View

యూత్ కి కనెక్ట్ అయ్యే చిత్రం 'బీఫోర్ మ్యారేజ్'

Tuesday,January23rd,2024, 02:46 PM

తెలుగు తెర‌పైకి మ‌రో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ వ‌చ్చేస్తోంది. యూత్‌ను ఎట్రాక్ట్ చేసే క‌థ‌తో పాటు మెసెజ్ ఇస్తూ తెర‌కెక్కిన చిత్రం 'బీఫోర్ మ్యారేజ్'. మూడు ద‌శాబ్దాల క్రితం సుజన ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై టార్జాన్ సుందరి, ప్రేమ ఘర్షణ, సంసార వీణా.. వంటి సినిమాలు నిర్మించిన వై నాగేశ్వర్ రెడ్డి తనయుడు  ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మాతగా ప‌రిచ‌య‌మ‌వుతూ  హనుమ క్రియేషన్స్ పై నిర్మిస్తున్న మూవీ బిఫోర్ మ్యారేజ్.


భరత్ - నవీన రెడ్డి హీరోహీరోయిన్లుగా శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వం వహిస్తున్నారు... రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఎస్.కె.యమ్.ఎల్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఆది నారాయణ ఈ చిత్రాన్ని సుమారు 100 థియేటర్ లలో విడుదల చేస్తున్నారు... ఈ సందర్భంగా చిత్ర‌యూనిట్ స‌భ్యులు హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు.


ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. గత ఏడాది చిన్న సినిమాల హవా నడిచింది. ఈ ఏడాది 'హనుమాన్' చిత్రం కొన‌సాగించిన‌ ప్రభంజనం మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్టవ్వాలి. ట్రైలర్ చూస్తే యూత్ కు మంచి మెసేజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పాటలు బాగున్నాయి. మంచి విజ‌యం సాధించాల‌ని చిత్ర‌యూనిట్‌కు విష్ చేస్తున్నాను అన్నారు.  


ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మ‌రో అతిథి నిర్మాత రామ్ సత్యనారాయణ మాట్లాడుతూ... ఈ సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంద‌ని ట్రైల‌ర్ చూస్తేనే తెలుస్తుంది. మ్యూజిక‌ల్ హిట్‌గానూ నిలుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. లేడీ ఓరియంటేడ్ మూవీ మాదిరిగా ఉంది.. హీరోయిన్ బాగా చేసింది. ఇలాంటి సినిమాల‌ను ఆదరించాలి. చిత్ర‌యూనిట్‌కు బెస్టాఫ్ ల‌క్.


ద‌ర్శ‌కుడు శ్రీధర్ రెడ్డి ఆటాకుల మాట్లాడుతూ.. పెళ్లికి ముందు త‌ప్పు అనిపించ‌ని పొర‌పాటు.. లైఫ్‌లో ఒక్క‌సారిగా ఊహించ‌ని మార్పులు చోటు చేసుకుంటాయని, అదే విష‌యాన్ని వాస్తవానికి దగ్గరగా సినిమాను తెరకేక్కించాము. టీమ్‌లో ప్ర‌తి ఒక్క‌రూ బాగా చేశారు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా క్వాలిటీ విష‌యంలో నిర్మాత స‌హ‌క‌రించారు. సినిమా హిట్ట‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.


నిర్మాత ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్న విష‌య‌మే క‌దా అని యువ‌త పెడ‌దోవ ప‌డితే ఏం జ‌రుగుతుందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించిన సినిమా ఇది. యదార్ధ సంఘటనల‌ ఆధారంగా ఈ సినిమాను నిర్మించాము. సినిమాలో సింగ‌ర్ మంగ్లీ పాడిన పాట భారీ హిట్ట‌వుతుంది. యువ‌తీయువ‌కుల‌కు మంచి మెసెజ్ ఇందులో ఉంటుంది. మా సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాము.


హీరో భ‌ర‌త్ మాట్లాడుతూ... మంచి కథ ఇది. అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు. ఈ త‌రం యువ‌త‌కు బాగా ఎక్కే సినిమా ఇది. సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.


హీరోయిన్ నవీన రెడ్డి మాట్లాడుతూ... నేను తెలుగుమ్మాయిని. ఒక సాధారణ అమ్మాయి లైఫ్‌లో జరిగే పరిస్థితులే ఈ సినిమా. టీమ్ అంతా క‌లిసి ఎంతో కష్టపడి, ఇష్టపడి సినిమా చేశాము. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.


నటి అపూర్వ మాట్లాడుతూ... మంచి యూత్ ఫుల్ మూవీ. మ‌ళ్లీ మ‌ళ్లీ చూసేలా సినిమా ఉంది. యువ‌త క‌చ్చితంగా సినిమాను చూసి హిట్ చేయాలి.


న‌టీన‌టులు: హీరో భారత్, హీరోయిన్ నవీన రెడ్డి, అపూర్వ‌...


గాయ‌నీగాయ‌కులు: మంగ్లీ, సంథిల్య పిస‌పాటి, అప‌ర్ణ నంద‌న్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ర‌వికుమార్ గొల్ల‌ప‌ల్లి,
మ్యూజిక్: పీఆర్
డీవోపీ: రాజశేఖర్ రెడ్డి  
ద‌ర్శ‌క‌త్వం: శ్రీధర్ రెడ్డి ఆటాకుల
నిర్మాత: ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి
ఎడిటింగ్ అలోష్యాస్ క్స‌వెర్
ప‌బ్లిసిటీ డిజైన‌ర్: జేకే ఫ్రేమ్స్
పీఆర్ఓ: ఆశోక్ ద‌య్యాల‌Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !