View

#90’s నా కెరీర్ లో మెమరబుల్ గా నిలిచిపోతుంది - హీరో శివాజీ

Friday,January19th,2024, 03:32 PM

హీరో శివాజీ, వాసుకి ఆనంద్ సాయి ప్రధాన పాత్రలలో ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ '#90’s'- ‘ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ . ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించే ఈ వెబ్ సిరిస్ ని ఎంఎన్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్ మేడారం నిర్మించారు. నవీన్ మేడారం సమర్పించారు. ఈటీవీ విన్‌’వేదికగా జనవరి 5 నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ వెబ్ సిరిస్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.


సక్సెస్ మీట్ లో హీరో శివాజీ మాట్లాడుతూ.. #90’s' ఒక్క ఎపిసోడ్ విన్నా ఓకే చేసే కథ ఇది. అంత బావుంది. నేను చేసిన 'మిస్సమ్మ' అప్పటికి ఇండియన్ టాప్ 50సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇవాళ ఇండియన్ ఓటీటీలో టాప్5 లో ఉండటానికి అన్ని క్యాలిటీస్ వున్న వెబ్ సిరిస్ #90’s. మంచి యంగ్ టీంతో కలసి ఈ సిరిస్ చేశాం. ఈ ఒక్క సిరిస్ తో ఐదు లక్షల సబ్ స్క్రైబర్స్ రావడం మాములు విషయం కాదు. ఆదిత్య అద్భుతంగా రాశాడు. ఈ సక్సెస్ క్రెడిట్ తనదే. #90’s నా కెరీర్ లో మెమరబుల్ గా నిలిచిపోతుంది. ఇది ఫిలింలా కూడా విడుదల చేస్తారని అనుకుంటున్నాను. మంచి కంటెంట్ ని ప్రోత్సహించడానికి ఈ వేడుకకు విచ్చేసిన ఆర్పీ పట్నాయ్ గారికి ధన్యవాదాలు. అజీం వండర్ ఫుల్ కెమరామెన్. సురేష్ గారు చాలా చక్కని మ్యూజిక్ ఇచ్చారు. సాంప్రదాయని ట్యూన్ సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. టీం అందరూ అద్భుతంగా పని చేశారు. ప్రొడక్షన్ అంత చాలా చక్కగా జరిగింది. ప్రతి క్యారెక్టర్ ని దర్శకుడు చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. మౌళి, రోహన్, వాసంతిక అందరూ చక్కగా చేశారు. అన్ని పాత్రలకు మంచి పేరు వచ్చింది. వాసుకి గారు చాలా అద్భుతంగా నటించారు. ఈటీవీ విన్ కి కృతజ్ఞతలు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'' తెలిపారు.  


ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరిస్ లో జీవితం వుంది. మన జీవితాన్ని అద్దంలో చూపించిన సిరిస్ ఇది. వాసుకి గారు ఎంతో సహజంగా నటించారు. నా చిన్నప్పుడు మా అమ్మలా అనిపించారు. శివాజీ గారిని బిగ్ బాస్  లో చూసి అందరూ ప్రేమించారు. ఆయన గొప్ప వ్యక్తిత్వం వున్న వ్యక్తి. రోహన్ చాలా చక్కని టైమింగ్ తో నటించాడు. దర్శకుడు ఆదిత్య ఓ మాస్టర్ పీస్ ని అందించారు. సురేష్ బొబ్బిలి చాలా చక్కని సంగీతం అందించారు. తను ఇంకా పెద్ద సినిమాలు ప్రాజెక్ట్స్ చేయాలి. టీం అందరికీ అభినందనలు. సంక్రాంతికి థియేటర్స్ నే కాదు ఓటీటీలు కూడా హిట్స్ ఇస్తాయనడానికి '#90’s' నిదర్శనం'' అన్నారు


వాసుకి మాట్లాడుతూ.. దర్శకుడు ఈ కథ చెప్పినపుడు తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్మకం కుదిరింది. అది ఈరోజు నిజం కావడం ఆనందంగా వుంది. ఈ నిర్మాణ సంస్థలో పని చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి టీంతో కలసి పని చేయాలని కోరుకుంటున్నాను. ఈ విజయంలో భాగం కావడం ఆనందంగా వుంది'' అన్నారు


దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ... #90’s రీచ్ అద్భుతంగా వుంది. ముఖ్యంగా 90 కిడ్స్ చాలా వోన్ చేసుకున్నారు. వాళ్ళ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంత అద్భుతంగా ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. శివన్న, వాసుకి గారికి థాంక్స్. ఈ సిరిస్ కి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సాంప్రదాయని ట్యూన్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రెడిట్ సురేష్ బొబ్బిలి గారికి దక్కుతుంది. మా నిర్మాతలుకు కృతజ్ఞతలు. ఈ సిరిస్ కి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తెలిపారు  


సాయి కృష్ణ మాట్లాడుతూ..  ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో #90’s అందరి కథ అని చెప్పాను. మా నమ్మకం నిజమైయింది. #90’s అందరికీ గొప్పగా కనెక్ట్ అవుతుంది. 200 మిలియన్ వ్యూస్ మినిట్స్ తెచ్చుకున్న ఫస్ట్ ఎవర్ తెలుగు వెబ్ సిరిస్ ఇది. ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యూయర్ షిప్ రావడం ఇదే తొలిసారి. ఈ సిరిస్ లో పని చేసిన అందరికీ థాంక్స్. ఇంత అద్భుతమైన స్పందన ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు' తెలిపారు.


ఈ వేడుకలో యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !