నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. తాజాగా తన తదుపరి చిత్రం ఎన్ బి కె 109 తో బిజీ అయిపోయారు బాలయ్య. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ రోజు (8.11.2023) నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభమయ్యింది. కాగా మేకర్స్ ఒక పోస్టర్ ను విడుదలచేసారు. ఈ పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉంది. పదునైన గొడ్డలి, ఆంజనేయ స్వామి తాయెత్తును పోస్టర్ లో చూడవచ్చు. ఇక గొడ్డలిపై ఉంచిన కళ్ళద్దాలలో అసురులపై నరసింహ స్వామి ఉగ్రరూపం చూపుతున్న ప్రతిబింబాన్ని గమనించవచ్చు. ఈ పోస్టర్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియజేస్తోంది. పోస్టర్ సినిమాపై ఆంచనాలను కూడా పెంచేసింది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ఈ యాక్షన్ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.