filmybuzz
filmybuzz

View

బాస్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ (స్పెషల్ ఆర్టికల్)

Thursday,May19th,2016, 11:45 PM

దండ‌యాత్ర ..! ఇది ద‌యాగాడి దండ‌యాత్ర!! అంటూ ప‌వ‌ర్‌ప్యాక్డ్ డైలాగ్‌తో అభిమానుల్లో డిస్కషన్ పాయింట్ అయ్యాడు ఎన్టీఆర్‌. ఆ ఒక్క డైలాగ్‌తో మ‌రోసారి ఫ్యాన్స్‌లో హుషారు పెంచాడు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'టెంప‌ర్‌'తో మ‌రోసారి మాస్‌లో త‌న స్టామినా ఎలాంటిదో చూపించాడు ఎన్టీఆర్‌. బాస్ ఆఫ్ మాస్ అని ఈ చిత్రం ద్వారా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. త‌న‌లోని అస‌లు సిస‌లు మాసిజం ఎలా ఉంటుందో 'ఆది', 'సింహాద్రి', 'టెంప‌ర్‌' వంటి చిత్రాల్లో చూపించాడు ఎన్టీఆర్‌. రామ‌య్యా వ‌స్తావ‌య్యా, ర‌భ‌స‌ లాంటి ఫ్లాప్ సినిమాల త‌ర్వాత కెరీర్‌కి కీల‌క‌మైన హిట్ 'టెంపర్'. ఎన్టీఆర్ స్టామినాను మరోసారి ప్ర‌పంచానికి ఆవిష్క‌రించిందీ చిత్రం. ఈ యేడాది సంక్రాంతికి 'నాన్నకు ప్రేమతో' అంటూ ఓ క్లాస్ మూవీ చేసి, తొలిసారి 50కోట్ల క్లబ్ లో చేరి తన సత్తా చాటుకున్నాడు. అయితే ఇలాంటి హిట్లు, బ్లాక్‌బ‌స్ట‌ర్లు, అప‌జ‌యాలు అత‌డికి కొత్తేమీ కాదు.


ఎన్టీఆర్‌ కెరీర్‌ని ఓసారి త‌ర‌చి చూస్తే .. అత‌డు న‌టించిన రెండో సినిమానే ఇండ‌స్ర్టీలో సూప‌ర్‌హిట్‌. 'నిన్ను చూడాల‌ని' (2001) సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించి రెండో ప్ర‌య‌త్న‌మే ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో 'స్టూడెంట్ నంబ‌ర్ 1' (2001)లో న‌టించి సూప‌ర్‌హిట్ కొట్టాడు. ఆ త‌ర్వాత వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఆది' సినిమాతో బాక్సాఫీస్‌ని రికార్డుల‌తో షేకాడించాడు. మాస్‌లో ఈ సినిమా బంప‌ర్ హిట్ కొట్టింది. ఆ త‌ర్వాత ఓ రెండు ప‌రాజ‌యాలు కెరీర్‌ని ఇబ్బందిపెట్టినా .. మ‌రోసారి త‌న‌కి తొలి విజ‌యాన్ని ఇచ్చిన రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలోనే 'సింహాద్రి' వంటి ఇండ‌స్ర్టీ హిట్‌తో ట్రాక్‌లోకి వ‌చ్చాడు. 2003లో రిలీజైన 'సింహాద్రి' బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 30 కోట్లు వ‌సూలు చేసి స‌రికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. మాస్‌లో మాసివ్ హిట్ ఇది. ఆ క్ర‌మంలోనే క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ పూరి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన 'ఆంధ్రావాలా' కెరీర్‌లోనే పెద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. అలాంటి టైమ్‌లో త‌న‌కి అల‌వాటైన ద‌ర్శ‌కుడు వినాయ‌క్ సార‌థ్యంలో 'సాంబ' చిత్రంలో న‌టించాడు. ఆ సినిమా బ‌క్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్ గా నిలిచింది. 'న‌ర‌సింహా', 'అశోక్‌' వంటి ఫ్లాప్స్ తర్వాత 'రాఖీ' వంటి యావరేజ్ సినిమా చేశాడు. ఆ తర్వాత త‌న ఫేవ‌రెట్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళితోనే ముచ్చ‌ట‌గా మూడో సినిమాలో న‌టించాడు. ఫాంట‌సీ, య‌మ‌లోకం బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కిన 'య‌మ‌దొంగ' కెరీర్‌లో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఆ క్ర‌మంలోనే మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో 'కంత్రి'తో మ‌రో ప‌రాజ‌యం. ఆ వెనువెంట‌నే త‌ను న‌మ్మే స్టార్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో 'అదుర్స్' చిత్రంలో న‌టించి కెరీర్‌లో కీల‌క‌మైన టైమ్‌లో హిట్ కొట్టాడు. ఈ సినిమాలో రెండు డిఫ‌రెంట్ గెట‌ప్పుల్లో క‌నిపించి ఎన్టీఆర్ మ్యాజిక్ చేశాడు. ఆ వెంట‌నే దిల్‌రాజు సంస్థానంలో వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కత్వంలో 'బృందావ‌నం'తో మ‌రో క్లాసిక్ హిట్ కొట్టాడు. కెరీర్ పీక్స్‌లో మ‌రోసారి కుదుపు. వ‌రుస‌గా 'శ‌క్తి', 'ఊస‌ర‌వెల్లి', 'ద‌మ్ము' వంటి ప‌రాజ‌యాలు ఎన్టీఆర్‌ని పూర్తిగా బ్యాక్ ఫుట్ వేసేలా చేశాయి. ఈ ప‌రాజ‌యాల నుంచి త‌న‌ని తాను బైట‌ప‌డేసే ద‌ర్శ‌కుడి కోసం ఎంతో వేచి చూశాడు తార‌క్‌. ఆ టైమ్‌లోనే శ్రీ‌నువైట్ల 'బాద్‌షా' రూపంలో ఓ హిట్ ఇచ్చాడు. ఇక కుదురుకున్న‌ట్టే అనుకుంటున్న టైమ్‌లో వ‌రుస‌గా 'రామ‌య్యా వ‌స్తావయ్యా', 'ర‌భ‌స' ఫ్లాప్‌లు చిక్కుల్లోకి నెట్టాయి. స‌రిగ్గా అలాంటి టైమ్‌లో 'టెంప‌ర్' విజ‌యం త‌న‌కి పెద్ద అస్సెట్‌గా నిలిచింది. ఆ తర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 'నాన్న‌కు ప్రేమ‌'తో చిత్రంలో న‌టించాడు. రివేంజ్ డ్రామాతో రూపొందిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ కి మరో కీలక మలుపు అయ్యింది. ఈ సినిమా ఎన్టీఆర్ ని 50కోట్ల క్లబ్ లో చేర్చింది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' టైటిల్ తో పక్కా మాస్ ఎంటర్ టైనర్ ని చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరియర్ లో మరో కీలక మలుపుకు నాందికానుంది.


