View

గ్రాండ్ గా "నా సామిరంగ" బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

Monday,January29th,2024, 09:34 AM

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కుమార్ సమర్పించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా ఘన విజయాన్ని సాధించింది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు ప్రసంశలు అందుకొని సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా అలరిస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని నిర్వహించింది. ఈ వేడుకలో కింగ్ నాగార్జున చేతులు మీదగా చిత్ర యూనిట్ కి సక్సెస్ షీల్డ్స్ ని అందించారు.


నా సామిరంగ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో కింగ్ నాగార్జున అక్కినే మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అన్ కండీషనల్ లవ్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్ కి, తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా మీరు ఎప్పుడూ ప్రేమని పంచుతూనే వుంటారు. నేను కనిపించగానే ఆనందంతో నవ్వుతూవుంటారు. వారి చిరునవ్వే నాకు ధైర్యం. ఎంతో పాజిటివ్ గా ఉంటూ మాకు థియేటర్స్, రిలీజ్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థాంక్స్. మా యూనిట్ ని ప్రతి క్షణం మిస్ అవుతున్నాను. ఈ సినిమా ప్రయాణం చాలా అద్భుతంగా జరిగింది. అందరూ ఎంతో ప్రేమతో పని చేశారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునమా థాంక్స్ చెప్పడం కాదు. ప్రతిఒక్కరినీ చాలా మిస్ అవుతున్నాను. ఈ వండర్ ఫుల్ ఫీలింగ్ ఇచ్చిన అందరికీ థాంక్స్. సెప్టెంబర్ 20 నాన్నగారి పుట్టిన రోజున విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాత అదే రోజున ఈ సినిమా మొదలుపెట్టాం. సినిమా ఓపెనింగ్ జరుగుతుందని మా ఫ్యామిలీ ఎవరికీ తెలీదు. షూటింగ్ కి బయలుదేరుతుంటే ఎక్కడికని అమల అడిగింది. ‘సినిమా మొదలుపెట్టాలి, వెళ్ళాలి’ అన్నాను. ‘సాయంత్రం వెళ్ళొచ్చు కదా’ అంటే.. ''సంక్రాంతికి విడుదల చేయాలి. త్వరగా వెళ్ళాలి' అన్నాను. అప్పుడు అందరూ నన్ను బిత్తరమొహాలు వేసుకొని చూశారు( నవ్వుతూ) 'సంక్రాంతి విడుదల అంటున్నారు, ఏమైనా పిచ్చెక్కిందా' అని పిల్లలతో సహా అందరూ అన్నారు. (నవ్వుతూ) సినిమా మొదలుపెట్టిన తర్వాత సంక్రాంతి వస్తుందనే నమ్మకం బయట ఎవరి మొహాల్లో లేదు. కానీ నా టీం మొహాల్లో మాత్రం ఆ నమ్మకం వుంది. మా నమ్మకం నిజమైయింది. విజయవంతంగా విడుదల చేశాం. అనుకున్న సమయానికి పూర్తి కావడానికి కీరవాణి గారు ఒక ప్రధాన కారణం. ఆయన ఒక టైం టేబుల్ వేసి మా అందరినీ ప్రోత్సహించారు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కీరవాణి గారికి ధన్యవాదాలు. చంద్రబోస్ గారు చక్కని పాటలు రాశారు. టీం లో అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. చాలా పాజిటివ్ గా మా గురించి రాసిన మీడియా మిత్రులందరికీ థాంక్స్. సీ యూ నెక్స్ట్ సంక్రాంతి'' అన్నారు.


ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి మాట్లాడుతూ.. నిర్మాత శ్రీనివాస్ గారు సంక్రాంతి విడుదల చేయాలనీ నిర్ణయించుకున్నారు. అనుకున్న పని సాధించారు. వారికి అభినందనలు. ఫాస్టెస్ట్ ప్రాజెక్ట్ ఈ చిత్రాన్ని చేసి విజయం సాధించిన దర్శకుడు విజయ్ కి అభినందనలు. కొత్త ప్రతిభని నమ్ముతూ టీం వర్క్ ని నమ్మి ఇంత ఫ్రీడం ఇచ్చిన నాగార్జున గారికి ధన్యవాదాలు. ఇంత సెంటిమెంట్ నరేష్ గారి వలనే సాధ్యమైయింది. సినిమాలో చాలా బెస్ట్ మూమెంట్స్ వున్నాయి. చంద్రబోస్ గారితో ప్రయాణం ఇలానే కొనసాగాలి. మా మ్యూజిక్ టీం అంతా చాలా కష్టపడ్డారు. ఆరుగురు కీ బోర్డ్ ప్లేయర్స్ విరామం లేకుండా పదిరోజుల పాటు పని చేశారు. వారికి వినోదం ఇవ్వాలని ఒక ప్రత్యేక పాటని కూడా రికార్డ్ చేశాం. సినిమా ఘన విజయం సాధించిన సందర్భంలో ఆ పాటని మీతో పంచుకుంటున్నాను'' అన్నారు.


హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. డీవోపీ శివ సంక్రాంతి అల్లుడు. ఈ సంక్రాంతి హనుమాన్, నా సామిరంగ విజయాలు అందుకున్నాడు. చోటా ప్రసాద్ గారితో వర్క్ చేయడం మంచి అనుభూతి. కీరవాణి గారు, చంద్రబోస్ గారిది విడదీయరాని బంధం. ఎప్పుడూ ఇలానే ఉంటూ మరింత మంచి సంగీతం అందించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. టీం అందరికీ థాంక్స్. విజయ్ బిన్నీ గారు సక్సెస్ అందుకోవడం చాలా అనందంగా వుంది. అషికా అద్భుతంగా నటించింది. వరాలు లాంటి కష్టమైన పాత్రని అవలీలగా చేశారు. సంక్రాంతి కింగ్ నాగార్జున గారు. ఆయనకి ఒక ఫ్యాన్ బాయ్ నుంచి కో స్టార్ స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. నాగార్జున గారితో కలసి నటించడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటాను''అన్నారు.


దర్శకుడు విజయ్ బిన్నీ మాట్లాడుతూ.. సినిమా విడుదలై సక్సెస్ మీట్ షీల్డ్స్ అందుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. నా తొలి చిత్రానికి ఇలా జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా డైరెక్షన్ టీం అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ ధన్యవాదాలు. మా నిర్మాత మేము అడిగిన ప్రతి ఆర్టిస్ట్ ని ఇచ్చారు. అందువలనే సినిమా ఇంత లావిష్ గా బ్యూటీఫుల్ గా వచ్చింది. వారి నమ్మకానికి రుణపడి వుంటాను. కీరవాణి గారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వడంతో పాటు మాకు ఎంతగానో ప్రోత్సహించారు. డీవోపీ శివ, ఎడిటర్ చోటా ప్రసాద్ గారు, ఆర్ట్ డైరెక్టర్, డ్యాన్స్, ఫైట్ మాస్టర్స్ అందరినీ పేరుపేరునా ధన్యవాదాలు. రాజ్ తరుణ్ గారికి థాంక్స్. నరేష్ గారితో వర్క్ చేసే అవకాశం రావడం చాలా లక్కీ. ఎమోషన్స్ సీన్స్., కామెడీ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ కి థాంక్స్. అషికా వరాలు పాత్రకు జీవం పోషించింది. తను అద్భుతమైన నటి. నాగ్జరున గారు ఇచ్చిన ప్రోత్సాహం వలనే ఈ రోజు ఈ వేదికపై వున్నాను. ఒక కొత్త దర్శకుడి నాగార్జున గారు లాంటి హీరో దొరకడం అదృష్టం. ఆయన చాలా గొప్పగా మార్గనిర్దేశం చేస్తారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మమ్మల్ని ఇంత గొప్పగా ఆదరించిన అందరికీ ధన్యవాదాలు' తెలిపారు.


హీరోయిన్ అషికా రంగనాథ్ మాట్లాడుతూ.. నా సామిరంగ జర్నీని చాలా ఎంజాయ్ చేశాను. దర్శకుడు విజయ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన కష్టానికి తగిన ఫలితం ఈ సినిమా విజయంతో వచ్చింది. టీంలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కీరవాణి గారితో వర్క్ చేయడం చాలా అనందంగా వుంది. నిర్మాతలకు ధన్యవాదాలు. అందరూ నన్ను వరాలు పేరుతో పిలవడం చాలా అనందంగా వుంది. నాగార్జున గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. నాగార్జున గారితో నటించడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.

 

చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !