View

#యష్ 19 - టైటిల్ , రిలీజ్ డేట్ ఫిక్స్

Friday,December08th,2023, 11:02 AM

ఏడాదిన్న‌ర‌గా ఆయ‌న కొత్త సినిమాను ఎప్పుడు వ‌స్తుందా అని అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇన్ని రోజులు సైలెన్స్‌ను పాటించిన హీరోయష్ త‌న కొత్త సినిమాను ప్ర‌క‌టించారు. ‘టాక్సిక్ - ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్స్ అప్స్‌’ పేరుతో తెర‌కెక్కుతుంది. సెన్సేష‌న్ పాన్ ఇండియా స్టార్ రాకింగ్ స్టార్ య‌ష్‌, అంత‌ర్జాతీయంగా ప్ర‌శంస‌లు అందుకున్న డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్‌దాస్ క్రేజీ కాంబినేష‌న్‌లో ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం రూపొందుతుంది.


 ఓ అద్భుత‌మైన సినిమాను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే త‌ప‌న‌తో, ఓర్పుతో, విజ‌న్‌తో వీరిద్ద‌రూ స‌మ‌యాన్ని తీసుకుని ఓ గొప్ప టీమ్‌ను సిద్ధం చేసుకున్నారు. వీరిద్ద‌రి కాంబోలో రాబోతున్న సినిమాపై ప‌లు ఉహాగానాలు వినిపించాయి. ఈ క్ర‌మంలో వారు మూవీ టైటిల్‌ను ‘టాక్సిక్ - ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్స్ అప్స్‌’ అని ప్ర‌క‌టిస్తూ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. అందులోని విజువ‌ల్స్‌, మూవీ స్కేల్, ప‌ర్‌ఫెక్ష‌న్ క‌నిపిస్తున్నాయి.  


వీడియోను గ‌మ‌నిస్తే అందులో మూవీ టైటిల్ ‘టాక్సిక్ - ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్స్ అప్స్‌’ అనే టైటిల్‌తో పాటు మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించటం అంద‌రినీ మ‌రింత ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

https://youtu.be/6bg5tM2jmUU?si=u_Al2aalVhT6lp1F

 

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత వెంక‌ట్ కె.నారాయ‌ణ మాట్లాడుతూ ‘‘రాకింగ్ స్టార్ య‌ష్‌తో సినిమా చేయ‌బోతుండ‌టం ఎంతో ఆనందాన్నిచ్చే విష‌యం. ఇది మాకెంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రం. య‌ష్‌, గీతు స్ట్రాంగ్ నెరేష‌న్‌తో మాస్‌, యాక్ష‌న్ అంశాల‌ను క‌ల‌గ‌లిపిన క‌థ‌ను త‌యారు చేయ‌టానికి స‌మ‌యం తీసుకున్నారు. ఈ అద్భుతాన్ని ప్రపంచానికి ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.


డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్ మాట్లాడుతూ ‘‘కథను సరికొత్తగా చెప్పాలని నేనెప్పుడూ ప్రయోగాలు చేస్తుంటాను. లైయర్స్, మూతోన్ వంటి సినిమాలను రూపొందించినప్పుడు వాటికి అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. నా దేశంలో నా ఆడియెన్స్ ఇలాంటి డిఫ‌రెంట్ నెరేష‌న్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటార‌నే విష‌యాన్ని తెలుసుకోవ‌టానికి ఎప్పుడూ త‌హ‌త‌హ‌లాడుతుంటాను. అలాంటి ఆలోచ‌న‌ల నుంచి పుట్టిందే ఈ సినిమా. రెండు వేర్వేరు ప్రపంచాల క‌ల‌యిక‌గా క‌థ ఉంటుంది. ఈ క్ర‌మంలో నేను య‌ష్‌ను క‌నుగొన్నాను. త‌నొక అద్భుత‌మైన వ్య‌క్తి. నేను అలాంటి వ్య‌క్తిని చూడ‌లేదు. అత‌నితో క‌లిసి ఈ మ్యాజిక‌ల్ జ‌ర్నీని చేయ‌టానికి ఎంతో ఆతృత‌గా ఉన్నాను’’ అన్నారు.


రాకింగ్ స్టార్ య‌ష్‌.. ‘టాక్సిక్ - ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్స్ అప్స్‌’సినిమాకు గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌, మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై సినిమా రూపొందుతోంది. ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 10, 2025న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !