ్‌లో డిజే గా వున్న ఆదిత్య (రోషన్) జీవితంలో కి జెన్జీ  గర్ల్ జాహ్నవి (మానస) వచ్చిన తర్వాత వీరి ప్రయాణం.. ప్రామెసింగ్ న్యూ ఏజ్ లవ్ స్టొరీని ప్రెజంట్ చేసింది. ఆదిత్య పాత్రని చాలా యీజ్ తో పోషించాడు రోషన్. తన స్క్రీన్ ప్రజెన్స్ చాలా ఎట్రాక్టివ్ గా వుంది. యాక్షన్, డైలాగ్.. ఇలా అన్నిట్లోనూ చాలా అనుభవం వున్న నటుడిలానే ఆకట్టుకున్నాడు రోషన్. మానస స్క్రీన్ ప్రజెన్స్ బ్యూటీఫుల్ గా వుంది. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దర్శకుడు రవికాంత్ పేరెపు స్టొరీ టెల్లింగ్ యూనిక్ గా వుంది. ఒక మంచి న్యూ ఏజ్ లవ్ స్టొరీ అందించబోతున్నారని టీజర్ భరోసా ఇచ్చింది. సురేష్ రగుతు అందించిన విజువల్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి. శ్రీచరణ్ పాకల ఎక్స్ లెంట్ స్కోర్ ని అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ గా వున్నాయి. మొత్తానికి టీజర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది.  
టీజర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. రోషన్ మాట్లాడుతున్నంత సేపు సుమ గారి కళ్ళల్లో ఆనందం చూశాను. రోషన్ తొలి సినిమాకే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. టీజర్ చూసినప్పుడు మా తమ్ముడు చాలా అద్భుతంగా చేశాడనే ఫీలింగ్ వచ్చింది. తొలి సినిమాకే చాలా యీజ్ తో చేశాడు. తనని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు  చాలా పర్ఫెక్ట్ గా కనిపించాడు. టీజర్ చూసినప్పుడు చాలా బలమైన కంటెంట్ వుందనిపిస్తుంది. రోషన్ కి ఆల్ ది  వెరీ బెస్ట్. ఈ చిత్రం తనకి బ్లాక్ బస్టర్ స్టార్ట్ అవుతుంది. మరో సక్సెస్ ఫుల్ హీరో తెలుగు ఇండస్ట్రీ వచ్చాడని కాన్ఫిడెంట్ గా చెప్పగలను. టీజర్ చూసినప్పుడు ఆ నమ్మకం వచ్చింది. మానస స్క్రీన్ ప్రెజన్స్ బావుంది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరింది. రవికాంత్ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. తనకంటూ ఒక యునిక్ స్టయిల్ వుంది. ఆ యూనిక్ నెస్ ఈ టీజర్ లో కనిపిస్తుంది.  తెలుగు సినిమాల్లో క్యాలిటీ ఫిలిమ్స్ కి మారుపేరుగా మారింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు. ఇది వారికి మరో విజయవంతమైన చిత్రం అవుతోంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.  డిసెంబర్ 29న విడుదల చేస్తున్నారు. గ్రేట్ డేట్ ఇది. న్యూ ఇయర్, న్యూ వేవ్ రాబోతుంది ఇండస్ట్రీలోకి. ఆ రోజు బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుందాం'' అన్నారు.


రోషన్‌ కనకాల మాట్లాడుతూ..నాని అన్న నాలాంటి ఎందరితో స్ఫూర్తి. ఆయన వచ్చి టీజర్ లాంచ్ చేయడం ఆనందంగా వుంది. ప్రైడ్ అఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి గారు మా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడం మా కల నెరవేరినట్లయింది. వారికి ఎప్పుడూ కృతజ్ఞతతో వుంటాను. హ్యాపీ బర్త్ డే రాజమౌళి గారు. టీజీ విశ్వ ప్రసాద్ గారు, వివేక్ గారు మాపై నమ్మకంతో ఎంతగానో సపోర్ట్ చేశారు. దర్శకుడు రవికాంత్ పేరెపు గారితో పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తాను. నాపై నమ్మకంతో ఇంత మంచి సినిమా ఇచ్చిన ఆయనకి ధన్యవాదాలు. సురేష్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. శ్రీచరణ్ నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఇచ్చారు. మానస వండర్ ఫుల్ కో స్టార్. తన పాత్ర మీ అందరినీ నచ్చుతుందనే నమ్మకం వుంది. నాకు ఇష్టమైనది చేయడానికి ప్రోత్సహించిన అమ్మనాన్నలకి థాంక్స్. తాతనాన్నమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ వుంటుంది. ప్రేక్షక దేవుళ్ళకి ధన్యవాదాలు. మీరు చూస్తూనే ఏ సినిమా అయినా నడిచేది. తప్పకుండా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందనని, ఆదరిస్తారనే నమ్మకం వుంది’’ అన్నారు.


మానస మాట్లాడుతూ.. మా ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన రాజమౌళి గారికి, టీజర్ లాంచ్ చేసిన నానిగారి ధన్యవాదాలు. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. రవిగారి దర్శకత్వంలో లాంచ్ కావడం అనందంగా వుంది.  రోషన్ తో కలసి నటించడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. టీం అందరికీ పేరుపేరునా థాంక్స్’ తెలిపారు.


దర్శకుడు రవికాంత్ పేరెపు మాట్లాడుతూ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్  తో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాకి చాలా యంగ్ ట్యాలెంట్ పని చేశారు. రోషన్, మానస చాలా గ్రేస్ తో ఈ పాత్రలని పోషించారు. పాత్రలని వారు అర్ధం చేసుకున్న తీరు నన్ను చాలా సర్ప్రైజ్ చేసింది. నాని గారు టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’’ అన్నారు.


టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. రోషన్.. ఫ్యామిలీ అఫ్ ట్యాలెంట్. టీజర్ లో అది కనిపిస్తోంది. టీజర్ లాంచ్ చేసిన నాని గారికి ధన్యవాదాలు. నాని గారి నిన్ను కోరితో మా జర్నీ మొదలైయింది. మా ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గూడచారి టీజర్ నాని గారే లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ తెలిపారు.  


వివేక్ మాట్లాడుతూ.,. రోషన్ తాతగారు చాలా మంది నటీనటులకు శిక్షణ ఇచ్చారు. రాజీవ్ గారు తెలుగులో అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇక సుమ గారి యాంకరింగ్ గురించి పరిచయం అవసరం లేదు. ఇవన్నీ కలిసి రోషన్ కూడా ఒకసారి కెమరా ఆన్ అయ్యిందంటే చాలా కాన్ఫిడెంట్ గా యీజ్ తో పెర్ ఫార్మ్ చేస్తాడు. ఆల్ ది బెస్ట్ రోషన్ , మానస.  నాని గారు ఎప్పుడూ కొత్త ప్రతిభని ప్రోత్సహిస్తారు. అందరికీ థాంక్స్’’ తెలిపారు.


రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. మా అబ్బాయి సినిమా టీజర్ ని ఇంత గ్రాండ్ గా చేసిన నాని, టీజీ విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, ఈ వేడుకలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. రోషన్ చాలా బాగా చేశాడని టీజర్ చూస్తుంటే అర్ధమౌతోంది. ఈ వేడుకలో పాల్గొన్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ తెలిపారు.


తారాగణం: రోషన్ కనకాల, మానస చౌదరి


సాంకేతిక విభాగం:
దర్శకత్వం: రవికాంత్ పెరేపు
రచన: రవికాంత్ పెరేపు, విష్ణు కొండూరు, సెరి-గన్ని
బ్యానర్లు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
డీవోపీ: సురేష్ రగుతు
ఎడిటింగ్: నిషాద్ యూసుఫ్
ప్రొడక్షన్ డిజైన్: శివమ్ రావు
స్క్రీన్ ప్లే కన్సల్టెంట్: వంశీ కృష్ణ
క్రియేటివ్ ప్రొడ్యూసర్: దివ్య విజయ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మధులిక సంచన లంక
పబ్లిసిటీ డిజైన్: అనంత్ కంచెర్ల
పీఆర్వో: వంశీ-శేఖర్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !