నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమంత ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "పుష్ప" పార్ట్ 1 లో ఊ.. అంటావా మావ ఊఊ అంటావా అంటూ సమంత చేసిన ఐటమ్ సాంగ్ కి ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ఈ సినిమా సెకండ్ పార్ట్ లోని ఐటమ్ సాంగ్ కి కూడా సమంత చిందులేయడానికి అంగీకరించిందని తెలుస్తోంది. అయితే ఈ సెకండ్ పార్ట్ లో ఐటమ్ సాంగ్ తో పాటు కొన్ని సీన్ ల్లో కూడా కనువిందుచేయనుందట. ఇదే కనుక నిజమైతే సమంత చేయబోతున్న సాంగ్, సీన్స్ ను డైరెక్టర్ సుకుమార్ ఎలా డిజైన్ చేసారో వేచిచూడాల్సిందే.