View

అందరినీ ‘కుమారి శ్రీమతి’ ఆకట్టుకుంటుంది - స్వప్న దత్

Tuesday,September26th,2023, 02:58 PM

వెరీ టాలెంటెడ్, అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తున్న అమెజాన్ ప్రైమ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమాస్ ఈ సిరీస్‌ను నిర్మించింది. ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ వెబ్ సిరీస్‌కి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించగా, గోమటేష్ ఉపాధ్యాయ దర్శకత్వం వహిస్తున్నారు. కుమారి శ్రీమతి’ సెప్టెంబర్ 28న ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రసారం కానుంది. ఇప్పటికే  విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు కుమారి శ్రీమతి యూనిట్ ప్రెస్ ప్రీమియర్ షో అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో దర్శకులు హను రాఘవపూడి, నందిని రెడ్డి తో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.


దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. సిరీస్ ‘కుమారి శ్రీమతి’ అనే టైటిలే ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. స్వప్న గారికి ప్రాజెక్ట్ కె, సీతారామం, అన్ని మంచి శకునములే .. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఎంత ఇష్టమో.. కుమారి శ్రీమతి వాటికంటే పది శాతం ఎక్కువ ఇష్టం. ఎప్పుడు వచ్చిన ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఉత్సాహంగా మాట్లాడేవారు. అలాగే ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఇప్పుడు క్యాలిటీలో అది కనిపిస్తోంది. ఇందులో కనిపించిన పాత్రలన్నీ మన చుట్టూ వున్నవే. ఈ పాత్రలన్నీ చూడటం చాలా అద్భుతంగా అనిపించింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే షో ఈ మధ్య కాలంలో ఇదేనేమో. డైలాగ్స్ చాలా బాగున్నాయి. అందరూ ఎంజాయ్ చేస్తారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.


నందిని రెడ్డి మాట్లాడుతూ.. స్వప్న గారు ‘కుమారి శ్రీమతి’ ఐడియా చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. తర్వాత శ్రీనివాస్ అవసరాల ఈ కథకి మాటలు స్క్రీన్ ప్లే రాస్తున్నారని తెలిసి పర్ఫెక్ట్ అనిపించింది. నిత్యామీనన్ చేస్తున్నారని తెలిసిన వెంటనే క్యారెక్టర్ కనిపించింది. అప్పుడే ఈ షో భలే వుంటుందని అనిపించింది. ఈ రోజు ఆడిటోరియమ్ అంతా నవ్వులు వర్షం కురిసింది. చాలా ఆహ్లాదంగా వుంది. ఓటీటీలో కలసి కట్టుగా చూడగలిగే షో ఇది. ఈ షో మన ఇంట్లో చేసుకున్న ఒక చక్కటి విందు భోజనంలా వుంటుంది. ఒకొక్క ఎపిసోడ్ లో వారు చేసిన ప్రదర్శన వారి ప్రపంచంలోకి ఆకట్టుకుంటుంది. స్వప్న సినిమా నుంచి ఒక ప్రోడక్ట్ బయటికి వచ్చిందంటే చాలా క్యాలిటీగా వుంటుంది. ఓటీటీ లో ఈ షో పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ’’ అన్నారు.


స్వప్న దత్ మాట్లాడుతూ.. మాకు తెలిసింది సినిమా మాధ్యమమే. ఈ మాధ్యమంలో మంచి కథలు చెప్పాలని ప్రయత్నిస్తుంటాం. కథ నచ్చితే అది చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రేక్షకులకు మంచి కథని చూపించాలనేది మా ప్రయత్నం. శ్రీమతి పాత్రని పోషించడం అంత సులువు కాదు. ఆ పాత్రలో చాలా ఎమోషన్స్ వుంటాయి. అలాంటిది నిత్యామీనన్ అద్భుతంగా నటించారు. అలాగే నిరుపమ్ తో పాటు అందరూ చక్కని నటన కనబరిచారు. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా ఆస్వాదించే సిరీస్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది’’ అన్నారు.  


మనీష్ మాట్లాడుతూ.. వైజయంతీ మూవీస్, స్వప్న గారు వారి నిర్మాణంలో మహానటి, సీతారామం, అన్ని మంచి శకునములే లాంటి అద్భుతమైన చిత్రాలు చేశారు. వారితో భవిష్యత్ లో కూడా కలిసి పని చేయాలని కోరుకుంటున్నాం.  శ్రీమతి కుమారి కూడా ఒక అద్భుతమైన కథ.  చాలా ఆహ్లాదంగా కుటుంబం అంతా కలిసి చూసేలా వుంటుంది. తప్పకుండా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.


తాళ్ళూరి రామేశ్వరి మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరిస్ ని గోదావరి ప్రాంతంలో చిత్రీకరిస్తారని తెలిసి ఈ పాత్రకు ఒప్పుకున్నాను( నవ్వుతూ) నిజానికి అద్భుతమైన పాత్ర. ఈ సిరీస్  షూటింగ్ చాలా ఆస్వాదించాను. తప్పకుండా ఈ సిరీస్ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.


నిరుపమ్ మాట్లాడుతూ.. స్వప్న గారు ఈ కథ చెప్పినపుడు భలే వుందనిపించింది. ఇందులో నిత్యా మీనన్ గారు నటిస్తారని తెలిసి చాలా అనందంగా అనిపించింది. చాలా మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ సిరీస్ లో భాగం కావడం ఆనందంగా వుంది’’ అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !