View

ఇంటర్య్వూ - డైరెక్టర్ చదలవాడ శ్రీనివాసరావు (రికార్డ్ బ్రేక్)

Tuesday,March05th,2024, 11:57 AM

పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు గారు మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.


రెండేళ్లపాటుగా నిర్మించడం అదేవిధంగా ఈ సినిమా పైన ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఏంటి?
గతంలో హీరోలు హీరోయిన్లు రెమ్యూనరేషన్ తక్కువ ఉండేది. డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇంతమంది లేరు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. బిచ్చగాడు వంటి సినిమా నిర్మించిన తర్వాత కంటెంట్ ఉంటే ప్రజలు ఏ సినిమా అయినా సక్సెస్ చేస్తారు అనిపించింది. అందుకే ప్రజలు మనసుకి హత్తుకునే విధంగా నిజానికి దగ్గరగా నమ్మకంతో చాలా ఖర్చు పెట్టి ఈ సినిమాను నిర్మించాం.


రికార్డ్ బ్రేక్ అనే టైటిల్ ఈ సినిమాకి జస్టిఫికేషన్ ఎలా అనుకున్నారు?
ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు వచ్చిన రెస్పాన్స్ అలాగే శనివారం మీడియా కు వేసిన షో లో వచ్చిన రెస్పాన్స్ చూసి అందరూ ఈ సినిమాకి ఇది కరెక్ట్ టైటిల్ అని చెప్పడంతో మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఈ సినిమాకి ఇదే యాప్ట్ టైటిల్ అని అందరూ అన్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారు.


క్లైమాక్స్ గ్రాఫిక్స్ ఇవి ముందే అనుకున్నారా?
సినిమాకి అది అవసరం ముందే అనుకునే అంత ఖర్చు పెట్టి ఆ గ్రాఫిక్స్ ని చేయించాం.


ఈ సినిమాకి హీరోలు వీళ్లే అని ముందే అనుకున్నారా?
ప్రజెంట్ ఉన్న హీరోల్లో à°…à°‚à°¤ బాడీ ఉన్నవాళ్లు వెయిట్  à°ªà±à°Ÿà°ªà± చేయగలిగిన వాళ్లు ఎవరూ లేరు. అప్పటి కాలానికి à°’à°• రామారావు గారు కృష్ణంరాజు గారు ఉంటే కరెక్ట్ à°—à°¾ సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ à°—à°¾ సెట్ అయ్యారు.


కొత్త హీరోస్ పైన కొత్త వాళ్ళ పైన ఇంత బడ్జెట్ పెట్టడం అనేది కరెక్ట్ అనిపించిందా?
సినిమా రిలీజ్ అయ్యాక ప్రజలకు గుండెల్లో రికార్డ్ బ్రేక్ మంచి సినిమాగా నిలిచిపోవాలి. అందుకోసమే ఎక్కడ రాజీ పడకుండా తీసిన సినిమా ఇది.


ఈ సినిమాని ఎనిమిది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి మీ పాషన్ ఏంటి?
ఎక్కడో తెనాలిలో చిన్న కర్రల వ్యాపారం చేసే వాడిని. సిని కళామతల్లి వల్ల ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను. నాకు మంచి మిత్రులు దొరికారు. వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం నేను వాళ్లకు సపోర్ట్ చేయడం ఇలా ఇండస్ట్రీలో ఎదిగి ఈ పొజిషన్ లో ఉన్నాను. నాకు నిద్రలో కూడా సినిమాలంటే ఇష్టం.


అప్పట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య అనే సినిమా తీశారు ఇప్పుడు రికార్డ్ బ్రేక్? ప్రజెంట్ జనరేషన్ కి సినిమా ఎలా నచ్చుతుందనుకుంటున్నారు?
అప్పట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య మంచి సినిమా విజయవాడ వైజాగ్ లాంటి ప్రాంతంలో చాలా బాగా ఆడింది. అప్పుడున్న కాంపిటీషన్ కి పెద్ద సినిమాలతో కొంతవరకు పోటీ పడలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్ ఖచ్చితంగా మంచి సినిమాగా నిలుస్తుంది.


సినిమా చూసిన మీడియా నుంచి బంధువుల నుంచి మీ మిత్రుల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఆర్ నారాయణ మూర్తి గారు కూడా ఈ సినిమా గురించి చెప్పడం జరిగింది. దాని మీద మీ స్పందన?
సినిమా చూసిన ప్రతివారు కూడా చాలా బాగుంది అన్నారు. ఆర్.నారాయణమూర్తి గారు చెప్పిందని కంటే సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా చూసిన విజయ నాగిరెడ్డి గారు రాజశ్రీ ప్రొడక్షన్స్ వాళ్ల ఇన్పుట్స్ తీసుకుని 2. 45 నిమిషాల నిడివి గల సినిమాని 20 నిమిషాలు తగ్గించడం జరిగింది. అలా చేయడం వల్ల సినిమా క్వాలిటీ ఇంకా పెరిగింది.


సినిమా థియేటర్లు ఎక్కువ దొరికాయా?
థియేటర్లో ఎక్కువ దొరికినా కూడా నేనే బిచ్చగాడు లాగా కొన్ని థియేటర్లు రిలీజ్ చేసి సినిమా సక్సెస్ తర్వాత పెంచుకుందామనుకుంటున్నాం. నాకు ఎన్ని థియేటర్లు అయినా ఇస్తారు కానీ నేనే ఒత్తిడి తీసుకురాకుండా మంచి సినిమాని తక్కువ ధియేటర్లో ప్రేక్షకులు ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాం.


ఈ సినిమాలో మీకు మనసుకు హత్తుకున్న సీన్ ఏదైనా ఉందా?
బిచ్చగాడు సినిమాలో తల్లి కోసం బిడ్డ కష్టపడతాడు. కానీ ఈ సినిమాలో బిడ్డల కోసం తల్లి ఏం చేస్తుంది అన్న కాన్సెప్ట్ తో వచ్చాం. క్లైమాక్స్ కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుంది. రెజ్లింగ్ కోసం చైనా వెళ్లడానికి బిడ్డలకి కష్టపడి 10 లక్షలు సంపాదించి చైనా పంపించడం. అదేవిధంగా వాళ్లకి లడ్డూలు ఇష్టమని వాళ్ళు చైనా వెళుతున్న టైం లో తన బ్లడ్ అమ్మి లడ్డూలు తీసుకురావడం. మీరు నా కోసం మన భారతదేశ కోసం గెలిచి రావాలి అనే సీన్ చాలా బాగా నచ్చింది.


ప్రెసెంట్ నిర్మాత దర్శకుడు రిలేషన్ ఎలా ఉందనుకుంటున్నారు? మీరే సొంత బ్యానర్ లో డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి దీనిపై మీ అభిప్రాయం?
గతంలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ భార్యాభర్తల్లా ఉండేవారు. ఇప్పుడు డైరెక్ట్ హీరో ఒకటయ్యి ప్రొడ్యూసర్ కి అంత విలువ ఇవ్వట్లేదు. సినిమాల సక్సెస్ రేట్ తగ్గడానికి ఇదే మెయిన్ ప్రాబ్లం.


మీ సంస్థ నుంచి మీ నుంచి పెద్ద హీరోలు పెద్ద బడ్జెట్ సినిమాలు ఆశించవచ్చా?
నేను బ్రతికుండగా పెద్ద హీరోలతో పెద్ద బడ్జెట్ సినిమాలు చేయను. నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం పెద్ద బడ్జెట్ పెద్ద హీరోల సినిమాలు చేయకపోవడమే.


అలా పెద్ద సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి మంచిది కదా?
నేను గతంలో చేసిన శోభన్ బాబు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు వాళ్లు మహానుభావులు. నేను షూటింగ్ టైం కి వెళ్ళకపోయినా వాళ్ళు నాకంటే ముందే వచ్చి కూర్చుంటారు. నేను తీసిన డైరెక్టర్లు కూడా అజయ్ కుమార్ సదాశివరావు కేఎస్ నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా మహానుభావులు. నేను ఎవరిని పొగడట్లేదు కించపరచట్లేదు. నేను కింద నుంచి పైకి వచ్చాను నాలాగే కష్టపడి పైకి వచ్చే వాళ్ళకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.


ఈ సినిమాతో డైరెక్షన్ కంటిన్యూ చేస్తారా?
ఈ సినిమా ద్వారా నేను డైరెక్షన్ నేర్చుకున్న. ఈ సినిమా సక్సెస్ తరువాత మంచి టెక్నికల్ వాల్యూస్ తో వార్నర్ బ్రదర్స్ తీసే సినిమా కంటే గొప్ప సినిమా తీసి చూపిస్తా. ప్రేక్షకులందరికీ సినిమా చూసి పాస్ మార్కులు ఇస్తే డైరెక్షన్ లో ఇంకా మంచి సినిమాలు తీస్తాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !