టాలీవుడ్ యంగ్ హీరో తండ్రి కాబోతున్నాడనే వార్త ప్రచారమవుతోంది. ఎవరా హీరో అని ఆలోచిస్తున్నారా... ఎవరో కాదండి... కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న కుర్ర హీరో నిఖిల్. ఇటీవల ఓ పెళ్లికి తన భార్య పల్లవి వర్మ తో కలిసి వెళ్లాడు నిఖిల్. ఆ పెళ్లిలో పల్లవి వర్మ బేబి బంప్ తో కనిపించడంతో ఈ వార్త బయటికి వచ్చింది. ఆమె ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, నిఖిల్ సిద్ధార్థ తండ్రి కాబోతున్న విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే...
యంగ్ హీరో శర్వానంద్ కూడా తండ్రి కాబోతున్నాడని సమాచారమ్. ప్రస్తుతం కొన్ని నెలలు సినిమాలకు గ్యాప్ ఇచ్చి, తన బార్యతో కలిసి టైమ్ స్పెండ్ చేయాలని భావించిన శర్వా యు.యస్ వెళ్లాడని తెలుస్తోంది.
సో... టాలీవుడ్ లో ఇద్దరు కుర్ర హీరోలు తండ్రి పోస్ట్ కు ప్రమోట్ అవుతున్నారన్నమాట.