View

బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నా - సుహాస్

Wednesday,January24th,2024, 11:57 AM

సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో


ఎడిటర్ కొదాటి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ - మా సినిమా ట్రైలర్ మీకు ఎంత నచ్చిందో అంతకంటే ఎక్కువగా మూవీ ఆకట్టుకుంటుంది. ఎడిటర్ ను సినిమాకు ఫస్ట్ ఆడియెన్ అంటారు. ఆ నమ్మకంతో చెబుతున్నా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది. అలా సాధించేలా మీరే చేయాలి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాం. ఈ సినిమాను కల్ట్ క్లాసిక్ మూవీ చేసే బాధ్యత మీదే. వచ్చే నెల 2న థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు.


సినిమాటోగ్రాఫర్ వాజిద్ బేగ్ మాట్లాడుతూ - మా మూవీ టీజర్ హిట్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అమలాపురం, అంబాజీపేటలో రియల్ లొకేషన్స్ లో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా షూటింగ్ చేశాం. అలా చేయాలని సుహాస్ సజెషన్ ఇచ్చాడు. ట్రైలర్ లో మీరు చూస్తున్నవి చిన్న శాంపిల్స్ మాత్రమే. సుహాస్ ఇంటెన్స్ యాక్టింగ్ సినిమాలో చూస్తారు. అన్నారు.


యాక్టర్ కిట్టయ్య మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాలో నేను సుహాస్ ఫాదర్ రోల్ చేశాను. ఇలాంటి మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చిన డైరెక్టర్ గారికి, సుహాస్ కు థ్యాంక్స్. ఈ సినిమాలో సుహాస్ పర్ ఫార్మెన్స్ మిమ్మల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఫిబ్రవరి 2న సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.


నటి శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ - మీ లవ్ అండ్ సపోర్ట్ మా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీ టీమ్ మొత్తానికీ కావాలి. మీకు టీజర్, ట్రైలర్ ఎంత నచ్చింది అనేది మీ రెస్పాన్స్ తోనే తెలుస్తోంది. ఇలాగే సినిమా కూడా డెఫనెట్ గా నచ్చుతుంది. సినిమా చూసి అంబాజీపేట వైబ్స్ ఫీల్ అవుతారు. అన్నారు.


డైరెక్టర్ దుశ్యంత్ కటికనేని మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా ట్రైలర్ మీకు బాగా నచ్చిందని మీ హ్యాపీనెస్, రెస్పాన్స్ చూస్తుంటే అర్థమవుతోంది. కొన్ని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించాం. లవ్ స్టోరీతో పాటు ఇంటెన్స్ డ్రామా ఉంటుంది. ఊరిలో జరిగే కథ కాబట్టి కులాల ప్రస్తావన ఉంటుంది. అయితే ఎవరినీ కించపరిచే అంశాలు మూవీలో ఉండవు. ఫిబ్రవరి 2న థియేటర్స్ లోకి వస్తున్న "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాను మీ చేతుల్లో పెడుతున్నాం. మీరే సూపర్ హిట్ చేయాలి. సినిమా మేకింగ్ లో నాకు సపోర్ట్ చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.


యాక్టర్ నితిన్ మాట్లాడుతూ - రియలిస్టిక్ గా ఉంటూ కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగే సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అలాంటి అరుదైన సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" అని గర్వంగా చెప్పగలను. థియేటర్స్ లో మీరు సినిమా చూస్తున్నంత సేపు మా మల్లి జీవితాన్ని, కోనసీమ, అంబాజీపేట వాతావరణాన్ని దగ్గరగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అన్నారు.


హీరోయిన్ శివాని నాగరం మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా మీద మీరు చూపిస్తున్న రెస్పాన్స్ కు హ్యాపీగా ఉంది. థియేటర్స్ లో డబుల్ ధమాకాలా మా మూవీ ఉంటుందని ప్రామిస్ చేసి చెప్పగలను. ఇంకా 9 రోజుల్లో "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" థియేటర్స్ లోకి వస్తోంది. టీమ్ అంతా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాం. మా సినిమా నుంచి రెండు సాంగ్స్, టీజర్, ట్రైలర్ హిట్ చేశారు. అలాగే సినిమాను కూడా సూపర్ హిట్ చేయాల్సిన బాధ్యత మీదే. మీ ఫ్రెండ్స్ బ్యాచ్ లతో కలిసి థియేటర్స్ కు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.


నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ -  నేను నిర్మాతగా మీ ముందు నిలబడటానికి కారణం అల్లు అరవింద్ గారు, బన్నీ వాస్ గారు. మా సంస్థలో ఏదో ఒక సినిమా చేసేద్దాం అని ఎప్పుడూ అనుకోలేదు. సినిమా చేస్తే తప్పకుండా హిట్ మూవీనే చేయాలి అనుకున్నాం. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" కథ వినగానే బన్నీ వాస్ గారు నేను చాలా ఎగ్జైట్ అయ్యాం. సుహాస్ కూడా చాలా ఇన్వాల్వ్ అయి మూవీ చేశాడు. ఆయనకు అప్పటికే కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ వంటి మంచి హిట్ మూవీస్ ఉన్నాయి. ఈ సినిమాను కూడా సూపర్ హిట్ చేయాలనే తపన సుహాస్ లో కనిపించింది. రెండు సార్లు ఈ సినిమా కోసం గుండు చేయించుకున్నారు. సుహాస్ తో పాటు హీరోయిన్ శివానీ, శరణ్య ప్రదీప్..ఇలా కాస్ట్ అంతా అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. సినిమాటోగ్రాఫర్ వాజిద్ అమలాపురం ప్రాంతాన్ని అందంగా తెరకెక్కించారు. మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికి కూడా ఆయన వర్క్ చేస్తూనే ఉన్నారు. మా సంస్థలో బేబి వంటి బ్లాక్ బస్టర్ ను మీరు అందించారు. ఈ సినిమాతో మరో సూపర్ హిట్ ఇస్తారని ఆశిస్తున్నాం. దుశ్యంత్ వెంకటేష్ మహా దగ్గర మూవీస్ కు వర్క్ చేశాడు. ఈ సినిమా కథ దుశ్యంత్ వెంకటేష్ మహాకే చెప్పాడు. వాళ్లిద్దరు కలిసి సుహాస్ కు నెరేట్ చేశారు. వెంకటేష్ మహా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. ఈ కథ మేము కూడా విన్నాం. మాకు బాగా నచ్చింది. వెంకటేష్ మహాకు డైరెక్టర్ గా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మేము ప్రొడ్యూస్ చేసుకుంటాం అని చెప్పాం. ఆయన సరేనన్నారు. వెంకటేష్ మహా ప్రెజెంటర్ గా ఈ మూవీ మేము ప్రొడ్యూస్ చేశాం. చిన్న సినిమాలకు ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయాలంటే పెద్ద బ్యానర్స్ సపోర్ట్ ఉండాలి. అలా మాకు గీతా సంస్థ సపోర్ట్ ఉంది. బేబి సినిమాకు "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" తో పోలికలు పెట్టుకోవద్దు. ఇవి రెండు వేర్వేరు జానర్ మూవీస్. ఏ మూవీ సక్సెస్ ఆ మూవీకే ఉంటుంది. మా ప్రతి సినిమాకు అల్లు అర్జున్ సపోర్ట్ ఉంటుంది. మా సంస్థలో చాలా మూవీస్ రాబోతున్నాయి. అరవింద్ గారి పేరు నిలబెట్టేలా ప్రతి సినిమాకు కష్టపడతాం. అన్నారు.


హీరో సుహాస్ మాట్లాడుతూ - నాకు నిన్న బాబు పుట్టాడు. ఆ హ్యాపీనెస్ లోనే ఉన్నాను. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" ట్రైలర్ కు మీ రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది నా కెరీర్ లో ఎంతో స్పెషల్ మూవీ. కథ విన్నప్పటి నుంచి నాతో పాటు మా టీమ్ అంతా ఈ ప్రాజెక్ట్ కు డెడికేట్ అయ్యాం. రెండు సార్లు గుండు చేయించుకున్నా. బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నా. కథ మీద నమ్మకంతోనే అంతగా కనెక్ట్ అయి వర్క్ చేశాం. సినిమా చూస్తున్నప్పుడు మీరు చాలా సందర్భాల్లో మీ లైఫ్ లో జరిగిన సందర్భాలను రిలేట్ చేసుకుంటారు. ఫిబ్రవరి 2న మా సినిమాకు మంచి సక్సెస్ అందిస్తారని ఆశిస్తున్నాం. అన్నారుAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !