View

నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు ఇస్తాం - ‘రామ్’ నిర్మాత దీపికాంజలి 

Wednesday,January24th,2024, 01:26 PM

దేశ భక్తిని చాటే చిత్రంగా రామ్ (RAM ర్యాపిడ్ యాక్షన్ మిషన్) రాబోతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా  ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయాజుల హీరోగా పరిచయం కానున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌‌లతో అంచనాలు పెంచేశారు. మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
 *పీపుల్ మీడియా ఫాక్టరీ అధినేత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ..* ‘మంచి కంటెంట్‌తో రామ్ చిత్రం రాబోతోంది. ఎన్నో ఆర్థిక కష్టాలను పడి ఈ చిత్రాన్ని నిర్మించారు. నేను కొంత రషెస్ చూశాను. సినిమా బాగా వచ్చింది. మొదటి సినిమానే అయినా సాయి కుమార్ పక్కన సూర్య బాగా నటించారు. కంటెంట్ ఉంటే.. చిన్న చిత్రాలు కూడా పెద్ద చిత్రాలుగా మారుతున్నాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


*నిర్మాత బెక్కెం వేణు గోపాల్ మాట్లాడుతూ..* ‘ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం సైనికులు పోరాడుతుంటారు. మన సైనికులు, ప్రాణ త్యాగాల మీద చిత్రాలు వస్తుంటాయి. ఇలాంటి ఓ మంచి సందేశాత్మక చిత్రం తీసిన దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్. వారి త్యాగాలను చూపించి అందరికీ మరోసారి వారి గొప్పదనాన్ని చాటి చెప్పారు. ఎంతో నిజాయితీగా ఈ సినిమాను తీశారు. సాయి కుమార్, ధన్యా బాలకృష్ణ పాత్రలు బాగున్నాయి. మొదటి చిత్రం కావడంతో సూర్య తనను తాను నిరూపించుకునేందుకు చాలా కష్టపడ్డారు. అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించారు. దేశ భక్తిని చాటే చిత్రంగా జనవరి 26న రాబోతోంది. ప్రేక్షకులందరూ చూసి విజయాన్ని అందించాలి’ అని అన్నారు.


*హీరో సూర్య అయ్యలసోమయాజుల మాట్లాడుతూ..* ‘మా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన వివేక్ కూచిభొట్ల, బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్. మా అమ్మానాన్నలు ఎవరో ప్రేక్షకులకు తెలియదు. ఒక హిట్ ఇస్తే ఇండస్ట్రీ అంతా తిరిగి చూస్తుంది. అందుకే ఈ సినిమాను తీశాం. ఈ చిత్రానికి నలుగురు పిల్లర్స్‌గా నిలిచారు. నేను, డైరెక్టర్, కెమెరామెన్ ధారన్ సుక్రి, నా ఫ్రెండ్స్. నా స్నేహితులందరూ కలిసి ఫండింగ్ చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్న చిత్రం పెద్ద చిత్రం అనేది ఉండదు. మొన్నే పెద్ద చిత్రాల మధ్యలో చిన్న సినిమా వచ్చి నిలబడింది. ఇప్పుడు కూడా పెద్ద చిత్రాల నడుమ చిన్న చిత్రం రాబోతోంది. రామ్ అంటే భక్తి సినిమా కాదు.. దేశ భక్తి సినిమా. ఇక మున్ముందు రామ్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. వందలో అరవై మందికి మా సినిమా కచ్చితంగా నచ్చుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మిహిరామ్ గారికి థాంక్స్. భానుచందర్, సాయి కుమార్ గారికి థాంక్స్. ప్రతీ డైలాగ్ తూటాలా ఉంటుంది. క్లైమాక్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. సినిమా బాగుంటే.. బాగుందని లేకపోతే బాగా లేదని చెప్పండి’ అని అన్నారు.


*సాయి కుమార్ మాట్లాడుతూ..* ‘చాలా రోజుల తరువాత దేశ భక్తిని చాటే చిత్రంలో నటించాను. మొదటి సినిమాతోనే ఇలాంటి జానర్‌ను ఎంచుకుని సూర్య చాలా కష్టపడ్డాడు. హీరో సూర్య, దర్శకుడు మిహిరామ్ ఇద్దరూ కృష్ణార్జునలుగా కలిసి ఎంతో కష్టపడి సినిమాను తీశారు. మా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన వివేక్ కూచిభొట్ల, బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్. ధన్య బాలకృష్ణ చక్కగా నటించారు. ఫైట్స్ అన్నీ బాగుంటాయి. డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. సినిమాను మా వంతుగా చేశాం. ఇక నిర్ణయం ప్రజలదే. కంటెంట్ బాగుంటే.. ఆడియెన్స్‌కి కనెక్ట్ అయితే సినిమాను ఆపలేరు. ఇప్పుడు అంతటా హనుమాన్ ఆడుతోంది. ఇప్పుడు ఈ రామ్ సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.


*దర్శకుడు మిహిరాం మాట్లాడుతూ..* ‘మా చిత్రానికి సపోర్ట్‌గా నిలిచిన వివేక్ కూచిభొట్ల గారికి, బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్. నిర్మాత దీపికాంజలికి థాంక్స్. సినిమాలో నటించిన, పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ధారన్ సుక్రి మంచి కెమెరామెన్‌గా ఇండస్ట్రీలో ఎదుగుతారు. రాజ్ కుమార్ మాస్టర్ ఫైట్స్ బాగుంటాయి. దేశ భక్తిని చాటి చెప్పే చిత్రమే కానీ.. బార్డర్‌లో ఉండే సైనికుల గురించి చెప్పేది కాదు. దేశసరిహద్దు లోపల టెర్రర్ అటాక్ బారి నుంచి మనల్ని కాపాడే అన్ సంగ్ హీరోల గురించి చూపించాను. మాకు ఇప్పుడు థియేటర్లు దొరకడం కూడా కష్టంగా ఉంది. కానీ మంచి థియేటర్లను తెచ్చుకునేందుకు డిస్ట్రిబ్యూటర్ గణేష్ ప్రయత్నిస్తున్నారు. మా సినిమాను ప్రేక్షకులు చూసి ఆదరించాలి. మంచి విజయాన్ని అందించాలి’ అని అన్నారు.


*నిర్మాత దీపికాంజలి మాట్లాడుతూ..* ‘మాకు ఇది మొదటి సినిమా. మేం సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి రాలేదు. దర్శకుడు చెప్పిన బడ్జెట్లో చెప్పినట్టుగా సినిమాను తీశారు. సూర్య చక్కగా నటించారు. ధన్య బాలకృష్ణ చేసిన ఓ ఎమోషనల్ సీన్ చూస్తే ప్రేక్షకులు కంటతడి పెడతారు. భాను చందర్, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి వారి నటన గురించి చెప్పే స్థాయి నాకు లేదు. ఈ సినిమాకు తెగే ప్రతీ టికెట్‌లో రూ.5/- లు నేషనల్ డిఫెన్స్‌ ఫండ్‌కు ఇస్తాం. మన దేశ సైనికులకు ఈ సినిమాను అంకితం చేస్తున్నామ’ని అన్నారు.


*ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ..* ‘మా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన వివేక్ కూచిభొట్ల, బెక్కెం వేణుగోపాల్ గారికి థాంక్స్. వారి రాకతో వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు అయింది. సాయి కుమార్ గారితో నటించడంతో లైఫ్ సర్కిల్ కంప్లీట్ అయినట్టుగా అనిపించింది.  సూర్య, దీపికలు ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టారు. దర్శకుడు చాలా పెద్ద స్థాయికి వెళ్తారు. మా చిత్రానికి ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించాలి’ అని అన్నారు.


We Pledge To Donate Rs.5/- From Every Ticket Of Ram Sold To National Defence Fund : Producer Deepikanjali


Ram (RAM Rapid Action Mission) is a patriotic film that is set for release on January 26th on the occasion of Republic Day. Deepika Entertainment, in association with OSM Vision is bankrolling the project. Mihiraam Vynateyaa who is making his directorial debut also provided the story, screenplay, and dialogues for this movie. Surya Ayyalasomayajula is making his debut as a hero, while Dhanya Balakrishna is the heroine in the movie produced by Deepikanjali Vadlamani. The expectations have already been raised with the teaser and trailer. The pre-release event of this movie was held on Tuesday.


*People Media Factory head Vivek Kuchibhotla said* , “Ram is coming up with good content. The makers faced many financial difficulties, during the making of this movie. I have seen some rushes. The movie has come out well. Even though it was the first movie, Surya acted well next to Sai Kumar. If the content is good, even small movies are turning out to be big hits. I want this film to be a big success.”


*Producer Bekkem Venu Gopal said* , “Soldiers fight for us risking their lives. We have seen many films made about our soldiers and their sacrifices. Hats off to the director and producers for making such a good informative film. This film was made very honestly. The roles of Sai Kumar and Dhanya Balakrishna are good. Given it is his first film, Surya worked hard to prove himself. He emoted all the emotions quite efficiently.”


*Hero Surya Ayyalasomayajula said* , “Thanks to Vivek Kuchibhotla and Bekkem Venugopal who came to support our film. The audience does not know who my parents are. If one delivers a hit, the whole industry will look back at them. That's why we made this film. There are four pillars for this film. Me, director, cameraman Dhaaran Sukre, and my friends. All my friends together funded this film. There is no such thing as a small and big film. Recently, a small movie came in competition with big movies and is turning out to be a big hit. Even now, a small film is coming in between big films. Ram is not a devotional movie... but it’s a patriotic film. The name Ram will continue to be heard in the future. Sixty people out of a hundred will definitely like our movie. Thanks to director Mihiraam for giving me this opportunity. Thanks to Bhanu Chander and Sai Kumar. Every dialogue will fire like a bullet. The climax is hair-raising. If the movie is good, say it is good, if not, say it is not good honestly.”


*Sai Kumar said* , “After many days, I acted in a film about patriotism. Surya chose such a genre with his first film and put in his best efforts. Both hero Surya and director Mihiraam worked hard together as Krishnarjuna and made the film. Thanks to Vivek Kuchibhotla and Bekkem Venugopal who came to support our film. Dhanya Balakrishna acted well. Fights will be good. If the content is good and connects with the audience, the movie can't be stopped. Hanuman is running successfully. Now this Ram movie will also impress everyone.”


*Director Mihiraam said* , “Thanks to Vivek Kuchibhotla and Bekkem Venugopal for supporting our film. Thanks to producer Deepikanjali. Thanks to everyone who acted and worked in the movie. Dhaaran Sukre will rise in the industry as a good cameraman. Rajkumar Master Fights will be good. It is a film about patriotism but not about the soldiers at the border.  It is about the internal defence system heroes who are selflessly fighting against terror plans, This film is about such unsung and unsung heroes. It is also difficult for us to find theaters now. But we are trying to get a good number of theatres. The audience should watch and appreciate our film.”


 *Producer Deepikanjali said* , “This is our first film. We did not come from a film background. The film was made as per the budget given by the director. Surya acted well. An emotional scene done by Dhanya Balakrishna will bring tears to the audience. I don't have enough to say about the performance of Bhanu Chander, Sai Kumar, and Subhalekha Sudhakar. We pledge to donate Rs.5/- to National Defence Fund from every ticket of the movie sold. We are dedicating this film to the soldiers of our country.”


*Dhanya Balakrishna said* , “Thanks to Vivek Kuchibhotla and Bekkem Venugopal who came to support our film. Acting with Sai Kumar seemed to complete the circle of life. Surya and Deepika gave their lives for this film.The director goes to great lengths. The audience should give good support to our film.”Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !