View

కాలింగ్ సహస్త్ర కంటెంట్ ఉన్న చిత్రం

Wednesday,November08th,2023, 03:52 PM

బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు. ‘గాలోడు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్త్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డాలీషా హీరోయిన్‌గా న‌టిస్తోంది. టీవీ షోస్‌లో న‌వ్వించిన సుధీర్ , గాలోడు చిత్రంలో మాస్ హీరోగా ఆక‌ట్టుకున్నారు. అయితే ఈసారి మ‌రో డిఫ‌రెంట్ అటెంప్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. మంగళవారం ఈ సినిమా నుంచి ‘కనుల నీరు రాలదే.’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా...


సినిమాటోగ్రాఫర్  డి. శశి కిరణ్  మాట్లాడుతూ ‘‘త్వరలోనే ‘కాలింగ్ సహస్త్ర’ చిత్రం విడుదలవుతుంది. సుధీరన్న చాలా కొత్తగా అందరినీ మెప్పిస్తారు’’ అన్నారు.


హీరోయిన్ డాలీషా మాట్లాడుతూ ‘‘సుధీర్‌గారికి స్పెషల్ ఇంట్రడక్షన్ ఏమీ అవసరం లేదు. చాలా మంచి వ్యక్తి. తనతో కలిసి వర్క్ చేయటాన్ని ఎంజాయ్ చేశాను. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతలకు థాంక్స్. త్వరలోనే సినిమా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్‌కి కాస్త సమయం పట్టింది. కానీ.. అద్భుతమైన ఔట్ పుట్ వచ్చింది. ఎంటైర్ యూనిట్‌కి థాంక్స్’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్ మాట్లాడుతూ ‘‘సుధీర్‌గారు ఈ సినీ జర్నీలో నాకెంతో మంచి స్నేహితుడు అయ్యారు. కాలింగ్ సహస్త్ర మూవీలో మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. సబ్జెక్ట్‌ని బేస్ చేసుకుని మ్యూజిక్‌ని అందించాం. అన్నీ ఎమోషన్స్ ఉన్న మూవీ ఇది. హీరోయిన్ డాలీషా తెలుగు నేర్చుకుని నటించారు. డైరెక్టర్ అరుణ్ గారికి, సినిమాటోగ్రాఫర్ సన్నిగారికి థాంక్స్. మూవీ చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది. సుద్దాలగారు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. మా నిర్మాతలకు స్పెషల్ థాంక్స్’’ అన్నారు.


నిర్మాత వెంకటేశ్వర్లు కాటూరి మాట్లాడుతూ ‘‘సినిమాను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం. మాకు బిజినెస్‌లో సపోర్ట్‌ నిలుస్తున్నందుకు బెక్కెం వేణుగోపాల్‌గారికి, రామచంద్రగారికి థాంక్స్. సుధీర్‌గారి అభిమానుల కారణంగా మూవీ నుంచి రెండో పాటను కూడా గ్రాండ్‌గా రిలీజ్ చేశాం. తప్పకుండా పాట, సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం.


నిర్మాత విజేష్ తయల్ మాట్లాడుతూ ‘‘కనుల నీరు రాలదే..’ పాటకు మోహిత్ మంచి సంగీతాన్ని అందించారు. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. దర్శకుడు అరుణ్ చాలా కాలంగా తెలుసు. తను సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. బెక్కెం వేణుగోపాల్‌గారు ఇప్పుడు మా టీమ్‌లో ఓ మెంబర్ అయ్యారు. సుధీర్‌గారితో మంచి జర్నీ. తనే ముందుండి ఫోర్స్‌లా అందరినీ నడిపించారు. సినిమాను ఆడియెన్స్ ఆదరించాలని కోరుకుంటున్నాను.


డైరెక్టర్  అరుణ్ విక్కిరాల మాట్లాడుతూ ‘‘కాలింగ్ సహస్త్ర తర్వాత సుధీర్ రేంజ్ నెక్ట్స్ రేంజ్‌కి చేరుకుంటుంది. తనొక సూపర్ స్టార్ అవుతారు. మేం ఎంత బాగా సినిమాను తీసినా మంచి మ్యూజిక్ లేకపోతే అద్భుతం జరగదు. ఈ సినిమా విషయానికి వస్తే మోహిత్ తన సంగీతంతో మ్యాజిక్ చేశారు. అలాగే మార్క్ కె.రాబిన్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను సూపర్బ్‌గా అందించారు.  మా ప్రొడ్యూసర్స్‌కి థాంక్స్. సుధీర్ అభిమానుల కోసం ఈవెంట్‌ని ప్లాన్ చేశాం. అందుకనే వారి సమక్షంలోనే పాటను రిలీజ్ చేస్తున్నాం. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.


రామచంద్రరావు మాట్లాడుతూ ‘‘కాలింగ్ సహస్త్ర చిత్రంలోని మొదటి పాటను ఆడియెన్స్ ఎంత ఎంజాయ్ చేశారో మనకు తెలుసు. అందుకనే ఇప్పుడు రెండో సాంగ్‌ని రిలీజ్ చేస్తున్నాం. సుధీర్‌గారు, అరుణ్‌గారికి థాాంక్స్. సుధీర్‌ని పెద్ద స్టార్‌గా కాలింగ్ సహస్త్ర మూవీ నిలబెడుతుంది’’ అన్నారు.


బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘‘కాలింగ్ సహస్త్ర సినిమాను చూడగానే బాగా నచ్చింది. వెంటనే టీమ్‌తో ట్రావెల్ మొదలు పెట్టాం. టీజర్, ఫస్ట్ సాంగ్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సర్‌ప్రైజింగ్ ట్రైలర్‌ను విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నాం. సినిమాను భారీగా విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. డైరెక్టర్ అరుణ్ సినిమాను తెరకెక్కించిన తీరు సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న మూవీ. తప్పకుండా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని భావిస్తున్నాం. మూవీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుంది. సుధీర్‌ని కెరీర్ స్టార్టింగ్ నుంచి గమనిస్తున్నాను. చాలా మంచి వ్యక్తి.  ప్రేక్షకులు సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


హీరో సుధీర్ మాట్లాడుతూ ‘‘మోహిత్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. అలాగే జిత్తు మాస్టర్ సాంగ్‌ని చక్కగా కొరియోగ్రఫీ చేశారు. నిర్మాత విజేష్‌గారితో జర్నీ మరచిపోలేను. సినిమాను కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఆయనకు ఇతర ప్రొడ్యూసర్స్ సపోర్ట్ ఇచ్చారు. అందరికీ థాంక్స్. బెక్కెంగారు సినిమా చూడగానే ఆయనకు నచ్చటంతో మా టీమ్‌ని నడిపించటం మొదలు పెట్టారు. మంచి కంటెంట్ సినిమాలను సపోర్ట్ చేయాలనుకునే నిర్మాత ఆయన. డాలీషా మంచి నటి. నార్త్ అమ్మాయి అయినా తెలుగు నేర్చుకుని నటించారు. తనింకా పెద్ద స్టార్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇవాళ ఈ స్టేజ్‌కి చేరుకున్నానంటే నా అభిమానుల ప్రేమే కారణం. టీవీ షోస్ చేసినా, సినిమాలు చేసినా వారు సపోర్ట్ చేశారు. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. త్వరలోనే థియేటర్స్‌లో సందడి చేస్తాం. రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటిస్తాం’’ అన్నారు.


న‌టీన‌టులు:
సుధీర్ ఆనంద్ బయానా, డాలీషా, శివబాలాజీ మనోహరన్, రవితేజ నన్నిమాల త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్స్‌: షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్, రచన దర్శకత్వం: అరుణ్ విక్కిరాల, నిర్మాతలు:  వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి, విజేష్ త‌యల్‌, చిరంజీవి ప‌మిడి, సంగీతం : మోహిత్ రెహమానియక్, బ్యాగ్రౌండ్ స్కోర్ : మార్క్ కె రాబిన్, సినిమాటోగ్రఫీ : డి. శశి కిరణ్, ఎడిటర్ : గ్యారీ బి.హెచ్‌,  పి.ఆర్‌.ఒ:  నాయుడు సురేంద్ర‌, ఫ‌ణి (బియాండ్ మీడియా)



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !