పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకానున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమాకి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఆ సాంగ్ వివరాల్లోకి వెళితే...
రామోజీ ఫిలిం సిటీలో ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాట కోసం సిమ్రత్ కౌర్ ని తీసుకున్నారట. బంగార్రాజు, డర్టీ హరి, గద్దర్ 2 సినిమాల ద్వారా పాపులార్టీ తెచ్చుకుంది సిమ్రత్ కౌర్. "సలార్" సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఆఫర్ చేయగానే ఈ ముద్దుగుమ్మ మరో మాట మాట్లాడకుండా యస్ చెప్పేసిందట. రాజు సుందరం కొరియోగ్రఫీలో సిమ్రత్ కౌర్ పాల్గొనగా ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. రెండు రోజుల తర్వాత ఈ పాటకు చిందేయడానికి ప్రభాస్ మాయత్తమవుతున్నాడని తెలుస్తోంది. ఈ పాటతో సినిమా చిత్రీకరణ పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ చిత్రం యూనిట్ బిజీ కాబోతోంది. మరి క్రిస్మస్ ట్రీట్ గా రాబోతున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు ఏ మేరకు ట్రీట్ ఇవ్వనుందో వేచిచూడాల్సిందే.