'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూసారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. బాలయ్య ప్రతిష్టాత్మక చిత్రం 'ఎన్టీఆర్' బయోపిక్... రాంచరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న #RC12 వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్ కి వస్తున్నాయి. ఆ తర్వాత బాలయ్య, బోయపాటి సినిమా సెట్స్ పైకి వెళుతుందట. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. కాగా తాజా వార్తల ప్రకారం ఈ చిత్రానికి విలన్ ఫిక్స్ అయినట్టు వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...
బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో క్రేజీగా ముందుకు దూసుకెళుతున్న కౌశల్ మందా పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. కొంతమంది దర్శక, నిర్మాతలు తమ సినిమాల్లో కౌశల్ ని నటింపజేయడానికి ప్లాన్ చేస్తున్నారట. బోయపాటి అయితే ఒక్కడుగు ముందుకేసి కౌశల్ వైఫ్ ని సంప్రదించాల్సిందిగా తన టీమ్ ని కోరారట. బాలయ్య సినిమాలో కౌశల్ ని విలన్ గా తీసుకోవడం కోసమే బోయపాటి అతని వైఫ్ ని సంప్రదించాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే కౌశల్ కి బంపర్ ఆఫర్ తగిలినట్టేనని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే కౌశల్ కొన్ని సినిమాల్లో నటించాడు. అయితే అతనికి సరైన బ్రేక్ రాలేదు. బోయపాటి లాంటి డైరెక్టర్ చేతిలో పడితే ఖచ్చితంగా కౌశల్ కెరియర్ కి మంచి మలుపు అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.