బాల‌న‌టుడిగా 'బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర' (1991) చిత్రంలో తాత ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించాడు. ఆ త‌ర్వాత 1996లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'బాల రామాయ‌ణం' చిత్రంలో రాముడిగా న‌టించి బాల‌న‌టుడిగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయాడు. ఇప్ప‌టికి కెరీర్‌లో 25 చిత్రాల్లో న‌టించాడు. ఇన్నేళ్ల‌లో మాస్‌లో బాస్‌గా ఎన్టీఆర్ అంచెలంచెలుగా ఎదిగిన వైనం అసాధార‌ణ‌మైన‌ది. నంద‌మూరి వంశం నుంచి నటసింహం బాల‌య్య‌బాబు త‌ర్వాత ఆ స్థాయిలో ఎన్టీఆర్‌కి మాత్ర‌మే క్రేజు ఉంద‌న్న‌ది స‌త్యం. ఎన్టీఆర్ ఓ స్టార్‌గానే కాదు, ఓ గొప్ప మాన‌వ‌తావాదిగానూ పేరు తెచ్చుకున్నాడు. త‌న‌ని న‌మ్మే ద‌ర్శ‌కులంటే ఎన్టీఆర్ ప్రాణం పెట్టేస్తాడు. ఫ్లాప్ ద‌ర్శ‌కుడు అన్న ముద్ర వేసి స్నేహాన్ని వ‌దిలేయ‌ని గొప్ప వ్య‌క్తిత్వం ఎన్టీఆర్‌ది. త‌న‌కి 'కంత్రి' వంటి ఫ్లాప్‌నిచ్చిన మెహ‌ర్‌తోనే 'శ‌క్తి' సినిమా చేశాడు. ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకునే ఆప్తుడిగానూ అభిమానులు చెబుతుంటారు. కెరీర్‌లో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ఫిలింఫేర్‌ల‌ను నాలుగు సార్లు అందుకున్నాడు. 'స్టూడెంట్ నంబ‌ర్ 1' చిత్రంతో నంది జ్యూరీ అవార్డును కైవ‌శం చేసుకున్నాడు. పారిశ్రామిక‌వేత్త, బిజినెస్ మ్యాగ్నెట్‌, ల్యాండ్ లార్డ్‌ నార్నే శ్రీ‌నివాస‌రావు త‌న‌యురాలు ల‌క్ష్మి ప్ర‌ణ‌తిని మ‌నువాడి ఓ బిడ్డ (అభ‌య్‌రామ్‌)కు తండ్రి అయ్యాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుని 50 కోట్ల క్ల‌బ్ నుంచి 100 కో్ట్ల క్ల‌బ్ స్థాయి హీరోగా ఎద‌గ‌డ‌మే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. ఓవ‌ర్సీస్‌లోనూ, పొరుగు భాష‌ల్లోనూ మార్కెట్ రేంజుని విస్త‌రించాల‌న్న సంక‌ల్పంతో ఉన్నాడు. ఆ ల‌క్ష్యం 'జనతా గ్యారేజ్' చిత్రంతో అందుకోవాల‌ని కోరుకుందాం. ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఇలాంటి పుట్టినరోజులను ఆయన మరిన్ని జరుపుకుంటూ అభిమానులను, ప్రేక్షకులను అలరించాలని ఫిల్మీబజ్ డాట్ కామ్ టీమ్ కోరుకుంటోంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై సక్సెస్ ఫుల్ గా ముందుకు దూస ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !