మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'ఆచార్య' చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 4 కోసం ఎదురుచూస్తున్న మెగాభిమానులకు 'ఆచార్య' సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా చిత్రం యూనిట్ ప్రకటించడంతో అందరూ నిరాశపడిపోయారు. ఆ వెంటనే సర్ ప్రైజ్ చేస్తూ ఏప్రిల్ 1న 'ఆచార్య' ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రం యూనిట్.
దాంతో నిరాశపడిపోయిన మెగాభిమానులకు హుషారొచ్చింది. కరోనా విజృంభణ నేపధ్యంలోనే సినిమా విడుదలను వాయిదా వేసారని తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డె హీరోయిన్లుగా నటించారు. రెజీనా స్పెషల్ సాంగ్ చేసింది.