నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ఎన్ బి కె 109 తో బిజీ అయిపోయారు. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభమయ్యింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ఈ యాక్షన్ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. కాగా ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త పెద్ద ఎత్తున ప్రచారమవుతోంది. అదేంటంటే...
ఈ సినిమాలోని మరో హీరో క్యారెక్టర్ కోసం మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ని తీసుకున్నారని, ఆ పాత్ర సినిమాకి చాలా కీలకమనే వార్తలు ప్రచారమవుతున్నాయి. అయితే ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదని ఫిల్మ్ నగర్ టాక్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా బాలయ్య విశ్వరూపాన్ని మరోసారి ఆవిష్కరించే విధంగా ఉంటుందట.