View

'విక్రాంత్ రోణ' కోసం రంగంలోకి దిగుతున్నజాక్వలైన్!

Wednesday,July21st,2021, 11:50 AM

శాండిల్‌వుడ్ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ‌’. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ చాలా గ్రాండ్‌గా ఉంటూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ గ్రాండియ‌ర్‌ను కంటిన్యూ చేస్తూ బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ ఎంట్రీ గురించి మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. ‘విక్రాంత్ రోణ‌’ చిత్రంలో ఈ బాలీవుడ్ భామ ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇది అభిమానుల‌కు స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ అవుతుంద‌ని మేక‌ర్స్ తెలిపారు .


రీసెంట్‌గా కొన్ని నెల‌ల క్రితం దుబాయ్‌లోని బుర్జ్ ఖ‌లీఫా భ‌వంతిలో బాద్‌షా కిచ్చా సుదీప్ న‌టుడిగా త‌న 25 వ‌సంతాల వేడుక‌ను సెల‌బ్రేట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన వివ‌రాల‌తో పాటు ‘విక్రాంత్ రోణ‌’ సినిమా సినిమా లోగోను క‌లిపి 180 సెక‌న్ల స్నీక్ పీక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ప‌లు భాష‌ల్లో పాన్ ఇండియా సినిమాగా విడుద‌ల‌వుతున్న ఈ సినిమాలో జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ అడుగుపెట్ట‌డం అనేది అందరిలో ఎక్సైట్‌మెంట్‌ను తీసుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా...


నిర్మాత జాక్ మంజునాథ్ మాట్లాడుతూ ‘‘మా ‘విక్రాంత్ రోణ‌’ సినిమాలో జాక్వలైన్ ఫెర్నాండెజ్ భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది అభిమానుల‌కు, ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజింగ్‌గా, వారిని థియేటర్స్‌కు ర‌ప్పించేలా ఉంటుంది. జాక్వలైన్ చాలా ప్రొఫెష‌న‌ల్ న‌టి. క‌చ్చిత‌మైన స‌మయానికి షూటింగ్‌కు వ‌చ్చేవారు. ఉద‌యం 9 గంట‌ల‌కు సెట్స్‌కు వ‌చ్చి రాత్రి 9.30 నిమిషాల‌కు వ‌ర‌కు ఉండేవారు. షూటింగ్‌కు వ‌చ్చే ముందు ఆమెకు సంబంధించిన డైలాగ్స్‌ను రిహార్స‌ల్ చేసి వ‌చ్చేవారు. చాలా డేడికేష‌న్‌తో వ‌ర్క్‌ను పూర్తి చేశారు. ఆమె పాత్ర‌కు ఆమె డ‌బ్బింగ్ చెబుతాన‌ని తెలిపారు’’ అన్నారు. 


డైరెక్ట‌ర్ అనూప్ భండారి మాట్లాడుతూ ‘‘‘విక్రాంత్ రోణ‌’ చిత్రంలో జాక్వ‌లైన్ భాగం కావ‌డం అనేది క‌థ‌లో మ‌రో కోణాన్ని ఎలివేట్ చేస్తుంది. ఈ ప్ర‌పంచానికి స‌రికొత్త హీరోగా ‘విక్రాంత్ రోణ‌’ ప‌రిచ‌యం అవ‌బోతున్నాడు. ఈ సినిమాలోకి ఆమెను సగౌర‌వంగా స్వాగ‌తిస్తున్నాం. ఇలాంటి స్టార్స్ మా సినిమాలో ఉండ‌టం అనేది మాకు కూడా ఎగ్జ‌యిటింగ్‌గానే ఉంది. అలాగే ఈ సినిమాలో విజువ‌ల్స్ ప్రేక్ష‌కుల‌ను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది’’ అన్నారు.  


జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ ‘‘‘విక్రాంత్ రోణ‌’ సినిమా చాలా స్పెష‌ల్ మూవీ. ఈ ప్ర‌పంచానికి ప్ర‌త్యేక‌మైన భార‌తీయ క‌థ‌ను ఈ సినిమా ద్వారా తెలియ‌జేయ‌బోతున్నారు. ఈ భారీ రేంజ్‌లో రూపొందుతోన్న‌ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌లో నేను భాగం కావ‌డాన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థియేట‌ర్స్‌కు ఓ స్ఫూర్తినిచ్చే చిత్ర‌మిదవుతుంద‌ని నేను భావిస్తున్నాను’’ అన్నారు. 


బాద్‌షా కిచ్చా సుదీప్ మాట్లాడుతూ ‘‘మేం సినిమాను ఎలాంటి ఉత్తేజంతో స్టార్ట్ చేశామో అదే ఉత్తేజంతో పూర్తి చేయాల‌నుకుటున్నాం. మా ఎంటైర్ టీమ్ పాజిటివ్ దృక్ప‌థంతో ముందుకెళుతుంది. అంద‌రికీ థాంక్స్‌. అలాగే ఈ సినిమాలో భాగ‌మై పాట‌, సినిమా స‌హా మా అంద‌రిలో ఓ ఎన‌ర్జీకి కార‌ణ‌మైన జాక్వ‌లైన్‌గారికి ధ‌న్య‌వాదాలు. మీ డాన్స్ నాలోని ఎన‌ర్జీని రెట్టింపు చేసింది. ఇలాగే మీరు ఆత్మీయానుభూతిని పంచాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


బాహు భాషా యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీగా ప‌లు భాష‌ల్లో రూపొందుతోన్న ‘విక్రాంత్ రోణ‌’ త్రీడీలో 14 భాష‌లు, 55 దేశాల్లో విడుద‌ల‌వుతుంది. అనూప్ భండారి ద‌ర్శ‌క‌త్వంలో జాక్ మంజునాథ్ షాలిని మంజునాథ్‌(షాలిని ఆర్ట్స్‌) నిర్మిస్తున్న ఈ చిత్రానికి అలంకార్ పాండియ‌న్‌(ఇన్‌వెనో ఫిలింస్‌) స‌హ నిర్మాత. బి.అజ‌నీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కె.జి.య‌ఫ్ ఫేమ్ శివ‌కుమార్ భారీ సెట్స్ వేశారు. అలాగే విలియ‌మ్ డేవిడ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. కిచ్చా సుదీప్‌, నిరూప్ భండారి, నీతా అశోక్‌, జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. 


జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ షూట్‌లో హైలైట్స్‌:
1. విక్రాంత్ రోణ పాత్ర‌కు స‌మానంగా ఉండే ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లో జాక్వలైన్ ఫెర్నాండెజ్ పాత్ర ఉంటుంది. 2. పాట‌, స‌న్నివేశాల‌ను ఆరు రోజుల పాటు చిత్రీక‌రించారు. 3. ఈ పాటలో 300 డాన్స‌ర్స్ న‌టించారు. 4.ఈ పాట కోసం భారీ సెట్‌ను వేశారు. జానీ మాస్ట‌ర్ పాట‌కు కొరియోగ్ర‌ఫీ అందించారు. 5.జాక్వలైన్ న‌టించిన పాట‌, స‌న్నివేశాల కోసం నిర్మాత‌లు ఐదు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టారు. 6.జాక్వ‌లైన్‌ను ప్ర‌త్యేక విమానంలో షూటింగ్‌కు తీసుకొచ్చారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Read More !