View

తేనె మనసు కృష్ణ @ 50

Tuesday,March31st,2015, 07:03 AM

'మనిషి మేని ఛాయ మాత్రమే కాదు.. మనసు కూడా తెలుపే..' సూపర్ స్టార్ కృష్ణ గురించి ఏదైనా చెప్పాలంటే ముందుగా ఈ మాటలను చెబితేనే బాగుంటుంది. స్వచ్ఛమైన తెల్ల కాగితంలాంటి మనసు కృష్ణది. చిత్రసీమకు ఎంతోమంది నటీనటులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, కొంతమందే ఎప్పటికీ అందరి మనసుల్లో నిలిచిపోతారు. అలాంటివాళ్లల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. నటుడిగానే కాకుండా వ్యక్తిగా కూడా అందరి అభిమానాన్నీ సంపాదించుకున్నారు. నేడు (31.3.2015) కృష్ణ పుట్టినరోజు. నటుడిగా ఆయన పుట్టి 50 ఏళ్లయ్యింది. అవును.. కథానాయకునిగా కృష్ణ నటించిన తొలి చిత్రం 'తేనె మనసులు' సరిగ్గా ఈరోజు (మార్చి, 31) విడుదలైంది. 50 ఏళ్ల సినీ జీవితంలో నటశేఖర్ కృష్ణ 'ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్' అనదగ్గ చిత్రాలు చాలానే చేశారు. నేడు ఈ నటశేఖర్ పుట్టినరోజుని పురస్కరించుకుని, నటుడిగా 50 ఏళ్లు చరిత్ర సొంతం చేసుకున్న సందర్భంగా 'సూపర్ స్టార్ కృష్ణ' గురించి ప్రత్యేక కథనం...

Super Star Krishna Holds First of it's Kind Record

పదండి ముందుకుతో నటుడిగా ముందుకు...
గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెం కృష్ణ స్వస్థలం. బీయస్సీ వరకు చదువుకున్నారు. కాలేజీ డేస్ లో అక్కినేని నాగేశ్వరరావుకి జరిగిన సన్మానం చూసి, సినిమా హీరో అయితే బాగుండు అనుకున్నారు కృష్ణ. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అప్పటికే మ్రదాసులో సినిమాల్లో రాణిస్తున్న నిర్మాత చక్రపాణిని కలిశారు. కానీ, వయసు తక్కువ ఉందనీ, కొన్నాళ్లు ఆగమని ఆయన సలహా ఇవ్వడంతో ఈ బుర్రిపాలెం బుల్లోడు వెనక్కి వచ్చేశారు. తన ఊళ్లోనే కొన్ని నాటకాల్లో నటించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ మద్రాసు వెళితే, 'పదండి ముందుకు' చిత్రంలో చిన్న పాత్ర చేసే అవకాశం దక్కింది. ఆ తర్వాత రెండు మూడు చిత్రాల్లో చిన్నపాటి పాత్రలు పోషించారు కృష్ణ.
 
'తేనె మనసులు'తో జోరుగా...
సరిగ్గా ఆ సమయంలో నూతన నటీనటులతో దర్శక, నిర్మాత ఆదుర్తి సుబ్బరావు ఓ సినిమా తీస్తున్నారని తెలిసి, కృష్ణ తన ఫొటోలను, బయోడేటాను పంపించారు. ఆ సినిమాకి కృష్ణంరాజు, హేమ మాలిని, జయలలితలు కూడా స్ర్కీన్ టెస్ట్ కి వచ్చారు. కానీ, సెలక్ట్ కాలేదు. ఆ అవకాశం కృష్ణను వరించింది. ఆదుర్తి దగ్గర సహాయ దర్శకునిగా చేసిన కె. విశ్వనాథ్ డైలాగులు ఎలా పలకాలో కృష్ణకు నేర్పించారు. హీరాలాల్ మాస్టర్ డాన్స్ నేర్పించారు. అన్నీ శ్రద్ధగా నేర్చుకున్నారు. స్వతహాగా అందగాడు కావడంతో, తొలి చూపులోనే అందర్నీ ఆకట్టుకున్నారు కృష్ణ. దాంతో పాటు 'తేనె మనసులు'లో చక్కగా అభినయించడం, ఆ సినిమా కూడా బాగుండటంతో తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. 'తేనె మనసులు' సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా అప్పటి ప్రముఖ దర్శక, నిర్మాతల దృష్టి కృష్ణ పై పడింది. ఆ తర్వాత కన్నె మనసులు, గూఢచారి 116, ఇద్దరు మొనగాళ్లు, సాక్షి.. ఇలా వరుసగా సినిమాలు చేశారు కృష్ణ.
 
రోజుకి మూడు షిఫ్టులు
కృష్ణ ఎంత బిజీగా సినిమాలు చేశారో చెప్పడానికి చాలా ఉదాహరణలున్నాయి. 1969 నుంచి 72 లోపు కృష్ణ ఏకంగా 60 సినిమాల వరకూ నటించారు. నేటితరం హీరోలు తమ కెరీర్ మొత్తంలో 60 చిత్రాలు చేయగలుగుతారా? అనే పరిస్థితి ఉంది. అలాంటిది నాలుగేళ్లల్లో 60 చిత్రాలు చేశారంటే ఎంత కష్టపడి ఉంటారో ఊహించవచ్చు. ఉదయం ఏడు గంటలకు మొదలుపెట్టి రాత్రి పది గంటల వరకు కృష్ణ మూడు షిఫ్టులు చేసిన రోజులు ఎక్కువ. కంటి నిండా నిద్రపోయిన రోజులూ తక్కువే. అంత కష్టపడ్డారు కాబట్టే, నటుడిగా ఎప్పటికీ చర్రితలో మిగిలిపోయే పేరుని సంపాదించుకున్నారు. దాదాపు 350 పై చిలుకు చిత్రాల్లో నటించిన ఘనత కృష్ణది.

ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చిత్రాలన్నీ కృష్ణవే
తెలుగులో తొలి ఈస్ట్ మన్ కలర్ చిత్రం (ఈనాడు)లో నటించిన ఘనత కృష్ణదే. అలాగే, తొలి 70ఎంఎం చిత్రం (సింహాసనం), తొలి స్కోప్ చిత్రం (అల్లూరి సీతారామరాజు), తొలి డీటీయస్ చిత్రం (తెలుగు వీర లేవరా).. ఇలా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనదగ్గ చిత్రాలు చేసిన ఘనత కృష్ణకే దక్కుతుంది. అది మాత్రమే కాదు.. 'మోసగాళ్లకు మోసగాడు'తో తెలుగులో కౌబోయ్ చిత్రాలకు నాంది పలికిన క్రెడిట్ కూడా ఆయనదే. 'అల్లూరి సీతారామరాజు' గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది,. ఎన్నో వ్యయ ప్రయాసకోర్చి సొంత సంస్థ పై కృష్ణ తీసిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లో 'మాయాబజార్' తర్వాత భారీ తారాగణం నటించిన చిత్రం ఇదే.
 
ఎన్నో అవార్డులు.. రివార్డులు..
తన 50 ఏళ్ల సినీ జీవితంలో కృష్ణ అందుకున్న అవార్డులు, రివార్డులు ఎన్నో. వాటిలో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ జాతీ అవార్డు, నంది అవార్డు.. ఇలా ఎన్నో ఆయనకు దక్కాయి. నటుడిగా మాత్రమే కాదు.. వ్యక్తిగా కూడా మంచితనానికి చిరునామా అనిపించుకున్న ఈ నటశేఖరుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన పుట్టినరోజు సందర్భంగా 'ఫిల్మీబజ్..కామ్' శుభాకాంక్షలు అందజేస్తోంది.
 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !