View

'మంత్ ఆఫ్ మధు' ట్రైలర్ విడుదల

Tuesday,September26th,2023, 02:26 PM

నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం "మంత్ ఆఫ్ మధు". విమర్శకుల ప్రశంసలు పొందిన భానుమతి & రామకృష్ణ చిత్రాన్ని అందించిన దర్శకుడు శ్రీకాంత్ నాగోతి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించగా, యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సుమంత్ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా ని నిర్వహించారు మేకర్స్. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో  హీరో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. నిర్మాతలు యశ్వంత్, దామ నాకు మంచి స్నేహితులు. దర్శకుడు శ్రీకాంత్ తీసిన భానుమతి & రామకృష్ణ చూశాను. అందులో చాలా క్లిష్టమైన ఎమోషన్స్ వున్నాయి. 'మంత్ ఆఫ్ మధు' లో కూడా అలాంటి ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. నవీన్ ని చూస్తే నాకు చాలా అనందంగా వుంటుంది. అన్ని రకాల పాత్రలు చేస్తుంటారు. ఇందులో కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. స్వాతి నాకు చాలా మంచి స్నేహితురాలు. ఈ సినిమాతో తనకి మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.


నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ఈ సినిమా విషయంలో చాలా నమ్మకంగా వున్నాం. చాలా మంచి కథ. రైటింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఇలా అన్నీ అద్భుతంగా కుదిరాయి. నటీనటులందరూ చక్కగా చేశారు.  ఇందులో శ్రేయా చాలా మంచి పాత్ర చేసింది. ఈ సినిమా తనకి మంచి ఫ్లాట్ ఫామ్ కావాలని ఆశిస్తున్నాను. సాయి ధరమ్ తేజ్ గారికి ధన్యవాదాలు. అక్టోబర్6న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది'' అన్నారు.


స్వాతి రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను, నవీన్ తో పాటు చాలా మంది మంచి నటులు ఉన్నారు. శ్రేయా అద్భుతంగా నటించింది. సినిమా చూసిన అందరూ సర్ప్రైజ్ అవుతారు. అలాగే హర్ష పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొత్త హర్ష కనిపిస్తారు. దర్శకుడు శ్రీకాంత్ అద్భుతంగా తీశారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.


దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. 'మంత్ ఆఫ్ మధు” తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్మకం వుంది'' అన్నారు.


యశ్వంత్ మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ గారికి ధన్యవాదాలు. ఈ ఈవెంట్ కి ఆయన రావడం చాలా ఆనందంగా వుంది. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. దర్శకుడు, టీం ఎఫర్ట్ తోనే సినిమాని మీ ముందుకు తీసుకురాగలిగారు. నవీన్,  స్వాతి గారు నటీ నటులంతా అద్భుతంగా చేశారు. సినిమా మీ అందరినీ అలరిస్తుందనే నమ్మకం వుంది'' అన్నారు. 


ఈ ఈవెంట్ లో రాజారవీంద్ర, హర్ష, శ్రేయాతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !