మాస్ రాజా రవితేజ కొత్త అవతారమెత్తనున్నాడు. ఇప్పటివరకూ చేయని పాత్రతో అలరించడానికి సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ 'క్రాక్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. దీంతో పాటు రమేష్ వర్మ దర్శకత్వంలో 'కిలాడి' సినిమా చేస్తున్నాడు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు రవితేజ.
ఈ రెండు సినిమాలు కాకుండా మరో సినిమా కూడా కమిట్ అయ్యాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు రవితేజ. ఈ సినిమాలో డిటెక్టివ్ గా నటిస్తున్నాడట. ఇప్పటివరకూ రవితేజ ఇలాంటి పాత్ర చేయలేదు. కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటించే అవకాశం ఉందని సమాచారమ్. 'క్రాక్', 'కిలాడి' సినిమాల తర్వాత రవితేజ, త్రినాధరావు కాంబినేషన్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్.