View

'ర‌ఘుప‌తి వెంక‌య్య' అవార్డు గ్ర‌హీత ప‌ద్మ‌శ్రీ అల్లు రామ‌లింగ‌య్య గారికి కి హాస్య నివాళి

Thursday,July30th,2015, 10:39 AM

1922 అక్టోబ‌ర్ 1 లో ప‌శ్బిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు లో జ‌న్మించారు ప‌ద్మ‌శ్రీ అల్లు రామ‌లింగ‌య్య గారు. ఆయ‌న‌కు చిన్న‌త‌నం నుండి నాట‌కాలు అంటే చాలా ఇష్టం. జీవితమే ఓ నాట‌క రంగ‌స్ధ‌లం మ‌నంద‌రం పాత్ర‌లు మాత్ర‌మే. రంగ‌స్థ‌లం మీదున్నంత‌వ‌ర‌కే కోపాలు, ద్వేషాలు, ప్రేమ‌లు, ప‌గ‌లు నాట‌కం ముగిసాక ఎవరి దారి వారిదే అని ఎప్పుడూ ఆయ‌న త‌న స‌న్నిహితుల‌తో అంటుండేవారు. నాట‌కాలన్నా దానిలొని పాత్ర‌ల‌న్నా రామ‌లింగ‌య్య గారికి ఎంత ఇష్ట‌మంటే న‌టించాల‌నే త‌న కోరిక‌ని నెర‌వెర్చుకోవ‌టానికి ఇంట్లో వాళ్ళ‌కి తెలియ‌కుండా ఎదురు మూడు రూపాయిలు ఇచ్చి మ‌రీ త‌న మెద‌టి నాట‌కం భ‌క్త‌ప్ర‌హ్ల‌ద లో న‌టించారు.అలా అనుభ‌వం లేకున్నాకూడా న‌టించిన త‌న మెద‌టి నాట‌కంతో ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పోందారు. త‌న నాట‌కాల‌తో సామాజిక భాద్య‌త‌ని క‌లిపి ప్ర‌జ‌ల్ని చైతన్య వంతుల్ని చేసేవారు. అంతేకాదు మ‌హ‌త్మ గాంధిజి ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపునందుకుని ఉద్య‌మంలో పాల్గోని జైలుకు వెళ్ళారాయ‌న‌.. అంతేకాదు జైలుకెళ్ళినా త‌నలోని సామాజిక దృక్ప‌దాన్ని వ‌ద‌ల‌క జైలులో వున్న కొంత‌మంది ఉద్య‌మ‌కారులతో నాట‌కాలు వెసి అక్క‌డ వున్న మ‌రికొంత‌మంది ఖైదీల‌ను చైత‌న్య ప‌రుస్తూనే మ‌రోవైపు అంట‌రాని త‌నం పై పోరాటం సాగించారు.


ఇలా నాట‌కాల‌తో చిన్న పెద్ద అనే తేడాలేకుండా అల‌రించిన అల్లు పుట్టిల్లు చిత్రంతో కూడు-గుడ్డ శాస్త్రి పాత్ర‌లో న‌టించారు. ఓ ప‌క్క చిత్రాల్లో న‌టిస్తూనే ఉచిత‌ హోమియో వైద్యాన్ని కూడా చేసేవారు. అలా చ‌ల‌న‌చిత్ర జీవిత ప్రారంభంలో ఎన్నో క‌ష్టాలు ప‌డి కామెడి పాత్ర‌లే కాకుండా కామెడి విల‌నిజం తో పాటు ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు న‌టించారు. ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో నిలద్రొక్కుకున్నరు.అల్లు హాస్యపు జల్లునేకాదు కామెడీ విలనిజాన్ని కూడా బగా రక్తికట్టించాడు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్,ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం మొదలైనవి వున్నాయి. ముత్యాలముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్ లో పాల్గొన్న గొప్ప నటుడు అల్లు రామ‌లింగ‌య్య గారు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసారు. ఆయ‌న‌ అభినయించిన చాల పాటలకు బాల సుబ్ర‌మ‌ణ్యం గళం సరిగా అమరి పోయోది.' మనుషులంతా ఒక్కటే ' చిత్రంలో 'ముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా అనే పాట అప్పట్లో , ఇప్ప‌ట్లో ఎవ‌ర్ గ్రీన్ హిట్ సాంగ్.


అల్లు రామలింగయ్య గారు న‌టిడిగా బిజిగా వుంటూనే నిర్మాత మారి గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ‌ని స్టాపించి ' బంట్రోతు భార్య ' దేవుడే దిగివస్తే , బంగారు పతకం లాంటి ఉత్త‌మ చిత్రాలను నిర్మించారు. అలనాటి స్టార్ క‌మెడియ‌న్స్‌ రేలంగి, రమణారెడ్డి వంటివారి కాలంతో మొదలుకోని ఈతరం హాస్యనటులు వరకూ కొనసాగిన ఏకైక హాస్యనటుడు అల్లునే. ' ఆమ్యామ్య.. అప్పుం అప్పుం ' లాంటి ఊతపదాలు సృష్టించిన ఘ‌న‌త అల్లుకే సొంతం.


యాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ ప్ర‌పంచంలోని తెలుగు ప్రేక్ష‌కుల్ని అలరించిన అల్లు రామ‌లింగ‌య్య గారిని వరించిన సన్మానాలు, గౌరవాలు, , అవార్డులు అసంఖ్యాకమైనవి. భారత ప్రభుత్వం 1990 లో ' పద్మశ్రీ ' అవార్డు తో గౌరవించింది. ప్ర‌ముఖ క‌మెడియ‌న్ న‌టుడు రేలంగి గారి తరువాత ' పద్మశ్రీ' అందుకున్న హాస్యనటుడు అల్లు రామ‌లింగ‌య్య గారు మాత్ర‌మే.


2001 వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత ' రఘుపతి వెంకయ్య ' అవార్డు ఇచ్చి అల్లు రామ‌లింగ‌య్య గారిని గౌర‌వించింది. పాలకొల్లులో, వైజాగ్‌, రాజ‌మండ్రి, విజ‌య‌వాడ లాంటి ప్రాంతాల్లో ఆయన విగ్రహలు నెలకొల్పారు. ఆయ‌న కుమారుడు శ్రీ అల్లు అరవింద్ గారు నిర్మాతగా స్థిరపడటం, అల్లుడు మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు సినిమా చరిత్ర‌లో ఎన్నో మైలురాళ్ళు అధిరోహించ‌టంతో పాటు మ‌న‌వ‌ళ్ళు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ , స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ , శిరీష్ లు హీరోలుగా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో స‌క్స‌స్ కావ‌టం విశేషం.


అల్లు రామలింగయ్య 2004 జూలై 31 వ తేదీన తన 82 వ ఏట కన్నుమూసాడు. మరణించేనాటికి తెలుగు చిత్రసీమలో అల్లురామలింగయ్యది ప్రత్యేక స్థానం. అతను భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన హాస్యం చిరంజీవిగా మనల్ని అలరిస్తూనే ఊంటుంది. 2013లో భారత చలనచిత్ర పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలయిన 50 తపాలాబిళ్ళలలో ఒకటి అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం విడుదలయింది. తెలుగు సినిమా బ్ర‌తికున్నంత‌కాలం ఆయ‌న తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో బ్రతికే వుంటారిని ఆశిస్తూ ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుందాం..Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !