పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ ఈ రోజు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించి తన అభిమానుల్లో జోష్ నింపాడు. దాదాపు రెండు నెలలుగా ప్రభాస్ ఎక్కడా కనిపించలేదు. మోకాలి సమస్యతో బాధపడుతున్న ప్రభాస్ ఇటలీలో సర్జరీ చేయించుకున్నాడు. రెండు నెలల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉండటంతో ఇండియా తిరిగి రాలేదు ప్రభాస్. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో తిరిగి వస్తాడా అని ఎదురుచూపులు చూస్తున్న అభిమానులకు ఎయిర్ పోర్ట్ లో హెల్తీ గా నడుచుకుంటూ వస్తున్న ప్రభాస్ ఫోట్ బయటికి వచ్చింది. ఈ ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇదిలా ఉంటే...
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం "సలార్" డిసెంబర్ 22న థియేటర్స్ కి రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్ పాల్గొనబోతున్నాడని సమాచారమ్.