View

ఈ సినిమా "ఉత్సవం" లా ఉంటుంది - బ్రహ్మానందం

Sunday,January28th,2024, 03:49 PM

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా 'ఉత్సవం'. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అతిధులుగా హాజరైన ఈ టీజర్ లాంచ్ వేడుక గ్రాండ్ గా జరిగింది.


'కళాకారుడు చనిపోవచ్చుగానీ కళ చనిపోకూడదు' అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనుభూతిని ఇచ్చింది. టీజర్ లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, నాజర్, రాజేంద్ర ప్రసాద్, ఎల్.బి. శ్రీరామ్, అలీ, ప్రేమ, ఆమని, ప్రియదర్శి లాంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో కనిపించడం కన్నులపండగలా వుంది. యంగ్ హీరో దిలీప్ ప్రకాష్ స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా వుంది. దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా పాత్రలని ప్రజెంట్ చేసిన తీరు చాలా ఆసక్తిరకంగా వుంది. దర్శకుడు అర్జున్ సాయి ఇంతమంది వెర్సటైల్ యాక్టర్స్, వారి పాత్రల్లోని ఎమోషన్ ని టీజర్ లో అద్భుతంగా చూపించారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ మనసుని హత్తుకునేలా వుంది. రసూల్ ఎల్లోర్ వండర్ ఫుల్ విజువల్స్ అందించారు. ప్రొడక్షన్ డిజైన్, నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి టీజర్ 'ఉత్సవం'పై చాలా ఆసక్తిని పెంచింది.


టీజర్ లాంచ్ ఈవెంట్ లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడుతూ.. నటులు, నట జీవితం అంటే నాకు ఒక ఎమోషనల్ ఎటాచ్మెంట్. ఆర్ట్ ఈజ్ లాంగ్.. లైఫ్ ఈజ్ షార్ట్. చివరి వరకూ మిగిలిపోయేది కళ మాత్రమే. కళా కారులందరినీ ఒక్క చోటికి చేర్చి వీరిపై ఒక సినిమా చేయాలని ఆలోచన చేసిన దర్శకుడు అర్జున్ సాయికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి సినిమాలు ఎన్నుకోవాలంటే ధైర్యంతో పాటు సినిమాటిక్ గా చెప్పే నేర్పు కావాలి. ఇంతమంది నటీనటులని ఒక్క చోటికి చేర్చి చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. అందరూ అద్భుతమైన నటన ప్రదర్శించారు. నిజంగా ఈ సినిమా 'ఉత్సవం'లా వుంటుంది. ఖచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. విభిన్నమైన కథలని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కళకు ఆయువుపట్టు నాటకరంగం. తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. హీరో దిలీప్ చక్కని నటన కనపరిచాడు. రంగస్థలం గురించి, ఈ సినియా గురించి దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని 'ఉత్సవం' తీర్చిదిద్దారు. తప్పకుండా ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది'' అన్నారు.  


హీరో దిలీప్ మాట్లాడుతూ.. కలర్ పుల్, ఎమోషనల్ జర్నీ, కంటెంట్ బేస్డ్ 'ఉత్సవం' సినిమాతో  పరిచయం కావడం గర్వంగా, గౌరవంగా వుంది. నన్ను నమ్మి ప్రోత్సహించిన నిర్మాతకు కృతజ్ఞతలు. మా సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులు ఆశీస్సులు, ఆదరణ మా సినిమా కావాలి'' అని కోరారు.  


నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. సినిమాకి మూలమే నాటకరంగం. ఈ  టీజర్ లోని మొదటి డైలాగే చాలా ఆకట్టుకునేలా వుంది. ఇంతమంది లెజెండరీ నటులతో ఈ చిత్రాన్ని రూపొందించడం చాలా విశేషం. ఇంత మంచి కళాత్మక చిత్రానికి దర్శకత్వం వహించిన అర్జున్ సాయి కి అభినందనలు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.


దర్శకుడు అర్జున్ సాయి మాట్లాడుతూ..  గత పదేళ్ళుగా పరిశ్రమలో సహాయ దర్శకుడిగా, రచయితగా పని చేశాను. దర్శకుడిగా ఇది ఉత్సవం నా తొలి చిత్రం. టీజర్ లాంచ్ చేసిన  బ్రహ్మానందం గారు,  నిర్మాత ఏఎం రత్నం గారికి కృతజ్ఞతలు'' తెలిపారు.


ప్రముఖ నటుడు ఎల్. బీ శ్రీరామ్ మాటాడుతూ..  నాటకానికి సంబంధించి ఎన్నో మంచి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఉత్సవం వస్తోంది. సినిమా చాలా బావుంటుంది. నాటకం అమ్మలాంటింది. నాటకం నుంచి పుట్టిన అనేక రూపాలే నేటి కళారూపాలు. తల్లిని గౌరవించినపుడే మనికి 'ఉత్సవం'' అన్నారు.


అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ఉత్సవం హార్ట్ టచ్చింగ్ సబ్జెక్ట్. చాలా పెద్ద నటీనటులు ఇందులో వున్నారు. అర్జున్ చాలా అద్భుతంగా సినిమాని తీశారు. ఇందులో చాలా పాటలు వున్నాయి. నేను చేసిన సినిమాల్లో ఉత్సవం కూడా మంచి ఆల్బమ్స్ అవుతుందని నమ్ముతున్నాను'' అన్నారు. అనంతశ్రీరాం, లక్ష్మీ భూపాలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా ఈ వేడుకలో పాల్గొన్నారు.


తారాగణం: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ


సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: అర్జున్ సాయి
నిర్మాత: సురేష్ పాటిల్
సమర్పణ: హార్న్‌బిల్ పిక్చర్స్
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: వనమాలి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్.
గాయకులు: అనురాగ్ కులకర్ణి, కైలాష్ ఖేర్, అర్మాన్ మాలిక్, విజయ్ ప్రకాష్, పెంచల్ దాస్/ రామ్ మిరియాల.
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డీవోపీ: రసూల్ ఎల్లోర్
డిఐ & సౌండ్ మిక్స్: అన్నపూర్ణ స్టూడియోస్
పీఆర్వో: వంశీ & శేఖర్
మ్యూజిక్ లేబుల్: లహరి మ్యూజిక్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !