View

‘ప్లాట్’ ట్రైలర్ ని విడుదల చేసిన వేణు ఊడుగుల 

Thursday,October26th,2023, 03:22 PM

వికాస్ ముప్పాల‌, గాయ‌త్రి గుప్తా, సాజ్వి ప‌స‌ల‌, సంతోష్ నందివాడ‌, కిషోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో బి.బి.టి.ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై భాను భ‌వ తార‌క ద‌ర్శ‌క‌త్వంలో  కార్తీక్ సేపురు, భాను భ‌వ తార‌క‌, త‌రుణ్ విఘ్నేశ్వ‌ర్ సేరుపు నిర్మిస్తోన్న చిత్రం ‘ప్లాట్’. గురువారం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో...


డైరెక్టర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ.. ‘ప్లాట్ టీం ఏడాది క్రితం నా వద్దకు వచ్చింది. పోస్టర్‌ను రిలీజ్ చేశాను. ఆ పోస్టర్ నాకు చాలా నచ్చింది. ఎంతో కొత్తగా, వైవిధ్యంగా ప్రయత్నించారు. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. కారెక్టర్స్, క్యాస్టూమ్స్, మాటలు, శబ్దాలు ఎంతో సహజంగా అనిపించాయి. ట్రైలర్ చూస్తే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది. భాను గురించి భవిష్యత్తులో అందరూ మాట్లాడతారు. ఫిల్మ్ మేకింగ్ మూమెంట్స్ వల్ల సినిమా పరిణామా క్రమం మారుతూ వచ్చింది. ఈ మూవీ ఇంకా అడ్వాన్స్‌గా ఉంటుందని అర్థం అవుతోంది. ఇలాంటి సినిమాలు థియేటర్లో ఆడితే ఇంకా కొత్తకథలు వస్తాయి. దర్శకనిర్మాతలు ప్రయోగాలు చేసేందుకు ముందుకు వస్తారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు, మీడియా ముందుండి సపోర్ట్ చేయాలి’ అని అన్నారు.


డైరెక్టర్ హర్ష మాట్లాడుతూ.. ‘ట్రైలర్ ఎంతో బాగుంది. బాగా కట్ చేశారు. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందో.. సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ మూవీ ఆల్రెడీ నేను చూశాను. కొత్త అనుభూతిని ఇస్తుంది. భాను ఈ మూవీ తరువాత మరోస్థాయికి వెళ్తాడు’ అని అన్నారు.


డైరెక్టర్ ఉదయ్ మాట్లాడుతూ.. ‘ప్లాట్ మూవీ టీజర్, ట్రైలర్ బాగున్నాయి. ఇండిపెండెంట్ ఫిల్మ్‌ను ఎంతో ప్యాషన్‌తో చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీశారు. ఇలాంటి సినిమాలు కమర్షియల్‌గా వర్కౌట్ అవ్వాలి. అప్పుడే ఇంకా కొత్త కథలు వస్తాయి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.


దర్శక నిర్మాత భాను భవతారక మాట్లాడుతూ.. ‘వేణు గారు తీసిన నీదీ నాదీ ఒకే కథ నాలో ధైర్యాన్ని నింపింది. కరోనా టైంలో ఓ కథను రాసుకున్నాను. నా ఫ్రెండ్స్ నన్ను నమ్మడంతో ఈ సినిమా ముందుకు వచ్చింది. నా స్నేహితులతో కలిసి సినిమాను నిర్మించాను. వికాస్ అన్న అయితే ఈ కథకు బాగుంటుందని అనుకున్నాం. ప్రతీ ఒక్క టీం మెంబర్‌ను కలుస్తూ.. ఇటు ఇటుక పేర్చినట్టుగా మా టీంను బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. మా దగ్గర ఉన్న వనరులతో ఈ సినిమాను తీశాం. ట్రైలర్, టీజర్ చూసిన తరువాత ఇదొక డిఫరెంట్ సినిమా అని ఆడియెన్స్‌కు అర్థమైంది. మేం జనాలకు అంతగా తెలియకపోవడంతో ఈ మూవీని ప్రేక్షకుల లిస్ట్‌లో లేదు. కానీ ఈ మూవీని చూస్తే ఆడియెన్స్‌కు కచ్చితంగా నచ్చుతుంది. ప్రతీ క్రాఫ్ట్‌ను కొత్తగా చేశాం. అందరూ థియేటర్లో ఈ సినిమాను చూడండి. కొత్త అనుభూతికి లోనవుతారు’ అని అన్నారు.


నిర్మాత తరుణ్ విఘ్నేశ్వర్ మాట్లాడుతూ.. ‘మా ప్లాట్ సినిమా నవంబర్ 3న రిలీజ్ అవుతోంది. చిత్రాన్ని థియేటర్లో చూడండి. కొత్త అనుభూతికి లోనవుతారు’ అని అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ.. ‘తెలుగులో ఇలాంటి జానర్ రావడం ఇదే మొదటి సారి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది ఈ సినిమాకు చాలా ఇంపార్టెంట్. ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను. అందరూ అద్భుతంగా పని చేశారు’ అని అన్నారు.


వికాస్ ముప్పల మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం. 2012లో నటుడిగా కెరీర్ మొదలుపెట్టాను. శంకర్ తీసిన స్నేహితుడు చిత్రంలో నటించాను. ఈ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఓ కొత్త అనుభూతికి లోనవుతారు. మేం ఎంతో నిజాయితీగా తీసిన ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.


గాయత్రీ గుప్తా మాట్లాడుతూ.. ‘భాను, తరుణ్, కార్తీక్‌ల వల్లే ప్లాట్ మూవీ బయటకు వచ్చింది. ఆ ముగ్గురి స్నేహ బంధం చాలా గొప్పది. ఎంతో ప్యాషన్‌తో సినిమాను తీశారు. ఓ ఫిల్మ్ స్కూల్ నుంచి వస్తే ఎంత డీటైలింగ్‌గా చేస్తారో అంత అద్భుతంగా ఈ సినిమాను తీశారు. వికాస్ మంచి నటుడు. సజీవ్ అద్భుతంగా చేశాడు. సందీప్ బాగా నటించాడు. షూట్ చేసిన ప్రతీ రోజూ ఎంతో సరదాగా, ఎంజాయ్ చేస్తూ చేశామ’ని అన్నారు.


కెమెరామెన్ రమణ్ మాట్లాడుతూ.. ‘దర్శకుడితో నేను షార్ట్ ఫిల్మ్స్‌ టైం నుంచి కలిసి పని చేశాను. ఏది కావాలో, ఫ్రేమ్ ఎలా ఉండాలనేది ఎంతో క్లియర్‌గా చెబుతాడ’ని అన్నారు.


న‌టీన‌టులు:
వికాస్ ముప్పాల‌, గాయ‌త్రి గుప్తా, సాజ్వి ప‌స‌ల‌, సంతోష్ నందివాడ‌, కిషోర్‌,  త‌దిత‌రులు


సాంకేతిక‌ వ‌ర్గం:
బ్యాన‌ర్‌:  బి.బి.టి.ఫిల్మ్స్‌, నిర్మాత‌లు:  కార్తీక్ సేపురు, భాను భ‌వ తార‌క‌, త‌రుణ్ విఘ్నేశ్వ‌ర్ సేరుపు, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం:  భాను భ‌వ తార‌క‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌:  సాయిరాం, రాజేంద్ర ప్ర‌సాద్‌ సినిమాటోగ్ర‌ఫీ: ర‌మ‌ణ్‌, మ్యూజిక్‌:  కార్తీక్ రోడ్రిగ్జ్‌, ఎడిట‌ర్‌:  విన‌య్‌, కాస్ట్యూమ్స్‌:  జెస్సి, లిరిక్స్‌:  భాను భ‌వ తార‌క‌, ఆర్ట్‌:  శివ కుమార్ మ‌చ్చ‌, పి.ఆర్‌.ఒ:  సురేంద్ర నాయుడు - ఫ‌ణి (బియాండ్ మీడియా)Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !